మీరు 'ఓలా ఎస్1' (Ola S1) బుక్ చేసుకున్నారా.. డెలివరీలు మొదలైపోయాయ్..!!

ఓలా ఎలక్ట్రిక్ (Ola Eletric) యొక్క 'ఎస్1' (S1) స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి బుకింగ్స్ పొందగలిగింది. అయితే బుక్ చేసుకున్న కస్టమర్లందరూ ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న డెలివరీలు ఎట్టకేలకు మొదలయ్యాయి.

Recommended Video

Ola Electric Scooter First Impressions In Telugu | S1Pro Model Range, Top Speed & Other Details

కంపెనీ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎన్ని బుకింగ్స్ పొందింది, దీని డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తన కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 10,000 బుకింగ్స్ పొందింది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలను నిన్నటి నుంచి (సెప్టెంబర్ 07) ప్రారంభించింది. ఇందులో భాగంగానే చాలామంది కస్టమర్లకు డెలివరీ కూడా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

కంపెనీ తన కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని రూ. 99,999 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఓలా ఎస్1 ఇ-స్కూటర్‌ను కొత్తగా బుక్ చేసుకోవడానికి కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని సందర్శించి రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది దాదాపు మొదటి నుంచి జరుగుతున్న బుకింగ్ ప్రక్రియ, కావున దాదాపు అందరికి తెలిసిందే.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 11.3 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకే 95 కిమీ వరకు ఉంటుంది. కాగా 0 నుంచి 40 కిమీ/గం వేగవంతం కావడానికి కేవలం 04 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి పరిధిని అందిస్తుంది. ARAI ద్వారా ధ్రువీకరించిన దాని ప్రకారం ఇది 131 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే వాస్తవ ప్రపంచంలో సాధారణ రోడ్లపైన 128 కిమీ రేంజ్ (ఎకో మోడ్) అందిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో దీని పరిధి 90 కిమీ కాగా, నార్మల్ మోడ్ లో 101 కిమీ వరకు ఉంటుంది.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్, ఎకో మోడ్, ఎలక్ట్రిక్ స్టీరింగ్ కంట్రోల్ లాక్, మ్యూజిక్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్, రిమోట్ బూట్ లాక్ మరియు అన్‌లాక్, బ్లూటూత్, GPS కనెక్టివిటీ, నావిగేషన్, సైడ్ స్టాండ్ అలర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ దాదాపుగా దాని ఎస్1 ప్రో స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక కలర్స్ అయిన 'జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్ మరియు నియో మింట్' అనే మొత్తం 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెరుగైన బ్రేకింగ్ కోసం రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉన్నాయి. ఇవి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తాయి. అదే సమయంలో సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందువైపు సింగిల్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలలో రానున్న కొత్త ఓలా ఎలక్ట్రిక్ కార్ ఆధినిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ తో విడుదల కానున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఇది భారతదేశపు టెస్లా అని కూడా భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇప్పటికే చాలాసార్లు తమ ఎలక్ట్రిక్ కారుని 2023 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపారు. కావున వచ్చే ఏడాదినాటికి ఓలా ఎలక్ట్రిక్ కారు భారతీయ రోడ్లపైన తిరగనుంది.

మీరు 'ఓలా ఎస్1' బుక్ చేసుకున్నారా.. డెలివరీల మొదలైపోయాయ్..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ మొదటి నుంచి మంచి అమ్మకాలతో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా దీనికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికి తన కొత్త ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మొదలైపోయాయి. కాగా రానున్న రోజుల్లో వీటి బుకింగ్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని, డెలివరీలు మరింత వేగవంతం అవుతాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Ola electric s1 scooter delivery starts details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X