పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను పెంచుకునేందుకు సరికొత్త మార్కెట్ క్యాంపైన్‌తో ముందుకు వచ్చింది. ఇటీవల, ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తి చార్జ్ పై 200 కిలోమీటర్లు నడిపిన ఓ కస్టమర్‌కు ఉచితంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసినదే. కార్తీక్ అనే వ్యక్తి, తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మూవ్ ఓఎస్ 2.0 కి అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత కొత్త ఎకో మోడ్ లో పూర్తి చార్జ్ పై 202 కిలోమీటర్లు రైడ్ చేశాడు.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

ఈ నేపథ్యంలో, కార్తీక్ సాధించిన రేంజ్ పట్ల ఆశ్చర్యపోయిన భవీష్ అగర్వాల్, అతడిని ప్రత్యేకంగా కలిసి హోలీ నాడు విడుదల చేసిన తమ స్పెషల్ ఎడిషన్ గెరువా కలర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా, ఇప్పుడు పూర్తి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల రేంజ్ ను కవర్ చేసిన మరో మొదటి 10 మంది కస్టమర్‌లకు కూడా ఉచితంగా 'గెరువా' కలర్ ఓలా స్కూటర్‌లను బహుమతిగా ఇవ్వనున్నట్లు భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

భవీష్ అగర్వాల్ చేసిన ట్వీట్ ప్రకారం, "ఉత్కంఠను పరిశీలిస్తే, ఒకే ఛార్జ్‌తో 200కిమీ పరిధిని దాటిన మరో 10 మంది కస్టమర్‌లకు మేము ఉచితంగా గెరువా స్కూటర్‌ను అందిస్తాము! MoveOS 2 మరియు 1.0.16లో ఇప్పటికే ఈ రికార్డు సాధించిన వారు ఇద్దరు మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా సాధించగలరు! విజేతలకు జూన్‌లో ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో వారి స్కూటర్లను డెలివరీ చేస్తాము!" అని పేర్కొన్నారు.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ చేసిన ట్వీట్ కి ప్రతిస్పందనగా ఇప్పటికే చాలా మంది పూర్తి చార్జ్ పై 200 కిలోమీటర్ల రేంజ్ సాధించినట్లుగా రిప్లై ఇస్తున్నారు. ఇప్పటికే కార్తీ అనే వ్యక్తి అందరికన్నా ముందుగా ఈ రికార్డు సాధించగా, తాజాగా సంతోష్ అనే వ్యక్తి పూర్తి చార్జ్ పై 205 కిమీ రేంజ్ సాధించినట్లు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత సౌరభ్ పండిట్ అనే వ్యక్తి పూర్తి చార్జ్ పై 200 కిమీ రేంజ్ సాధించగా, పుర్వేష్ ప్రభు అనే వ్యక్తి పూర్తి చార్జ్ పై 266 కిమీ రేంజ్ సాధించినట్లు రిప్లై ఇచ్చారు.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తమ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానుల కోసం మూవ్ ఓస్ 2.0 (MoveOS 2.0) ని ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేసింది. అయితే, ఇది ప్రస్తుతం బీటా దశలో ఉంది మరియు ఎంపిక చేసిన నగరాలలో ఎంపిక చేయబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త అప్‌డేట్స్ లో భాగంగా ఓలా ఎస్1 (Ola S1) మరియు ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఎకో మోడ్‌ (Eco Mode) పాటుగా మరిన్ని ప్రత్యేకమైన అప్‌గ్రేడ్స్ ను కంపెనీ పరిచయం చేయనుంది. ఇవన్నీ రైడర్లకు మరింత అత్యుత్తమైన సౌలభ్యాన్ని మరియు ఎక్కువ రేంజ్ ను అందించేలా చేస్తాయని కంపెనీ చెబుతోంది.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త మూవ్ ఓఎస్ 2.0 అప్‌గ్రేడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులందరికీ అందుబాటులోకి రానుంది. కొత్త మూవ్ ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మునుపటి కన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మునుపటి కన్నా చాలా సమర్థవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో స్కూటర్ గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

అయితే, ఈ కొత్త ఎకో మోడ్ కారణంగా చాలా మంది యూజర్లు ఇప్పుడు సింగిల్ చార్జ్ తో 200 కిమీ పైగా రేంజ్ ను సాధిస్తున్నారు. ఈ కొత్త OS అప్‌డేట్ లో భాగంగా మొబైల్ కనెక్టివిటీ, కొత్త మొబైల్ యాప్, నావిగేషన్ సిస్టమ్ మరియు కొత్త ECO మోడ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందిన తర్వాత ఇందులో ఆటోమేటిక్ గా కొత్త యాప్ లాక్ ఫీచర్ (App Lock) కూడా ఇన్‌స్టాల్ చేయబడుతుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు సీటును అన్‌లాక్ చేయడం చేయవచ్చు.

పూర్తి చార్జ్‌పై 200 కిమీ చుట్టు.. ఫ్రీగా స్కూటర్ గిఫ్ట్ పట్టు..: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్!

కొత్త ఓఎస్ అప్‌డేట్ లో ప్రధానమైన మార్పు దాని కొత్త ఎకో మోడ్ (New Eco Mode). ఈ కొత్త ఎడో మోడ్ సిటీ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు మరియు ఈ కొత్త ఎకో మోడ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడుపుతూనే పూర్తి చార్జ్ పై గరిష్టంగా 170 కిమీ పైగా రేంజ్ ను సాధించవచ్చని కంపెనీ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు సమారురూ. 1 లక్ష మరియు రూ. 1.30 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Most Read Articles

English summary
Ola electric to give free scooter to first 10 customers who will achive 200 kms in single charge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X