50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే కంపెనీ దాదాపు 50,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ యొక్క ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క డెలివరీలు గత సంవత్సరం నవంబర్ నుంచి ప్రారంభం కాగా.. ఇప్పటికి 50,000 కంటే ఎక్కువ డెలివరీలను చేయగలిగింది.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ 'భవిష్ అగర్వాల్' ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ఇందులో కంపెనీ ఫ్యూచర్ ఫ్యాక్టరీని సందర్శించడానికి 50,000 మంది కస్టమర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

భవిష్ అగర్వాల్ మొదట్లో కేవలం 1,000 మందిని మాత్రమే ఆహ్వానించాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ తరువాత ఫ్యూచర్ ఫ్యాక్టరీని సందర్శించడానికి 50,000 మంది కస్టమర్లను ఆహ్వానించానని ట్వీట్‌లో తెలిపారు. కావున కస్టమర్లు 2022 జూన్ 19 న ఫ్యాక్టరీని సందర్శించవచ్చు.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం జూన్ 19 న 'మూవ్ ఓఎస్2' (Move OS2) ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఓలా కస్టమర్లు కంపెనీ యొక్క ఫ్యాక్టరీని సందర్శించవచ్చు. ఈ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రం అని కూడా మనం మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. అలాంటి కంపెనీని సందర్శించడానికి ఏకంగా 50,000 మందిని ఆహ్వానించడం ఇదే మొదటిసారి.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ఇప్పటి వరకు భరతదేశంలోని ఏ కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తంలో కస్టమర్లను ఆహ్వానించలేదు. దీని ద్వారా కంపెనీ ఒక కొత్త రికార్డ్ నెలకొల్పబోతోంది. కంపెనీ త్వరలో విడుదల చేయనున్న ఈ కొత్త 'మూవ్ ఓఎస్2' (Move OS2) తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో మరిన్ని ఆధునిక ఫీచర్స్ పొందటానికి అనుమతిస్తుంది.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

'మూవ్ ఓఎస్2' (Move OS2) గురించి:

ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులకోసం 'మూవ్ ఓఎస్2' సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ పొందుతారు. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదలచేసిన తరువాత ప్రవేశపెట్టనున్న మొదటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇది. ఈ అప్‌డేట్ ద్వారా కస్టమర్‌లు అనేక కొత్త ఫీచర్‌లను పొందబోతున్నారు. ఈ ఫీచర్లలో కొత్త యాప్‌లాక్ ఫీచర్ మరియు కొత్త ఎకో మోడ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రారంభించనున్న ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ను కస్టమర్లు తమ స్కూటర్ ను నేరుగా వైఫై కి కానీ లేదా ఫోన్ ద్వారా వైఫై హాట్‌స్పాట్ కి కానీ కనెక్ట్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాగానే కస్టమర్లు కొత్త ఫీచర్లులను ఉపయోగించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ప్రస్తుతం ఉన్న స్కూటర్లలో ఇంకా ఇవ్వని ఫీచర్లను కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు హైపర్ మోడ్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

మూవ్‌ఓఎస్ 2 సాఫ్ట్‌వేర్ లో ఎకో మోడ్ కూడా జోడించబడుతుంది. ఈ కొత్త ఎకో మోడ్‌ సాయంతో స్కూటర్ యొక్క గరిష్ట వేగం ఇప్పుడు గంటకు 45 కిమీ వరకు ఉంటుంది. ఈ మోడ్‌లో స్కూటర్ 170 కిమీ పరిధిని అందిస్తుంది. కానీ కొంతమంది కస్టమర్లు ఈ మోడ్‌లో స్కూటర్ యొక్క పరిధి 200 కిమీ వరకు పొందగలుగుతున్నారు.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ఓలా ఎలక్ట్రిక్ నుండి వచ్చిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు 3.9 కిలోవాట్ కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 8.5 కిలోవాట్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మొత్తమీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. Ola S1 పూర్తి ఛార్జింగ్‌తో 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

50,000 మందికి ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సందర్శించే లక్కీ ఛాన్స్.. అందులో మీరున్నారా..!!

పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు:

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఎస్1 ప్రో ధరను ఏకంగా రూ. 10,000 వరకు పెంచడం జరిగింది. ధరల పెరుగుదల తరువాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ మొదటిసారిగా ధరలను పెంచడం జెరిగింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద ధరలు ఆయా రాష్ట్రాన్ని బట్టి తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఓలా ఎస్1 ధర మాత్రం పెరగలేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి.

Most Read Articles

English summary
Ola electric to invite 50000 people in future factory details
Story first published: Tuesday, June 14, 2022, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X