మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమ సరికొత్త 2022 మోడల్ ఓలా ఎస్1 (2022 Ola S1) ఎలక్ట్రిక్ స్కూటర్‌ కోసం సెప్టెంబర్ 1, 2022వ తేదీన పర్చేస్ విండో ఓపెన్ చేసింది.

Recommended Video

Ola Electric స్కూటర్ల కోసం విడుదల కానున్న Move OS2: వివారాలు #AutoNews

అమ్మకాలు ప్రారంభించిన ఒక్క రోజులోనే 10,000 యూనిట్ల ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎలక్ట్రిక్ తమ కొత్త 2022 మోడల్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆగస్ట్ 15వ తేదీన బుకింగ్స్ ఓపెన్ చేసింది. అప్పటి నుండి రూ.499 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ సెప్టెంబర్ 2వ తేదీన ఈ స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఈ స్కూటర్ ను సొంతం చేసుకునేందుకు క్యూ కట్టారు. ఓలా ఎస్1 ప్రో తో పోలిస్తే ఎస్1 ధర తక్కువగా ఉండటం, ఒక్క రేంజ్ మినహా ఈ రెండు మోడళ్లలో మిగతా ఫీచర్లన్నీ దాదాపు ఒకేలా ఉండటంతో కస్టమర్లు ఈ చవకైన వేరియంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

భారత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఫేమ్-2 సబ్సిడీని అమలు చేసిన తర్వాత, దీని ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. వాస్తవానికి ఓలా గతేడాదిలోనే ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. అయితే, వీటిలో ఓలా ఎస్1 ప్రో మోడల్‌కే ఎక్కువ డిమాండ్ ఉండటంతో కంపెనీ ఇందులోని ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ఓలా ఎస్1 కోసం బుకింగ్ లను స్వీకరించడం నిలిపివేసింది. కాగా, ఇప్పుడు ఇదే మోడల్ ను తాజాగా అప్‌గ్రేడ్ చేసి కొత్తగా విడుదల చేసింది.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ కొత్త ఓలా ఎస్1 అమ్మకాల గురించి మాట్లాడుతూ.. మొదటి రోజునే 10,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్లను విక్రయించామని, ఇంకా అమ్మకాలు సాగుతున్నాయని, మరోసారి తమ కంపెనీపై ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ కొత్త 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, రేంజ్ మరియు ఫీచర్ల పరంగా మునుపటి కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా తయారైంది.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా డెలివరీలు అందుతాయి. ఓలా ఎస్1 ఇ-స్కూటర్‌ను కొత్తగా బుక్ చేసుకోవడానికి కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని సందర్శించడం ద్వారా రూ.499 టోకెన్ అడ్వాన్స్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి పర్చేస్ విండో గురించిన వివరాలు ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేయబడుతాయి. పర్చేస్ విండో ఓపెన్ అయిన వారు, మిగతా మొత్తాన్ని చెల్లించడం ద్వారా తమ స్కూటర్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్ 7, 2022వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న ఓలా ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి దిగువన, చవకైన వేరియంట్‌గా ఈ కొత్త 2022 ఓలా ఎస్1 వేరియంట్ ను ప్రవేశపెట్టారు. ఈ రెండు వేరియంట్లు కూడా డిజైన్ పరంగా చూడటానికి ఒకేలా ఉంటాయి. కాకపోతే, వీటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాలు, వాటి రేంజ్ మరియు ఫీచర్లలో స్వల్ప తేడాలు ఉంటాయి.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్ మరియు నియో మింట్ అనే ఐదు రంగులలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కాగా, ఎస్1 ప్రో మొత్తం 10 రంగులలో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇప్పుడు పెద్ద మరియు మరింత శక్తివంతమైన 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించారు. ఇది పూర్తి ఛార్జ్‌పై 131 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను (ARAI సర్టిఫైడ్) అందిస్తుంది. రియల్ వరల్డ్ రైడింగ్ కండిషన్స్ లో ఇది పూర్తి చార్జ్ పై 100 కిమీ పైగా ఉంటుంది.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

అదే ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ విషయానికి వస్తే, ఇది పూర్తి చార్జ్ పై 181 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. ఓలా ఎస్1 ప్రో మాదిరిగానే ఎస్1 కూడా రైడింగ్ చేయడానికి చాలా సరదాగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు స్కూటర్లు కూడా 8.5kW (11.3 bhp) గరిష్ట పవర్ అవుట్‌పుట్ మరియు 58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే హైపర్‌డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఓలా ఎస్1 గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

మొదటి రోజునే 10,000 స్కూటర్లను కొనేశారు.. ఇంకా కొనసాగుతున్న ఓలా ఎస్1 అమ్మకాలు..

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో రివర్స్ మోడ్, ఎకో మోడ్, ఎలక్ట్రిక్ స్టీరింగ్ కంట్రోల్ లాక్, మ్యూజిక్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్, రిమోట్ బూట్ లాక్/అన్‌లాక్, బ్లూటూత్, జిపిఎస్ కనెక్టివిటీ, నావిగేషన్, సైడ్ స్టాండ్ అలర్ట్ మొదలైనవి ఉన్నాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇందులో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి, ఇవి సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి. ముందువైపు సింగిల్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

Most Read Articles

English summary
Ola electricl sold 10000 s1 electric scooters on first day sale details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X