ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌.. ఇక తగ్గేదేలే!!

భారతదేశంలో 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎంత ప్రాచుర్యం పొందిందే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థగా నెలకొన్న ఈ కంపెనీ ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా తన ప్రాబల్యాన్ని చాటడానికి తయారైపోయింది.

Recommended Video

Citroen C3 బుకింగ్స్ స్టార్ట్ | పూర్తి వివరాలు

ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు 'యుకె' (యునైటెడ్ కింగ్‌డమ్) లో కొత్త ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ స్థాపించనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వెలువడ్డాయి.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

భారతదేశంలో తన సత్తా చాటుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు యుకెలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించింది. దీనిని కంపెనీ 'ఫ్యూచర్ ఫౌండ్రీ' అని పిలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణపనులు పూర్తి కావస్తున్నాయని, త్వరలోనే ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ 'భవిష్ అగర్వాల్' తెలిపారు.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

యుకేలో ప్రారంభంకానున్న ఈ కొత్త ఫ్యాక్టరీ రానున్న భారత స్వాతంత్యదినోత్సవం (2022 ఆగష్టు 15) రోజున ఆవిష్కరించనున్నట్లు కూడా వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఈ ఫ్యాక్టరీలో మరో ఐదు సంవత్సరాలలో దాదాపు రూ. 750 కోట్ల పెట్టుబడిపెట్టనున్నట్లు తెలిపినది.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

కంపెనీ ఇటీవల తమిళనాడులోని ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి ప్రస్తావించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ చిత్రాలు కూడా వెలువడ్డాయి. అంతే కాకూండా కంపెనీ యుకె ఫ్యాక్టరీలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డిజైన్ చేయబడుతుంది తెలిసింది. దీనితో పాటు బ్యాటరీ సెల్ టెక్నాలజీపై పరిశోధన మరియు అభివృద్ధి పనులు కూడా ఈ ఫ్యాక్టరీలో జరిగే అవకాశం ఉంది.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో విడుదల చేయనున్న తన ఎలక్ట్రిక్ వాహనాల యొక్క డిజైన్ కోసం ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేసింది. దీనికి జాగ్వార్ కంపెనీలో పనిచేసిన మాజీ డిజైనర్ 'వేన్ బర్గస్' ను డిజైన్ టీమ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది. అదే సమయంలో ఈ బృందంలో 200 మంచి డిజైనర్లు మరియు ఇంజినీర్లు కూడా ఉన్నారు. వీరందరూ కూడా రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క డిజైన్ కోసం పనిచేస్తారు. భవిష్ అగర్వల్ యుకెలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ ఫోటోలతో పాటు డిజైన్ టీమ్ ఫొటోస్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టీజర్ ఫోటోలు వెలుబడాయినప్పటికీ.. దాని గురించిన అధికారిక సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడవ్వలేదు. అయితే ఇది 5 సీటర్ అయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో 500 కిమీ రేంజ్ అందిస్తుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడవవుతుంది.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారతీయ విఫణిలో ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహనా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి దేశీయ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో విక్రయించబడుతున్నాయి.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఓలా కంపెనీ యొక్క రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో శక్తిని పొందుతున్నాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఓలా ఎస్1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ ఎస్1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఓలా ఎస్1 గరిష్టంగా 90 కిమీ/గం వేగంతో, ఓలా ఎస్1 ప్రో గరిష్టంగా 115 కిమీ/గం వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన 'ఎస్1 ప్రో' (S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త అప్డేటింగ్ ఆపరేటింగ్ సిస్టం 'మూవ్ ఓఎస్ 2.0' (Move OS 2.0) పరిచయం చేసింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకూండా ఇప్పుడు ఈ అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వల్ల వినియోగదారుడు ఎక్కువ ఫీచర్స్ కూడా పొందవచ్చు.

ఖండాంతరాలు దాటుతున్న ఓలా ఎలక్ట్రిక్: UK లో కొత్త ప్లాంట్‌

ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్ లో ఒక ఛార్జ్ తో 170 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 100 కస్టమర్లకు 200 కిమీ పరిధిని అందించినట్లు కూడా తెలిసింది. మొత్తం మీద మూవ్ ఓఎస్ 2.0 పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు సింగిల్ ఛార్జ్ తో 150 కిమీ నుంచి 170 కిమీ పరిధిని అందిస్తాయని ఋజువైంది. అయితే దీని గరిష్ట వేగం 45 కిమీ/గం వరకు ఉండాలి. అప్పుడే ఈ పరిధిని పొందగలరు. 'మూవ్ ఓఎస్ 2.0' గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ola factory in uk near completion to develop electric cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X