డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా (Ola) ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఎస్1 మరియు ఎస్1 ప్రో స్కూటర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంపెనీ ఈ స్కూటర్లను బుక్ చేసుకున్న చాలామంది కస్టమర్లకు డెలివరీ కూడా చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఒక కొత్త ప్రచారం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

నివేదికల ప్రకారం.. ఓలా కంపెనీ ఇప్పుడు గ్యారెంటెడ్ 14 రోజుల డెలివరీ ప్రచారాన్ని విడుదల చేస్తోంది. దీని ప్రకారం ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 14-రోజుల డెలివరీ హామీని పేర్కొంటూ పరిమిత సంఖ్యలో సంభావ్య కస్టమర్‌లకు ఇమెయిల్ పంపింది. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా వెలువడింది. ఆ పైన కంపెనీ దీని గురించి సమాచారం అందించలేదు.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

అది మాత్రమే కాకుండా, డెలివరీలకు సంబంధించిన అధికారిక సమాచారం కూడా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 14 డెలివరీ ప్రచారాన్ని విడుదల చేసినప్పటికీ అది ఎప్పుడు ప్రారభించబడుతుంది అనేది కూడా ఖచ్చితంగా వెల్లడించలేదు. అయితే బుక్ చేసుకోవడానికి రూ. 499 అని ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. కావున బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ లో రూ. 499 చెల్లించి రిజర్వేషన్ చేసుకోవచ్చు.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

బుక్ చేసుకున్న తరువాత సేల్స్ విండో ప్రారంభించినప్పుడు రూ. 20,000 చెల్లించి, ఆ తరువాత డెలివరీకి ముందుగానే మిగిలిన మొత్తం డబ్బును చెల్లించి దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇందులో మొదట మొత్తం డబ్బు చెల్లించాలి. ఆ తరువాత ఫేమ్-2 కింద మీకు లభించే సబ్సిడీ తిరిగి మీకు అందుతుంది.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

అయితే ఇప్పుడు కంపెనీ ఈ 14-రోజుల గ్యారెంటీ డెలివరీ కౌంట్‌డౌన్ ప్రారంభానికి సంబంధిచిన మరిన్ని వివరాలు వెల్లడించలేదు. అయితే కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం 14 రోజుల్లో డెలివరీ జరగకపోతే ఏమి జరుగుతుంది అనే విషయంపైన కూడా స్పష్టత లేదు. కానీ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఇది పేరుమోసిన పెద్ద సంస్థ కాబట్టి 14 రోజుల్లో డెలివరీ చేసే సామర్థ్యం ఉంది.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

గత సంవత్సరం డిసెంబర్ మధ్యలో డెలివరీలను ప్రారంభించినప్పటి నుండి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఫైన్షియల్ అసిస్టెన్స్ సిగ్నిఫికేషన్ వంటి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ప్రారంభ డెలివరీలలో కొంత జాప్యం జరిగినప్పటికీ క్రమంగా డెలివరీలు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం కంపెనీ 24 గంటల్లో డెలివరీ చేసి కొత్త రికార్డ్ కూడా సృష్టించగలిగింది. కావున కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇక మీద తప్పకుండా డెలివరీలు వేగవంతం అవుతాయి.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

14 రోజుల డెలివరీకి సంబంధించిన సమాచారం ప్రకారం.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని కొంతమంది కస్టమర్‌లకు మాత్రమే ఈ ఇమెయిల్‌లు పంపబడుతున్నాయి. కావున దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల తన 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధరను ఏకంగా రూ. 10,000 వరకు పెంచింది. ప్రస్తుతం ధరల పెరుగుదల తరువాత 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద ధరలు ఆయా రాష్ట్రాన్ని బట్టి తగ్గుతాయి.

డెలివరీపై సంచలన నిర్ణయం తీసుకున్న 'ఓలా'.. ప్రయత్నం ఫలిస్తుందా..!!

కానీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఓలా ఎస్1 ధర మాత్రం పెరగలేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. పెరిగిన ధరలు కంపెనీ యొక్క అమ్మకాలమీద ఏమైనా ప్రభావం చూపుతుందా.. లేదా అనేది త్వరలో తెలుస్తుంది. అప్పటి వరకు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించిన సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ola electric giving ola s1 pro with 14 days guaranteed delivery details
Story first published: Monday, May 30, 2022, 19:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X