భారతదేశంలో మొట్టమొదటి ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric). ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళుతోంది. అయితే ఈ కంపెనీకి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో ఒక డీలర్షిప్ గానీ, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గానీ లేదు. ఎందుకంటే కంపెనీ తన కార్యకలాపాలను మొత్తం ఆన్లైన్ లో కొనసాగిస్తోంది.

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ దేశంలో మొట్ట మొదటి తన EV సెటర్లను ఓపెన్ చేసింది. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన ఈవీ సెంటర్లను పూణే మరియు చండీగఢ్‌లలో ప్రారంభించింది. ఈ ఈవీ సెంటర్లలో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెమో మరియు టెస్ట్ రైడ్‌లకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తుంది. కావున కస్టమర్లు ఈ సెంటర్లను సందర్శించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపైన అవగాహన పెంచుకోవచ్చు. ఇది కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ఇప్పటివరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడానికి నేరుగా హోమ్ డెలివరీ ఆప్సన్ ఎంచుకుంది. నిజానికి హోమ్ డెలివరీ ప్రారభించిన మొదటి కంపెనీ బహుశా ఓలా ఎలక్ట్రిక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

దేశం మొత్తం మీదుగా ఒక్క డీలర్‌షిప్ కూడా లేకుండా నేరుగా కస్టమర్‌లకు డెలివరీ చేయడం కొంత క్లిష్టమైన సమస్యే అని చెప్పాలి. అయితే దీనిగురించి కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. అయితే మొత్తం మీద హోమ్ డెలివరీ దాదాపు విజయవంతం అయింది.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపైన అవగాహనా పెంచడానికి మరియు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన విషయాలను కస్టమర్లకు తెలియజేయడానికి EV సెంటర్లు చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు రెండు సెంటర్లను ప్రారంభించింది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని ఆసితున్నాము.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ఇప్పుడు ప్రారంభమైన కొత్త ఓలా సెంటర్లను సందర్శించి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల డెమో మరియు టెస్ట్ రైడ్ మాత్రమే కాకుండా హైపర్ మోడ్, మ్యూజిక్, నావిగేషన్, కలర్ ఆప్షన్స్, బూట్ స్పేస్‌తో సహా స్కూటర్ కొనుగోలు ప్రక్రియ యొక్క పూర్తి వివరాలను తెలిసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన అనుభవజ్ఞులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కావున ఇది కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడే అవకాశం ఉంటుంది.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తన కొత్త 'ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారభించింది. కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ 10,000 బుకింగ్స్ పొందింది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను సెప్టెంబర్ 07 ప్రారంభించింది. ఇందులో భాగంగానే చాలామంది కస్టమర్లకు డెలివరీ కూడా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

కంపెనీ తన కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 99,999 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఓలా ఎస్1 ఇ-స్కూటర్‌ను కొత్తగా బుక్ చేసుకోవడానికి కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని సందర్శించి రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 11.3 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకే 95 కిమీ వరకు ఉంటుంది. కాగా 0 నుంచి 40 కిమీ/గం వేగవంతం కావడానికి కేవలం 04 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి పరిధిని అందిస్తుంది. ARAI ద్వారా ధ్రువీకరించిన దాని ప్రకారం ఇది 131 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే వాస్తవ ప్రపంచంలో సాధారణ రోడ్లపైన 128 కిమీ రేంజ్ (ఎకో మోడ్) అందిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో దీని పరిధి 90 కిమీ కాగా, నార్మల్ మోడ్ లో 101 కిమీ వరకు ఉంటుంది.

ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో మంచి ప్రజాదరణ పొందింది, అయితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారును కూడా దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కంపెనీ విడుదక చేయనున్న ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన కొంత సమాచారం కూడా వెల్లడించింది. అయితే ఇది 2023 నాటికి భారతీయ రోడ్లపైన తిరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ola electric opens first ev centre details
Story first published: Monday, September 19, 2022, 10:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X