పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అతికొద్ది సమయంలోనే అత్యధిక పాపులరాటీని దక్కించుకున్న బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Ole Electric). అయితే, ఇటీవలి కాలంలో ఓలా స్కూటర్లను ప్రశంసించే వారి కన్నా విమర్శించే వారే ఎక్కువయ్యారు. పేలవమైన బ్యాటరీ పనితీరు, చెప్పిన రేంజ్‌కు రియల్ టైమ్ రెంజ్‌కు పొంతన లేకపోవడం, సర్వీస్ సమస్యలు, మెకానికల్ ఫెయిల్యూర్స్, బ్యాటరీలు కాలిపోవడం వంటి అనేక కారణాల వలన ఈ బ్రాండ్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో కనిపిస్తోంది మరియు వినిపిస్తోంది.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

అయితే, తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సానుకూలంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓ వ్యక్తి పూర్తి చార్జ్ పై ఏకంగా 200 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను సాధించి కంపెనీ బాస్ భవీష్ అగర్వాల్‌ను ఇంప్రెస్ చేసాడు. అంతేకాదు, ఈ రికార్డ్ సాధించినందుకు గానూ సదరు వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ నుండి మరొక ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఉచితంగా పొందాడు.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

వివరాల్లోకి వెళితే.. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తమ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మూవ్ ఓస్ 2.0 (MoveOS 2.0) ని ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్ ద్వారా విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్స్ లో భాగంగా ఓలా ఎస్1 (Ola S1) మరియు ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం యాప్‌లాక్ ఫీచర్ (App Lock) మరియు కొత్త ఎకో మోడ్‌ (Eco Mode) వంటి ఫీచర్లను జోడించారు.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

కొత్త మూవ్ ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మునుపటి కన్నా మరిన్ని ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మునుపటి కన్నా చాలా సమర్థవంతంగా ఉంటుంది. కంపెనీ ఇందులో కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో స్కూటర్ గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అయితే, కార్తీక్ అనే వ్యక్తి, కొత్త ఓఎస్‌కి అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఎస్1 ప్రో స్కూటర్ ను సింగిల్ చార్జ్ తో 200 కిమీ పైగా నడిపినట్లు తెలిపాడు.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

కార్తీక్ తన ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను పూర్తిగా కొత్త ఎకో మోడ్‌లో రైడ్ చేశానని, ట్రాఫిక్‌లో మరియు హైవేలో స్కూటర్ నడిపానని చెప్పాడు. కార్తీక్ పోస్ట్ చేసిన ఫొటోల ప్రకారం, తన ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యాష్ బోర్డుపై రీడింగ్ 202 కిమీగా ఉంది. అదే సమయంలో అతను సగటున గంటకు 27 కిమీ వేగంతో మరియు అప్పుడప్పుడు గరిష్టంగా గంటకు 48 కిమీ వేగంతో స్కూటర్ నడిపినట్లు రీడింగ్ చూపించింది. ఆ సమయంలో స్కూటర్ బ్యాటర్ చార్జ్ ఇంకా 3 శాతం మిగిలి ఉంది.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

కంపెనీ విడుదల చేసిన కొత్త MoveOS 2.0 ప్రస్తుతం బీటా దశలో ఉంది మరియు ఈ సమయంలో ఇది కొంత మంది వినియోగదారులకు మాత్రమే విడుదల చేయబడింది. ఈ కొత్త OS అప్‌డేట్ లో భాగంగా మొబైల్ కనెక్టివిటీ, కొత్త మొబైల్ యాప్, నావిగేషన్ సిస్టమ్ మరియు కొత్త ECO మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్‌వేర్ రాబోయే వారాల్లో కస్టమర్లందరికీ అందుబాటులోకి రానుంది.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

కార్తీక్ సాధించిన ఈ రేంజ్ రికార్డ్ గురించి ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఫుల్ ఛార్జింగ్‌తో 200 కి.మీల రేంజ్‌ను సాధించడం నిజంగా గొప్ప విషయం అని, సాధారణ పెట్రోల్ వాహనాలు కూడా ఇంతటి మైలేజ్ ను ఇవ్వలేవని అన్నారు. తాము వాగ్దానం చేసినట్లుగానే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని కార్తీక్ కోసం ఓ గెరువా ఓలా ఎ1 ప్రోని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

సమాచారం ప్రకారం, మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్‌లో భాగంగా, కంపెనీ ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా జోడించవచ్చని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందిన తర్వాత ఇందులో ఆటోమేటిక్ గా కొత్త యాప్ లాక్ ఫీచర్ (App Lock) ఇన్‌స్టాల్ చేయబడుతుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు సీటును అన్‌లాక్ చేయడం చేయవచ్చు.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

ఇందులో మరొక ప్రధానమైన అప్‌డేట్ కొత్త ఎకో మోడ్ (New Eco Mode). ఈ కొత్త ఎడో మోడ్ సిటీ రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఎకో మోడ్‌లో, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు. అదే సమయంలో, ఈ మోడ్‌లోస్కూటర్ పరిధి (రేంజ్) 170 కిమీ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే, ఎకో మోడ్ లో స్కూటర్ పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండానే ఎక్కువ రేంజ్ ను సాధించవచ్చన్నమాట.

పూర్తి చార్జ్‌పై 202 కిమీ రైడ్ చేశాడు.. ఫ్రీగా మరొక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాడు..

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 మరియు ఎస్1 ప్రో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను గతేడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేయబడ్డాయి. మార్కెట్లో ఈ స్కూటర్ల ధరలు సమారురూ. 1 లక్ష మరియు రూ. 1.30 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉంటాయి. వీటిలో ఓలా ఎస్1 2.98 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉండి, పూర్తి చార్జ్ పై 121 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. కాగా, ఓలా ఎస్ 1 ప్రో 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉండి, పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Ola s1 pro rider achievs 202 km range on full charge and gets another scooter free
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X