మీడియా మిత్రుల కోసం టీవీఎస్ బైక్ రేస్.. కరీ మోటార్ స్పీడ్‌వేపై ప్రారంభమైన 'మీడియా కప్ 2022'
పెట్రోనాస్ టీవీఎస్ రేసింగ్ (Petronas TVS Racing) కొత్త 2022 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ (National Motorcycle Racing Championship) ను అత్యద్భుతంగా ప్రారంభించింది. ఈ బ్రాండ్ తమ రేసింగ్ ప్రయత్నాలలో భాగంగా, యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్ (Young Media Racer Program) యొక్క ఆరవ ఎడిషన్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ 2022 సీజన్ ప్రారంభ మీడియా కప్ రేసులో, డ్రైవ్‌స్పార్క్ బృందం పోడియంపై మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్: అసలు దీని కథ ఏమిటి?
యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్ అనేది టీవీఎస్ రేసింగ్ ఆటోమోటివ్ జర్నలిస్టుల కోసం రూపొందించిన ఓ రేసింగ్ ప్రోగ్రామ్. టీవీఎస్ తమ రేసులను కేవలం మోటార్‌స్పోర్ట్ రంగంలో వారికి మాత్రమే కాకుండా, మా లాంటి మీడియా ఔత్సాహికుల కోసం కూడా నిర్వహిస్తుందా అని టీవీఎస్ రేసింగ్ రైడర్‌లను మీడియా సోదరులు అడిగిన ప్రశ్నల ఫలితమే ఈ "యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్".

భారతదేశంలో రేసు ఎలా ఉంటుంది? రేసులో గెలవడం ఎలా అనిపిస్తుంది? రేసు వాతావరణంలో మోటార్‌సైకిల్ ఎలా అనిపిస్తుంది? టీవీఎస్ రేసింగ్‌లోని మంచి వ్యక్తులు సరైన రేస్ మోటార్‌సైకిల్‌లో జర్నలిస్టులుగా ఉన్న మమ్మల్ని రైడర్ సీటులో కూర్చోబెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కొన్ని ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానమే టీవీఎస్ రేసింగ్ యొక్క యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్.

ఇందుకోసం టీవీఎస్ తమ పాపులర్ అపాచీ RTR 200 4V బైక్ ను రేస్‌ట్రాక్ కోసం సిద్ధం చేసింది. ఇది సన్ననైన మరియు ఎక్కువ గ్రిప్ కలిగిన టైర్లు, రేస్ ఎగ్జాస్ట్ సిస్టమ్, పెర్ఫార్మెన్స్ ఎయిర్ ఇన్‌టేక్, రివైజ్డ్ ఇంజన్ టైమింగ్ మొదలైన వాటిని కలిగి ఉంది. ఫలితంగా, ఈ బైక్ చాలా శక్తివంతమైనదిగా మారింది. ఈ ఇంజన్ రీట్యూనింగ్ కారణంగా ఈ బైక్ ఇప్పుడు దాదాపు 25 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది.

యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్ యొక్క ఆరవ ఎడిషన్‌లో, వివిధ ఆటోమోటివ్ మీడియా ఛానెల్‌ల నుండి 16 మంది జర్నలిస్టులు మే 2022లో శిక్షణ మరియు అర్హత సెషన్‌కు ఆహ్వానించబడ్డారు. వీరిలో ఈ ఛాంపియన్‌షిప్‌లో రేస్ చేయడానికి టాప్ 12 మంది మాత్రమే ఎంపికయ్యారు. రేసింగ్ సోదరులలో 'మీడియా కప్' అని మరింత ఆప్యాయంగా పిలుస్తారు, ఈ రేసులు ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇతర రేసులతో పాటే జరుగుతాయి.

రౌండ్ 1: కరీ మోటార్ స్పీడ్‌వే అద్భుతం
మోటార్‌స్పోర్ట్ విషయానికి వస్తే, కరీ మోటార్ స్పీడ్‌వే అనేది అత్యంత చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది ఎస్. కరివర్ధన్ యాజమాన్యంలోని ఒక సంస్థచే తయారు చేయబడిన అల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం రన్‌వేగా ప్రారంభమైంది. కరివర్ధన్ లేదా కారి అని పిలవబడే ఇతను ఒక ప్రముఖ రేస్‌కార్ డెవలపర్ మరియు డ్రైవర్. ఇతను భారతదేశంలోని మోటార్‌స్పోర్ట్ వ్యవస్థాపక పితామహులలో ఒకరు.

కాబట్టే, ఈ కరీ మోటార్ స్పీడ్‌వే ఆ పేరు ఈ లెజెండ్ నుండి వచ్చింది. ఇది భారతదేశంలోని అత్యంత సాంకేతిక రేస్‌ట్రాక్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నేను ఇంతకు ముందు ఇక్కడ రైడ్ చేసినప్పటికీ, కొంచెం భిన్నమైన లేఅవుట్‌తో కొత్త, అప్‌గ్రేడ్ చేసిన ట్రాక్‌లో రైడ్ చేయడానికి నేను ఎక్కువ సమయం వేచి ఉండలేకపోయాను. మీడియా కప్ యొక్క మొదటి రౌండ్ కెఎమ్ఎస్ (KMS) లో నిర్వహించబడటంతో ఈ విషయంలో నా ప్రార్థనలకు సమాధానం లభించినట్లయింది.

సాధారణంగా, ఈ రేస్ వారాంతంలో జరుగుతుంది. శుక్రవారం రోజు ప్రాక్టీస్, శనివారం క్వాలిఫైయింగ్ మరియు ఆదివారం నాడు ఫైనల్ రేస్ ఉంటుంది. అయితే, ఈసారి ఇందుకు భిన్నంగా జరిగింది. ప్రాక్టీస్ సెషన్‌తో పాటు క్వాలిఫైయింగ్ సెషన్‌ను కూడా శనివారం నాడే నిర్వహించారు. ఈ రేసులో పాల్గొన్న మీడియా మిత్రులలో కొంతమంది రైడర్‌లు ఇంతకు ముందు కరీ మోటార్ స్పీడ్‌వే రైడ్ చేసిన అనుభవం లేదు. కాబట్టి, వారు కొంత అసౌకర్యంగానే ఫీల్ అయ్యారు. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ ఆ అసౌకర్యాన్ని వదిలించుకోవడానికి సహాయపడింది మరియు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ మంచి ల్యాప్ సమయాలను పోస్ట్ చేయడం ప్రారంభించారు.

డ్రైవ్‌స్పార్క్ రైడర్ ఈ ప్రాక్టీస్ సెషన్‌లో 1:36:786 అత్యుత్తమ ల్యాప్ సమయంతో, రెండవ వేగవంతమైన సమయాన్ని పోస్ట్ చేసింది. టీవీఎస్ రేసింగ్ ట్రైనర్ హ్యారీ సిల్వెస్టర్ నుండి అందుకున్న కొన్ని చిట్కాలు ఈ సమయంలో చాలా చక్కగా పనిచేశాయి. ఈ రేస్ తర్వాత జరిగిన క్వాలిఫైయింగ్ సెషన్‌లో ప్రతి ఒక్కరూ తమ లైన్‌లను సరిగ్గా చేరుకోవడంలో ఈ చిట్కాలు ఎంతగానో సహాయపడ్డాయి.

క్వాలిఫైయింగ్ సమయంలో, ప్రతి ఒక్క రైడర్ వారి ల్యాప్ సమయాలను భారీగా మెరుగుపరుచుకున్నారు మరియు డ్రైవ్‌స్పార్క్ అత్యుత్తమ ల్యాప్ సమయం 1:36.043తో నాల్గవ స్థానానికి సాధించింది. ఇక రేసులో మొదటి రౌండ్ కోసం అంతా సిద్ధమైంది మరియు ఈ రేసులో నేము P4 నుండి రేస్ ప్రారంభించాను.

ఆదివారం నాడు రేసు ప్రారంభం కాకముందే అక్కడ హడావిడి వాతావరణం నెలకొంది. కరీ మోటార్ స్పీడ్‌వే వద్ద అన్ని ఇతర రేసులతో అక్కడి వాతావరణం కోలాహలంగా ఉంది. ఇందులో వివిధ వన్-మేక్ ఛాంపియన్‌షిప్‌లు మరియు ప్రీమియర్ ప్రో-స్టాక్ 165 మరియు ప్రో-స్టాక్ 301-400సిసి విభాగాలు ఉన్నాయి. ఈ రైడర్‌లు పిట్ వాల్‌ని మెయిన్ స్ట్రెయిట్‌లో జిప్ చేయడాన్ని చూడటం ఒక కనువిందైన దృశ్యంగా ఉంటుంది మరియు అక్కడ రేస్ ట్రాక్ పై మోటార్‌సైకిళ్లు చేసే ధ్వని చెవులకు ఇంపుగా ఉంటుంది.

మీడియా కప్ రేసు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ చేయబడింది. రేసు ప్రారంభమైన తర్వాత మాలో కొందరు టైర్లపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుంటే మరికొందరు రేసుపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మేము మా స్థానాల వద్ద వరుసలో ఉన్నాము మరియు కొద్దిసేపటిలోనే లైట్లు ఆన్ చేయబడ్డాయి.

క్లచ్ ని లోడ్ చేసి, ఫ్రంట్ బ్రేక్ లివర్ లోపలికి లాగి థ్రోటల్ ను దాదాపు 75 శాతం వద్ద ఉంచాము. లైట్లు ఆరిపోగానే మా రేస్ ప్రారంభమైంది. వెంటనే రయ్ రయ్ మంటూ మోటార్‌సైకిళ్లు ట్రాక్ పై దూసుకెళ్లడం ప్రారంభించాయి. ఈ రేసులో నేను దాదాపు ఖచ్చితమైన ప్రయోగాన్ని పొందగలిగాను మరియు కొన్ని సెకన్లలో, నేను లీడ్ తీసుకున్నాను కానీ బ్రేకింగ్ పాయింట్‌పై దృష్టిని కోల్పోయాను.

ఫలితంగా, ఇది నన్ను రేసింగ్ లైన్ నుండి పక్కకు పంపేసింది మరియు మేము రెండవ మూల నుండి నిష్క్రమించే సమయానికి, మొదటి స్థానం నా చేతిలో లేకుండా పోయింది. ఈ రేసులో ఇషాన్ లీ మొదటి స్థానంలో ఉండటంతో మొదటి ల్యాప్ ముగిసే సమయానికి నేను రెండో స్థానంలో నిలువగలిగాను. చివరి మూలలో జరిగిన పొరపాటు వల్ల నేను వైడ్ లైన్‌లోకి రావడంతో మరియు రెండవ స్థానంలో ఉన్న కరణ్ సింగ్‌ను అధిగమించగలిగాను.

ఇది ఒక్క ల్యాప్ మాత్రమే, ఇలాంటివి మరో ఏడు ల్యాప్స్ (మొత్తంగా 8 ల్యాప్స్) ఉన్నాయి. ల్యాప్ 2 నుండి ల్యాప్ 7 వరకు, కరణ్ సింగ్ మరియు ఇషాన్ లీ మొదటి స్థానం కోసం పోరాడగా, మందర్ సావంత్ మరియు నేను మూడవ స్థానం కోసం పోరాడాము. ల్యాప్ 7 ముగిసే సమయానికి, మందార్ 8వ ల్యాప్‌లోని మొదటి కార్నర్‌లో నన్ను దాటి P3లోకి ప్రవేశించే వేగాన్ని అందుకున్నాడు. ఈ సమయంలో కరణ్ సింగ్ ఇషాన్ లీని అధిగమించాడు.

చివరి ల్యాప్ యొక్క చివరి మూలలో, కరణ్ సింగ్, దురదృష్టవశాత్తూ, రేసు నుండి క్రాష్ అయ్యాడు, దీంతో ఇషాన్ లీ మరోసారి మొదటి స్థానంలో నిలిచాడు, ఈసారి చెకర్డ్ ఫ్లాగ్‌లో నిలిచాడు. మందార్ సావంత్ రెండో స్థానంలో నిలవగా, నేను మూడో స్థానంలో నిలిచాను. ఈ రేసులో ప్రతి క్షణం పూర్తి నాటకీయంగా ఉంది మరియు గ్రిడ్‌లో స్థిరమైన స్థానాల మార్పిడి జరుగుతూ వచ్చింది. చివరి వరకూ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

ఈ రేసులో సాధించిన అత్యుత్తమ ల్యాప్ సమయాలు, ఈ ల్యాప్‌లు ఎంత వినోదాత్మకంగా ఉన్నాయో నిరూపించాయి. అకస్మాత్తుగా, రైడర్లందరూ చాలా వేగంగా మారారు. ఐదుగురు రైడర్లు అందరూ 1:33 సెకన్లలో ఉండగా, ఒక రైడర్ 1:32 సెకన్లలో దాటాడు. ఒకరికొకరు కేవలం రెండు సెకన్లలోపు ఆరుగురు రైడర్లను ఓవర్‌టేక్ చేశాడు. మా ఉత్తమ ల్యాప్ సమయం ఇప్పుడు 1:33.615 గా ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది మనలో చాలా మందికి ద్విచక్ర వాహనాల యొక్క అత్యంత వినోదభరితమైన మరియు ఉత్కంఠభరితమైన అనుభవాలలో ఒకటి. మోటార్‌సైకిల్ ఔత్సాహికులకు, మోటార్‌సైకిల్ రేసు కంటే థ్రిల్లింగ్‌గా అనిపించే అంశం మరొకటి లేదు. ఇది చూడటానికి గొప్ప దృశ్యం, కానీ అలాంటి రేసులో భాగం కావడం కూడా ఒక సరికొత్త అనుభూతి. ఈ 'మీడియా కప్' ను మా కోసం తీసుకువచ్చినందుకు టీవీఎస్ రేసింగ్‌కు కృతజ్ఞతలు. వారి ద్వారానే జర్నలిస్టులమైన మేము అసలు నిజమైన రేసింగ్ అనుభూతి ఎలా ఉంటుందో చూడగలిగాము మరియు దాని అనుభవాన్ని పొందగలిగాము. ఈసారి తదుపరి మీడియా కప్ జూలై 2022 నెలలో మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ పై రౌండ్ 2 గా జరుగుతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి.


Click it and Unblock the Notifications








