Just In
- 10 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 11 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 15 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 18 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Ola S1 బుక్ చేసుకున్నవారికి తప్పని నిరాశ.. కంపెనీ కొత్త వ్యూహం
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశీయ మార్కెట్లో భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూటర్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా విపరీతమైన డిమాండ్ పొందుతోంది. ఈ కారణంగానే ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. అయితే కంపెనీ వీటి డెలివరీలను కూడా ఇప్పుడు ప్రారంభించింది.

ఇప్పటికే కంపెనీ తన ఎస్1 స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. ఇప్పుడు ఎస్1 ప్రో స్కూటర్ యొక్క డెలివరీలను ప్రారంభించడానికి S1 ప్రో వేరియంట్ యొక్క ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. తాజాగా, కంపెనీ సీఈవో ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

కంపెనీ CEO భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. మేము S1 కస్టమర్లందరినీ S1 ప్రో హార్డ్‌వేర్‌కు అప్డేట్ చేస్తున్నాము. కావున ఎస్1 కస్టమర్లు ఇప్పుడు S1 ప్రో యొక్క అన్ని ఫీచర్లను పొందుతారు, అంతే కాకుండా పర్ఫామెన్స్ అప్గ్రేడ్లతో ప్రో రేంజ్, హైపర్ మోడ్ మరియు ఇతర ఫీచర్లను కూడా అన్‌లాక్ చేయవచ్చు. దీని డెలివరీలు ఈ నెలలో లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో ఇమెయిల్ పంపబడుతుంది.

ఈ సమయంలో S1ని బుక్ చేసుకున్న కస్టమర్లకు S1 ప్రో వేరియంట్ ఇవ్వబడుతుంది. అయితే అదనపు ఫీచర్స్ పొందటానికి అదనంగా రూ. 30,000 చెల్లించాల్సి వస్తుంది. సాధారణంగా కంపెనీ ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 వద్ద విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ అప్‌గ్రేడ్ ఎందుకు చేస్తుందనే దానికి సంబంధించిన సమాచారం మాత్రం అందించలేదు.

చిప్స్ లేకపోవడంతో కంపెనీ ప్రస్తుతం టాప్ వేరియంట్ ఉత్పత్తిపైనే దృష్టి సారిస్తోందని, అందుకే ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ అప్‌గ్రేడ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మీరు S1 వేరియంట్‌ను బుక్ చేసుకుంటే, మీరు 10 నుంచి 12 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. కంపెనీ చివరి చెల్లింపును కూడా జనవరి 21న ప్రారంభించబోతోంది మరియు త్వరలో వారికి డెలివరీ ఇవ్వబడుతుంది.

కంపెనీ అప్‌గ్రేడ్ గురించి కస్టమర్లకు మెయిల్ చేయడం కూడా ప్రారంభించింది. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ చేసిన కస్టమర్లు చాలా సంతోషంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాలకు మాత్రమే ఈ స్కూటర్ డెలివరీలు పరిమితమైనప్పటికీ, కంపెనీ దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ నగరాల్లో తన స్కూటర్లను డెలివరీ చేయబోతోంది. ఇటీవల కాలంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ వైజాగ్, పూణే, అహ్మదాబాద్, ముంబై మరియు అనేక ఇతర నగరాల్లో ప్రారంభించింది.

చిప్ లేకపోవడం వల్ల ఇంతకు ముందు ఉత్పత్తి ప్రారంభించలేకపోయామని, అయితే ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడింగ్‌ను నవంబర్ 20 నుండి ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే టెస్ట్ రైడ్లను అందిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసి దాదాపు 5 నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో డెలివరీలను చేయడం లేదు. డెలివరీలలో ఇలాగే జాప్యం జరిగితే కొనుగోలుదారులు మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కంపెనీ యొక్క అమ్మకాలు తప్పకుండా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.