పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. అయితే, ఈసారి మంచి విషయంతో మాత్రం కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారులు ఇప్పటికే కస్టమర్ సర్వీస్, బ్యాటరీ రేంజ్ వంటి విషయాలపై ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ల ఫ్రంట్ సస్పెన్షన్ లో సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. కొన్ని సంఘటనల్లో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై రోడ్డుపై ప్రయాణిస్తుండగా, హఠాత్తుగా మందు సస్పెన్షన్ విరిగిపోయి, యాక్సిడెంట్ జరగటం మరియు ఈ యాక్సిడెంట్స్ లో పలువురు గాయపడటం కూడా జరిగింది.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

లక్ష రూపాయలు పోసి కొనుగోలు చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఇప్పుడు తాము పడరాని పాట్లు పడుతున్నామని కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలను చూస్తే, అందులో ఆ స్కూటర్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్‌లో కొంత భాగం విరిగిపోయింది. ఆ పోస్ట్‌లో సదరు యూజర్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫ్రంట్ ఫోర్క్ చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఇది తయారీ లోపానికి సంబంధించిన సమస్య అని, కాబట్టి తన విరిగిపోయిన పాత స్కూటర్ స్థానంలో కొత్త స్కూటర్ ను అందించాలని ఆ పోస్ట్‌లో ఓలా వినియోగదారుడు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, అతను కంపెనీని రీప్లేస్‌మెంట్ మరియు డిజైన్ మార్పు కోసం అభ్యర్థించారు. మెటీరియల్ నాణ్యత తక్కువగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని సదరు వినియోగదారుడు నిందించారు. ఈ స్కూటర్లలో సస్పెన్షన్ విరిగిపోవడం గరించే ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన ఇటీవలి సంఘటనలో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ స్పీడ్‌తో రివర్స్ మోడ్‌లోకి వెళ్లడంతో ఒక రైడర్ గాయపడ్డాడని పేర్కొన్నాడు. ఆ తర్వాత జబల్‌పూర్‌లో 65 ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. గాయపడిన వ్యక్తి ఘటనలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కలిగి ఉన్న వ్యక్తి తండ్రి. ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను పార్కింగ్ చేస్తున్నప్పుడు ఈ స్కూటర్ గంటకు 50కిమీ కంటే ఎక్కువ వేగంతో రివర్స్ కావడంతో అతని తండ్రికి తీవ్రగాయాలయ్యాయని యజమాని పేర్కొన్నాడు.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఇంతకుముందు, మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుని కుమారుడు కూడా ఇలాంటి సంఘటననే నివేదించాడు. యజమాని ప్రకారం, ఈ సంఘటన "రీజెనరేటివ్ బ్రేకింగ్‌ లో లోపం కారణంగా స్పీడ్ బ్రేకర్‌లో నెమ్మదించడానికి బదులుగా, స్కూటర్ వేగవంతం అయిందని" పేర్కొన్నారు. ఓలా వినియోగదారు యొక్క టెలిమెట్రీ డేటాను బహిరంగంగా విడుదల చేసింది మరియు డేటా గోప్యత కోసం వినియోగదారు హక్కుతో కూడిన తాజా వివాదంలో పడింది.

అయితే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడ్డాయని తెలిపింది. ఇప్పటికే భారతీయ రోడ్లపైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగంలో ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 45 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించినట్లు కూడా నివేదికల చెబుతున్నాయి. అయితే ఇటీవల వెలువడిన ఫ్రంట్ ఫోర్క్ విరిగిన సంఘటనలకు వివిధ కారణాలు ఉండే అవకాశం ఉంది. కానీ కంపెనీ మాత్రం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో భారతీయ రోడ్లపైన ప్రయాణించడానికి కావాల్సిన అధిక భద్రతలను అందించడం జరిగిందని ప్రస్తావించింది.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, స్టార్టప్ గా ప్రారంభమైన దేశపు అదిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా అవతరించిన ఈ బ్రాండ్, ప్రస్తుత తం స్కూటర్ల కోసం ప్రీ-బుకింగ్ పోర్టల్‌ని కూడా ప్రారంభించింది. వీటి కోసం బుకింగ్స్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లోనే 1 లక్షకు పైగా ప్రీ-బుకింగ్‌లతో అద్భుతమైన స్పందనను అందుకుంది. గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రీ-బుక్ చేసిన వినియోగదారులు రూ.20,000 చెల్లించి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోగలిగారు.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

అంతేకాకుండా, ఓలా ఎలక్ట్రిక్ పూర్తి చెల్లింపు చేయడానికి దాని ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (OFS) ద్వారా ఆర్థిక సహాయం కూడా అందింస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రకారం, దాని కస్టమర్లు దాని ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి 'బెస్ట్-ఇన్-క్లాస్' ఫైనాన్స్ ఎంపికలను పొందవచ్చు.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల గురించి మాట్లాడుతూ, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 121కిమీలను కవర్ చేయగలదని, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 181కిమీలను నిర్వహించగలదని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. అయితే, కంపెనీ ప్రకారం, Ola S1 ప్రో యొక్క 'ట్రూ రేంజ్' 135 కి.మీ.

రెండు వేరియంట్‌లు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, Ola S1 చిన్న 2.98kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది, అయితే Ola S1 Pro పెద్ద 3.97kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అయితే, రెండు స్కూటర్లు దాదాపు ఒకేలాంటి ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తాయి.

పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?

అంతేకాకుండా, Ola S1 ప్రో మరికొన్ని అదనపు ఫీచర్లు మరియు పనితీరును కూడా పొందుతుంది. ఓలా ఎస్1 ప్రో కేవలం 3 సెకన్లలోనే గంటకు 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 115 కిమీ గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దాని పెద్ద 50-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్‌తో చాలా ఆచరణాత్మకమైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా ఉంటుంది. ఈ బూట్ స్పేస్ భారతదేశంలో అందుబాటులో ఉన్న చాలా స్కూటర్‌ల కంటే దాదాపు రెండు రెట్లు పెద్దదిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola electric scooter front suspension breaks will it be a another hardware issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X