ఎప్పటికప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కొత్త అడుగులు.. భారీగా పెరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య

ఓలా ఎలక్ట్రిక్ దేశం మొత్తమ్ మీద ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా మొత్తమ్ 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించి 'డైరెక్ట్ టు కన్స్యూమర్' (D2C) ఫుట్‌ప్రింట్‌ను విస్తరించదానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరులో 3 ఎక్స్పీరియన్స్ సెంటర్లు, పూణేలో రెండు, అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీ, హైదరాబాద్‌, కోట, భోపాల్‌, నాగ్‌పూర్‌, రాంచీ మరియు వడోదర వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. ఇవన్నీ కూడా వినియోగదారులకు వాహనం గురించి తెలుసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

పెరుగుతున్న ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్

దేశం మొత్తమ్ మీద ఓలా ఎలక్ట్రిక్ 2023 మార్చి నెల నాటికి 200 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలను చేస్తుంది. ఇదే జరిగితే కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త శకం ప్రారభించే అవకాశం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లన్నీ కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా.. టెస్ట్ రైడ్ వంటి వాటికి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభించిన మరియు ప్రారంభించే ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి కొనుగోలు చేయడానికంటే ముందే కావలసిన విషయాలను తెలుసుకోవచ్చని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ 'అన్షుల్ ఖండేల్వాల్' అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లు దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తాయి. దీని కోసం కంపెనీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. కావున కస్టమర్లు ఆఫ్-లైన్ ద్వారా కూడా స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారతదేశం మొత్తమ్ మీద ఒక లక్ష కంటే ఎక్కువ కస్టమర్ టెస్ట్ రైడ్‌లను నిర్వహించింది. రానున్న రోజుల్లో భారతదేశం మొత్తమ్ మీద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. కావున ఓలా ఎలక్ట్రిక్ ఈ దిశ వైపు తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది. 2025 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మాత్రమే రాజ్యమేలుతాయన్నది అందరికి తెలిసిన నిజం.

ఇదిలా ఉండగా గత దీపావళి సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'ఎస్1 ఎయిర్' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

కంపెనీ కస్టమర్లకు త్వరితగతిన డెలివరీలను చేయడానికి ఉత్పత్తిని వేగవతం చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల తన S1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 1,00,000 వ యూనిట్ విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎస్1 స్కూటర్ యొక్క ఒక లక్ష యూనిట్ తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడింది.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపిన సమాచారం ప్రకారం, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లు కేవలం 2 లేదా 3 రోజుల్లోనే డెలివరీ పొందవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా, కంపెనీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. దేశీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి చేయవల్సిన అన్ని ప్రయత్నాలను కంపెనీ ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు సాగుతోంది.

Most Read Articles

English summary
Ola electric opens 14 experience centres in 11 cities
Story first published: Wednesday, November 30, 2022, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X