దేశీయ మార్కెట్లో ఓలా విడుదల చేసిన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోలా..!!

75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం దేశ వ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా జరుగుతున్న వేళ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) తన 'ఎస్1' (S1) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎస్1 స్కూటర్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిన ఓలా కంపెనీ ఇప్పుడు తన ఎస్1 విడుదలతో మరింత గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైనా ప్రస్తుతం అందుబాటలో ఉన్న FAME-2 సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది. కావున కేవలం రూ. 1 లక్ష కంటే వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ మరియు కెపాసిటీ కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

ఓలా ఎస్1 స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 499 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ (https://book.olaelectric.com/) నుండి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత 2022 సెప్టెంబర్ 2 నుండి స్కూటర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డెలివరీలు అదే సెప్టెంబర్ 7 నుంచి హోమ్ డెలివరీ ప్రారంభమవుతాయి.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓలా ఎస్ 1 మరియు ఓలా ఎస్1 ప్రో యొక్క హై రేంజ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్న విషయం తెలిసిందే. వీటిని కొనుగోలుదారులు నెలకు కేవలం రూ.2,999 ఈఎమ్ఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కూటర్లు మంచి సంఖ్యలో విక్రయించబడుతున్నాయి.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ దాదాపుగా దాని ఎస్1 ప్రో స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక కలర్స్ అయిన 'జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్ మరియు నియో మింట్' అనే మొత్తం 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి పరిధిని అందిస్తుంది. ARAI ద్వారా ధ్రువీకరించిన దాని ప్రకారం ఇది 131 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే వాస్తవ ప్రపంచంలో సాధారణ రోడ్లపైన 128 కిమీ రేంజ్ (ఎకో మోడ్) అందిస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో దీని పరిధి 90 కిమీ కాగా, నార్మల్ మోడ్ లో 101 కిమీ వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

కొత్త ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్, ఎస్1 ప్రో మాదిరిగానే రైడింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 95 కిమీ, కావున హైవేలపై కూడా సులభంగా రైడింగ్ చేయవచ్చు. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

Ola S1 స్కూటర్‌లో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన MoveOS2 కూడా పొందనుంది. ఇది స్కూటర్ యొక్క పరిధిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. ఈ అప్‌డేట్‌లో కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. కావున ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

కంపెనీ దేశీయ మార్కెట్లో Ola S1 విడుదల చేయడంతో పాటు, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొత్త కలర్ లో తీసుకువచ్చింది. కావున ఇప్పుడు ఓలా ఎస్1 ప్రో ఖాఖీ గ్రీన్ కలర్‌తో కూడిన కొత్త ఫ్రీడమ్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది. కావున దీనితో కలిపితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

ఓలా ఇప్పుడు తమిళనాడులోని కృష్ణగిరిలో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్లాంట్ ప్రస్తుతం 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది అంతే కాకూండా త్వరలో దీనిని 1000 ఎకరాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఇక్కడ స్కూటర్లు, ఓలా బ్యాటరీలు మాత్రమే కాకుండా ఓలా కార్లను కూడా తయారు చేయాలని ఓలా నిర్ణయించింది.

దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే

ఇదిలా ఉండగా.. ఓలా కంపెనీ టెస్లాకు దీటుగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే తెలుసు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన సమాచారం కూడా వెల్లడించింది. ఈ కారు కేవలం 4 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదని, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇది 2023 నాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ola new s1 electric scooter launched in india price range details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X