రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయా ఈవీ (Okaya EV) ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది మరియు తమ పాపులర్ ఫాస్ట్ సిరీస్ లో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఒకాయా ఫాస్ట్ సిరీస్ లో F2B (ఫాస్ట్ 2బి) మరియు F2T (ఫాస్ట్ 2టి) వేరియంట్లను విడుదల చేసింది. ఈ రెండు కొత్త వేరియంట్‌లు ఇప్పుడు ఫాస్ట్ ఎఫ్4 వేరియంట్‌ సరసన చేర్చబడ్డాయి.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, పండుగ సీజన్ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు ఈవీ తయారీదారులు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో పాటుగా వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఒకాయా కూడా తమ ఇ-స్కూటర్ల కొనుగోలుపై లక్కీ డ్రా ఆఫర్లను ప్రకటించింది. ఇందులో పాల్గొనే కస్టమర్లు కార్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సెల్‌ఫోన్లు, వెండి నాణేలు, ప్రైజ్‌మనీ మొదలైనవి గెలుచుకునే అవకాశం పొందవచ్చు.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ స్కీమ్ అక్టోబర్ 31, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందని గమనించాలి. ఒకాయా కొత్తగా విడుదల చేసిన ఫాస్ట్ ఎఫ్‌2బి వేరియంట్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, ఫాస్ట్ ఎఫ్2టి వేరియంట్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, కంపెనీ ఇటీవలే గతంలో రూ. 89,999 గా ఉన్న ఫాస్ట్ ఎఫ్4 వేరియంట్ ధరను రూ. 1.09 లక్షలకు పెంచింది. ప్రస్తుత ఎఫ్4 వేరియంట్ తో పోల్చుకుంటే ఎఫ్2బి మరియు ఎఫ్2డి వేరియంట్‌లలో కంపెనీ తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ లను ఉపయోగించింది.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ఒకాయా ఈ రెండు ఇ-స్కూటర్లలోనూ ఒకే రకమైన 2.2 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. ఈ బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జింగ్ పై 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అదేవిధంగా, ఈ రెండింటిలో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఒకే రకంగా ఉంటుంది, వీటిలో 2000 వాట్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ మోటార్ యొక్క గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 కూడా ఇదే రకమైన పనితీరును అందిస్తుంది, కాకపోతే ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ మరియు మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ఒకాయా ఫాస్ట్ ఎఫ్4 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.4 kWh LFP బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జింగ్ పై 140 నుండి 160 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ మరియు అధిక రేంజ్ కారణంగా ఈ మోడల్ ధర కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, బడ్జెట్ ఈవీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఒకాయా ఈ కొత్త ఎఫ్2బి మరియు ఎఫ్2టి ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్2బి ఇ-స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్‌బోర్డ్ క్రింది భాగంలో ఉంటుంది, కాగా ఎఫ్2టి స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ సీట్ క్రింది భాగంలో ఉంటుంది.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

ఒకాయా ప్రస్తుతం లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ విభాగాలలో వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.74,999 నుండి రూ.1,09,000 వరకూ ఉన్నాయి. ఒకాయా ఇ-స్కూటర్లను దేశవ్యాప్తంగా ఉన్న 550కి పైగా షోరూమ్ ల నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఒకాయా ఇ-స్కూటర్లను ఆన్‌లైన్ రీటైల్ ప్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ ఇటీవలే అమేజాన్ సంస్థతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒకాయా.. ఇ-స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన కానుకలు..!

అమేజాన్ మొట్టమొదటి సారిగా తమ ప్రోడక్ట్ క్యాటగిరీలో వెహికల్ (వాహనం) అనే కొత్త విభాగాన్ని కూడా చేర్చింది. ఈ విభాగం ద్వారా ఒకాయా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పుడు అమేజాన్ వెబ్‌సైట్ / యాప్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన ఇ-స్కూటర్లను కస్టమర్లు నేరుగా ఇంటి వద్ద కూర్చునే డెలివరీ పొందవచ్చు. అంతేకాకుండా, తమ వినియోగదారులకు వివిధ రకాల ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పించేందుకు ఒకాయా పలు బ్యాంకులు మరియు ఇత ఫైనాన్సింగ్ కంపెనీలతో కూడా ఒప్పందాన్ని కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2022, 15:46 [IST]
English summary
Okaya ev launches f2b and f2t electric scooters details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+