మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola Electric.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఈ రోజు దేశీయ మార్కెట్లో తిరుగులేని బ్రాండ్. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో Ola S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బుక్ చేసుకున్న కొంతమంది కస్టమర్లకు కూడా ఇవి డెలివరీ చేయబడ్డాయి. ఈ స్కూటర్ డెలివరీ తీసుకున్న కస్టమర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పేమెంట్ విండో మళ్ళీ ఒకసారి ప్రారంభమయ్యింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, పేమెంట్ విండో ప్రారభించింది, కావున మీరు రూ. 20,000 చెల్లించి బుకింగ్ చేసినట్లయితే, మిగిలిన చెల్లింపును చెల్లించడం ద్వారా మీరు మీ కొనుగోలును నిర్ధారించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డెలివరీకి సంబంధించిన సమాచారం మీకు అందుతుంది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

మీరు ఇప్పుడు ఓలా యాప్ ద్వారా కూడా మునుపటి మాదిరిగానే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు డెలివరీ ప్రక్రియ ఒక పెద్ద సమస్యగా ఉన్నప్పటికీ, నిన్నటి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ రోజుకు 1000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నామని, అయితే వాటి డెలివరీ మొదటి బ్యాచ్‌లో కొనుగోలు చేసిన వినియోగదారులకు అందించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది డెలివరీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ మరియు ప్రో వెర్షన్‌తో సహా రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుతం S1 ప్రో వేరియంట్ ఉత్పత్తిపై దృష్టి సారించింది, దీని కారణంగా ఈ సంవత్సరం చివరి నాటికి బేస్ వెర్షన్ ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. ఈ కారణంగా S1 కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ S1 ప్రో వెర్షన్‌ను కూడా డెలివరీ చేయబోతోంది. తాజాగా, కంపెనీ సీఈవో ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రకటించారు.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

కంపెనీ CEO భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, "మేము S1 కస్టమర్లందరినీ S1 ప్రో హార్డ్‌వేర్‌కు అప్‌డేట్ చేస్తున్నాము. మీరు S1 ప్రో యొక్క అన్ని ఫీచర్లను పొందుతారు మరియు మీరు పనితీరు అప్‌గ్రేడ్‌లతో ప్రో రేంజ్, హైపర్ మోడ్ మరియు ఇతర ఫీచర్లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. దీని డెలివరీలు జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. త్వరలో వివరాలతో ఈ-మెయిల్ పంపబడుతుంది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

ప్రస్తుతం S1 స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు S1 ప్రో వేరియంట్ అందించబడుతుంది, కానీ దాని అన్ని ఫీచర్ల ప్రయోజనాన్ని పొందడానికి అదనంగా మీరు రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ Ola S1 మరియు S1 Pro స్కూటర్లను విడుదల చేసిన సమయంలో వీటి ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

చిప్స్ లేకపోవడంతో కంపెనీ ప్రస్తుతం టాప్ వేరియంట్ ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తోందని, అందుకే ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ అప్‌గ్రేడ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మీరు S1 వేరియంట్‌ను బుక్ చేసుకుంటే, మీరు 10 నుంచి 12 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కంపెనీ చివరి చెల్లింపును కూడా జనవరి 21న ప్రారంభించబోతోంది మరియు త్వరలో వారికి డెలివరీ ఇవ్వబడుతుంది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

కంపెనీ అప్‌గ్రేడ్ గురించి కస్టమర్‌లకు మెయిల్ చేయడం కూడా ప్రారంభించింది. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ చేసిన కస్టమర్లు చాలా సంతోషంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాలకు మాత్రమే ఈ స్కూటర్ డెలివరీలు పరిమితమైనప్పటికీ, కంపెనీ దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ నగరాల్లో తన స్కూటర్లను డెలివరీ చేయబోతోంది. ఇటీవల కాలంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ వైజాగ్, పూణే, అహ్మదాబాద్, ముంబై మరియు అనేక ఇతర నగరాల్లో ప్రారంభించింది.

మళ్ళీ పేమెంట్ విండో ప్రారంభించిన Ola ఎలక్ట్రిక్.. ఇక డెలివరీలు ఎప్పుడంటే?

ఓలా ఎలక్ట్రిక్ రెండవ బ్యాచ్ విక్రయాలను ప్రారంభించబోతోంది, దీని డెలివరీలు జనవరి మరియు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. ఇంకా కొంత మంది కస్టమర్లు తాము ముందుగా బుక్ చేసుకున్నామని, అయితే డెలివరీ ఇంకా అందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం కూడా త్వరలో తెలుస్తుంది.అయితే డెలివరీలు త్వరలోనే జరుగుతాయని ఆశిస్తున్నాము, కావున ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లు ఇంక ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
Ola electric scooter payment window to open details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X