భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధరలు.. ఇప్పుడు ఏకంగా..

భారతీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్, క్రమంగా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం దీని అమ్మకాలు కూడా క్రమంగా ముందుకు వెళుతున్నాయి. కంపెనీ ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడం కూడా ప్రారభించేసింది. అయితే నివేదికల ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ యొక్క 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర రూ. 10,000 వరకు పెరిగినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ప్రస్తుతం ధరల పెరుగుదల తరువాత 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద ధరలు ఆయా రాష్ట్రాన్ని బట్టి తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఓలా ఎస్1 ధర మాత్రం పెరగలేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఓలా ఎలక్ట్రిక్ 2021 ఆగష్టు 15 న రూ. 1.30 లక్షల ధర వద్ద దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయింది. మార్కెట్లో విడుదలయిన తరువాత మొదటిసారిగా కంపెనీ ధరలను పెంచడం జరిగింది. అంతే కాకుండా కంపెనీ ఇప్పుడు తన కస్టమర్ల కోసం మూడవ సారి సేల్స్ విండో ప్రారంభిచింది.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎలక్ట్రిక్ స్కూటర్ ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా స్కూటర్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. దీనికి సంబధించిన సమాచారం కంపెనీ కష్టమర్లకు తెలిపింది. కావున కొనుగోలుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసి తమ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయడానికి కూడా 5 నగరాల్లో టెస్ట్ రైడ్‌ ప్రారంభించింది. కొనుగోలు చేసేముందు కస్టమర్లు ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ రైడ్ చేయడం టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక డెలివరీలు మరింత వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో MoveOS అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మునుపటి కన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మునుపటి కన్నా చాలా సమర్థవంతంగా ఉండబోతోంది.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

కంపెనీ ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో స్కూటర్ గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మూవ్ ఓఎస్ 2 అప్‌డేట్‌లో భాగంగా, కంపెనీ ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా జోడించవచ్చని సమాచారం.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్‌వేర్ OTA అప్‌డేట్ పొందిన తర్వాత ఇందులో ఆటోమేటిక్ గా కొత్త యాప్ లాక్ ఫీచర్ (App Lock) ఇన్‌స్టాల్ చేయబడుతుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు సీటును అన్‌లాక్ చేయడం చేయవచ్చు.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఓలా ఎలక్ట్రిక్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ (యాప్)లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. స్కూటర్ ఉపయోగంలో లేనప్పుడు లేదా దానిని ఎక్కడైనా పార్క్ చేసి లాక్ చేయడం మర్చిపోయినప్పుడు తమ ఫోన్‌లోని ఈ అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను ఎక్కడి నుండైనా రిమోట్ గా లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఓలా కంపెనీ యొక్క రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కూడా 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. Ola S1 పూర్తి ఛార్జింగ్‌తో 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

భారీగా పెరిగిన 'Ola S1 Pro' ధర.. ఇప్పుడు ఏకంగా..

ఇదిలా ఉండగా కంపెనీ 2022 ప్రారంభం నుంచినే 'అటానమస్ వెహికల్ టెక్నాలజీ'పైన పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు కంపెనీ దాని పని గురించి ప్రపంచానికి ఒక స్నీక్ పీక్ అందించింది. ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలను పూర్తిగా నివారించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఓలా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ యొక్క ప్రోటోటైప్ అటానమస్ వెహికల్ లో 3 లైడార్ సెన్సార్లు, ఒక జిపిఎస్ సెన్సార్ మరియు ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం ఒక కెమెరా రూపంలో సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Ola s1 pro price hike by rs 10000 new price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X