ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గడచిన ఆగస్ట్ 15వ తేదీన మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2022 మోడల్ ఓలా ఎస్1 (2022 Ola S1) ఎలక్ట్రిక్ స్కూటర్‌ కోసం కంపెనీ నేటి నుండి (సెప్టెంబర్ 1, 2022వ తేదీ నుండి) కొనుగోలు విండోని ప్రారంభించింది.

Recommended Video

Ola Electric స్కూటర్ల కోసం విడుదల కానున్న Move OS2: వివారాలు #AutoNews

గడచిన నెలలో రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడిన ఓలా ఎస్1 ను ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లు నేటి నుండి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు. ముందుగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసిన వారికే ముందుగా స్కూటర్ డెలివరీ అవుతుందని కంపెనీ పేర్కొంది. వాస్తవానికి ఓలా గతేడాదే ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. అయితే, వీటిలో ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ఓలా ఎస్1 కోసం కంపెనీ గత కొంత కాలంగా బుకింగ్ లను స్వీకరించడం నిలిపివేసింది.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

కాగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మునుపటి కంటే మరింత మెరుగ్గా తయారైంది. ఓలా ఎస్1 ఇ-స్కూటర్‌ను కొత్తగా బుక్ చేసుకోవడానికి కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని సందర్శించడం ద్వారా రూ.499 టోకెన్ అడ్వాన్స్‌ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి పర్చేస్ విండో గురించిన వివరాలు ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేయబడుతాయి. పర్చేస్ విండో ఓపెన్ అయిన వారు, మిగతా మొత్తాన్ని చెల్లించడం ద్వారా తమ స్కూటర్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత ప్రభుత్వం యొక్క FAME-2 స్కీమ్ క్రిందకు వర్తిస్తుంది. ఈ స్కీమ్ లో భాగంగా భారత ప్రభుత్వం వివిధ రకాల విభాగాలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలను అందిస్తుంది. ఓలా ఎస్1 పై ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీని అమలు చేసిన తర్వాత, వివిధ రాష్ట్రాల్లో దీని ధర లక్ష రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. సమాచారం ప్రకారం, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్ 7, 2022వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

మార్కెట్లో ఓలా ఎస్‌1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రస్తుతం విక్రయిస్తున్న ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్‌కి దిగువన, చవకైన వేరియంట్‌గా ప్రవేశపెట్టారు. ఈ రెండు వేరియంట్లు కూడా డిజైన్ పరంగా చూడటానికి ఒకేలా ఉంటాయి. కాకపోతే, వీటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాలు మరియు ఫీచర్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. ఓలా ఎస్1 జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్ మరియు నియో మింట్ అనే ఐదు రంగులలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కాగా, ఎస్1 ప్రో మొత్తం 10 రంగులలో లభిస్తుంది.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది మరియు ఇది పూర్తి ఛార్జ్‌పై 131 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను (ARAI సర్టిఫైడ్) అందిస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్ వరల్డ్ రైడింగ్ కండిషన్స్ లో ఇది పూర్తి చార్జ్ పై 100 కిమీ పైగా రేంజ్ ను అందిస్తుంది. ఎస్1 ప్రో మాదిరిగానే ఎస్ కూడా రైడింగ్ చేయడానికి చాలా సరదాగా ఉంటుందని ఓలా తెలిపింది. ఈ రెండు స్కూటర్లు కూడా 8.5kW (11.3 bhp) గరిష్ట పవర్ అవుట్‌పుట్ మరియు 58 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే హైపర్‌డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఓలా ఎస్1 ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. కాగా, ఎస్1 ప్రో లో వీటికి అదనంగా హైపర్ అనే హై-స్పీడ్ మోడ్ కూడా ఉంటుంది. ఓలా ఎస్1 గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుం. సాధారణ ఛార్జర్‌తో, ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఓలా ఎస్1 పెద్ద 7.0 ఇంచ్ కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది మరియు స్కూటర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఓలా మూవ్ ఓఎస్ 2.0 సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది మరియు త్వరలోనే కంపెనీ విడుదల చేయబోయే మూవ్ ఓఎస్ 3.0 అప్‌డేట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఓలా ఎస్1 ట్యూబ్లర్ ఛాసిస్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఈ స్కూటర్ ముందు భాగంలో సింగిల్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ యూనిట్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికొస్తే, ముందు భాగంలో 220 మిమీ హైడ్రాలిక్ డిస్క్ మరియు వెనుకవైపున 180 మిమీ హైడ్రాలిక్ డిస్క్‌ ఉంటాయి మరియు ఇది సిబిఎస్ (కాంబి బ్రేక్ సిస్టమ్)ను సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం అల్లాయ్ వీల్స్ మరియు వాటిపై ఇరువైపులా 110/70 - R12 ప్రొఫైల్ తో కూడిన టైర్లు అమర్చబడి ఉంటాయి.

ఓలా ఎస్1 (Ola S1) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.. త్వరపడండి, ముందుగా కొన్న వారికే ముందుగా డెలివరీ!

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని కిషన్‌గిరిలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలోనే అతిపెద్ద సెల్ ప్రొడక్షన్ ప్లాంట్‌ను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడకుండా, భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడంలో ఈ కొత్త ఫ్యాక్టరీ సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా కూడా త్వరలోనే ఈ ఫ్యాక్టరీలో తమ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించబోతోంది.

Most Read Articles

English summary
Https hindi drivespark com two wheelers 2022 ola s1 p100614
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X