సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఓలా.. ఓలా.. ఓలా.. ఇప్పుడు మార్కెట్లో ప్రధానంగా వినిపిస్తున్న బ్రాండ్ పేరు ఇది. క్యాబ్ సేవలను అందించే సమయంలో ఈ బ్రాండ్ పేరు అంతగా వినిపించిందో లేదో తెలియదు కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తర్వాత దేశంలో ఈ బ్రాండ్ పేరు మారు మ్రోగిపోతోంది. వినూత్న తరహాలో ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ కేంద్రాలు లేకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్, ఇప్పుడు తమ స్కూటర్ల కొనుగోలు కోసం తదుపరి షెడ్యూల్ ని ప్రకటించింది.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఈ వారాంతంలో (వీకెండ్‌లో) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం నెక్స్ట్ పర్చేస్ విండో ఓపెన్ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు ముందస్తు యాక్సెస్ లభిస్తుందని అగర్వాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మే 19, 2022 వ తేదీ నుండి దేశంలోని మరో ఐదు నగరాల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ క్యాంప్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

భవీష్ అగర్వాల్ తన ట్వీట్‌లో, "అందరికీ ఈ వారాంతంలో పర్చేస్ విండో ఓపెన్ చేయబడుతుంది. రిజర్వ్ చేసిన వారికి ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. ఇమెయిల్‌లో మరిన్ని వివరాలు తెలియజేయబడుతాయి. రేపటి నుండి 5 నగరాల్లో టెస్ట్ రైడ్ క్యాంపులు కూడా తెరవబడతాయి మరియు డెలివరీలు #హైపర్‌మోడ్‌లో జరుగుతాయి" అని పేర్కొన్నారు.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

నిజానికి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలన్నా లేదా వాటి డెలివరీ పొందాలన్నా ఇప్పుడు ఓ పెద్ద ప్రక్రియ అనే చెప్పాలి. ఈ స్కూటర్లను కొనే కస్టమర్లు ముందుగా 499 రూపాయాలు చెల్లించి తమకు నచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిజర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంత కాలానికి రూ.20,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మరికొంత కాలానికి కంపెనీ పేర్కొన్న సమయం ప్రకారం, మిగిలిన బ్యాలెన్స్ చెల్లించి డెలివరీ కోసం వెయిట్ చేయాలి. లభ్యతను మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను బట్టి, కంపెనీ కస్టమర్ ఇంటికి నేరుగా స్కూటర్ ను తెచ్చి డెలివరీ చేస్తుంది.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఓలా ఎలక్ట్రిక్ వాస్తవానికి తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు, డెలివరీ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించింది. ఒకరకంగా ఇది సక్సెస్ అయినప్పటికీ, కస్టమర్లు మాత్రం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కారణంగా నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం, ఈ బ్రాండ్ కస్టమర్ల నుండి మిశ్రమ స్పందన పొందుతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పనితీరుతో కొందరు సంతృప్తిగా ఉంటే, మరికొందరు ఆసంతృప్తితో ఉన్నారు.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

సరే ఆ విషయం అటుంచితే, ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎస్1 మరియు ఎస్1 ప్రో మోడళ్లలో లాంగ్ రేంజ్ వెర్షన్ అయిన ఎస్1 ప్రో (Ola S1 Pro) కి ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓలా ఎస్ 1 ప్రో లో పెద్ద 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, రియల్ టైమ్ లో ఈ రేంజ్ రైడర్ రైడింగ్ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కిమీగా ఉంటుంది.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఇక ఛార్జింగ్ సమయం విషయానికి వస్తే ఫాస్ట్ చార్జర్ (ఓలా హైపర్ చార్జర్) సాయంతో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేవలం 18 నిమిషాల్లో 75 కిమీ దూరం ప్రయాణానికి సరిపడా చార్జ్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తాయి. ఇది స్టాండర్డ్ హోమ్ చార్జర్, ఈ చార్జర్ సాయంతో స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఓలా తొలిసారిగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసినప్పుడు, కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 24 గంటల్లోనే 1 లక్ష యూనిట్లకు పైగా పైగా ప్రీ-బుకింగ్‌లు వచ్చాయి. ఓలా తమ కస్టమర్లకు మరింత మెరుగైన చార్జింగ్ సౌకర్యాలను అందించేందుకు ఇప్పుడు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 4000 లకు పైగా 'హైపర్‌చార్జర్' ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ హైపర్‌ఛార్జర్‌ లను ఓలా వినియోగదారుల అదనపు సౌలభ్యం కోసం ప్రధాన భారతీయ నగరాల్లోని BPCL పెట్రోల్ పంపులు మరియు నివాస సముదాయాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

సిద్ధంగా ఉండండి..! ఈ వీకెండ్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు ప్రారంభం..!!

ఈ హైపర్ చార్జర్లు సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉండి, కేవలం 18 నిమిషాల్లో ఈ స్కూటర్ బ్యాటరీని సగానికి పైగా చార్జ్ చేయగలవని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ఛార్జింగ్ స్థితిని నిజ సమయంలో (రియల్ టైమ్ మోనిటరింగ్) పర్యవేక్షించవచ్చు. ఇదిలా ఉంటే, ఓలా తమ వినియోగదారుల కోసం మూవ్ ఓఎస్ 2.0 ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది స్కూటర్ పనితీరును మరియు రేంజ్ ని మెరుగుపరుస్తుందని కంపెనీ చెబుతోంది.

Most Read Articles

English summary
Ola electric to reopen purchase window for s1 and s1 pro scooters on this weekend
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X