ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈవీ మార్కెట్లోని డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు అనేక కొత్త మరియు ప్రస్తుత కంపెనీలు కొత్త రకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అయితే, వీటిలో సరైన దానిని ఎంచుకోవడంలో మీరు విఫలమైనట్లయితే, మీ జేబుకు పెద్ద చిల్లు పడటమే కాకుండా, అనవసరమైన ప్రమాదాన్ని కూడా కొనితెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి, మీరు కూడా ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 అంశాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

1. మీ ఉపయోగాన్ని ముందుగా నిర్ధారించుకోండి

ప్రస్తుతం, మార్కెట్లో అనేక విభాగాలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, మీరు ఎందుకోసం ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనుకుంటున్నారనే విషయాన్ని ముందుగా నిర్థారించుకోండి. మీరు రోజువారీ ప్రయాణ అవసరాల కోసం కొంటున్నారా లేక వాణిజ్య వినియోగం కోసం కొంటున్నారా తెలుసుకోండి. ఒకవేళ, మీరు రోజులో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ లేదా చార్జింగ్ సమస్య గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాన్ని రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటి వాణిజ్య ఉపయోగం మరియు రెండవ వ్యక్తిగత ఉపయోగం. స్కూటర్‌ని కమర్షియల్‌గా తీసుకోవాలనుకుంటే అందులో లగేజీ స్థలం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మరియు దాని పేలోడ్ సామర్థ్యం గురించి కూడా తెలుసుకోవాలి. లాస్ట్-మైల్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు వ్యాపారస్థులకు మంచి లాభాలను తెచ్చిపెడుతాయి. హీరో ఎలక్ట్రిక్, జితేంద్ర ఈవీ మరియు ఒకినావా వంటి ఈవీ కంపెనీలు వాణిజ్ వినియోగం కోసం చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తున్నాయి.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

వాణిజ్య వినియోగం కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ఫీచర్లను కలిగి ఉంటాయని, అలాగే వాటి టాప్ స్పీడ్ కూడా తక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు వ్యక్తిగత ఉపయోగం కోసం ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ అని రెండు వర్గాల స్కూటర్లు లభిస్తుంటాయి. వీటిలో లో-స్పీడ్ స్కూటర్లను కొనుగోలు చేయకపోవడమే మంచిదనేది మా అభిప్రాయం. ఇవి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాయి మరియు చిన్నపాటి సిటీ రైడ్స్‌కి మాత్రమే అనుకూలంగా ఉంటాయి.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

అదే, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసినట్లయితే, ఇవి వేగంగా ప్రయాణించడమే కాకుండా మెరుగైన ఫీచర్లు, ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం మరియు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మొదలైన వాటిని కలిగి ఉంటాయి. హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, రివోల్ట్ ఆర్‌వి400, టివిఎస్ ఐక్యూబ్ మరియు ఓలా ఎస్1 ప్రో వంటి ప్రీమియం మోడళ్లు ఉన్నాయి. వీటిల్లో కీ లేస్ ఎంట్రీ, మ్యూజిక్ సిస్టమ్, ఫోన్ కంట్రోల్స్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

2. రేంజ్ మరియు వేగం

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయడానికి ముందు వాటిని స్వయంగా టెస్ట్ రైడ్ చేయండి. వాటి వేగం మరియు రేంజ్ పట్ల సంతృప్తి పొందిన తర్వాత మాత్రమే వాటిని కొనుగోలు చేయండి. ఆఫీసు ప్రయాణం కోసం లేదా మరేదైనా ఇతర కారణాల కోసం రోజూ ప్రయాణించే కొనుగోలుదారులు కనిష్టంగా 80-100 కి.మీల దూరం ప్రయాణించాల్సి వస్తే, వారు హై-స్పీడ్ మరియు హై-రేంజ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఎంచుకోవచ్చు. సిటీలో సగటున 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాలనుకునే వారు లో-స్పీడ్, లో-రేంజ్ ఇ-స్కూటర్లను ఎంచుకోవచ్చు.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

3. ఛార్జింగ్ సౌకర్యం

ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను భయపెట్టే మొదటి మరియు చివరి అంశం ఏదైనా ఉందంటే, వాటి చార్జింగ్ గురించే. మనం ఇంటి వద్ద పూర్తిగా చార్జ్ చేసిన ఈవీతో బయటకు బయలుదేరిన తర్వాత, దాని చార్జింగ్ తగ్గుతూ వస్తుంటే మన హార్ట్ బీట్ పెరుగుతూ పోతుంది. కాబట్టి, మీరు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత రేంజ్ ఇస్తుంది, దాని చార్జింగ్ సమయం ఎంత, ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందా, చార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మొదలైన వాటి గురించి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

ప్రస్తుతం, మార్కెట్లో బౌన్స్ ఇన్ఫినిటీ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో కూడా వస్తున్నాయి. అంటే, ఇలాంటి స్కూటర్లలో రిమూవబల్ బ్యాటరీ ఉండి, ఖాలీ అయిన బ్యాటరీలను నిర్దేశిత బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీతో స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి సబ్‌స్క్రిప్షన్‌పై ఆధారపడి ఉంటాయి, ఈ విధానంలో రైడర్ తన బ్యాటరీపై అధికారాన్ని కలిగి ఉండరు. బ్యాటరీలు సదరు స్వాపింగ్ సేవలు అందించే కంపెనీలకు చెందినవిగా ఉంటాయి.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

4. సబ్సిడీలు మరియు ధరలు

మీరు మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఏ ప్రయోజనం కోసం కొనుగోలు చేస్తున్నారనే దానిని బట్టి, దాని ధర సుమారు రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా మరియు ఓకినావా ఆర్30 వంటి లో-స్పీడ్ మోడల్‌లు దాదాపు రూ. 60,000 రేంజ్‌లో ఉండగా, ఏథర్ 450ఎక్స్ జెన్3 మరియు బజాజ్ చేతక్ ధరలు వరుసగా రూ. 1.34 లక్షలు మరియు రూ. 1.45 లక్షలుగా ఉన్నాయి. ఈ ధరలలో FAME II మరియు రాష్ట్ర రాయితీలు కూడా ఉంటాయి (ఎంపిక చేసిన రాష్ట్రాలలో). కాబట్టి, మీ రాష్ట్రంలో లేదా ప్రాంతంలో అనుసరిస్తున్న ఈవీ పాలసీ గురించి, అందించే రాయితీల గురించి తెలుసుకోవడం చాలా అవసరం అని గుర్తించుకోండి. మీ జేబును తేలికగా ఉంచడంలో సహకరిస్తుంది.

ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలు ఓసారి చెక్ చేసుకోండి..!

5. అమ్మకాల తర్వాత సర్వీసింగ్

ఎలక్ట్రిక్ వాహనాల మెయింటినెన్స్ ఖర్చు చాలా తక్కువగానే ఉంటుంది. పెట్రోల్ వాహనాల మాదిరిగా ఇందులో వేర్ అంట్ టేర్ అయ్యే భాగాలు చాలా తక్కువ. సాధారణంగా ఈవీలలో బ్రేక్ ప్యాడ్‌లు మరియు టైర్లు ఎక్కువగా అరిగిపోతుంటాయి. అలాగే, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సర్వీసింగ్ విషయం గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. సర్వీస్ నెట్‌వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ లభ్యత ఎలా ఉంది, కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అనే విషయాలపై హోమ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తుంచుకోండి.

Most Read Articles

English summary
Planing to buy an electric scooter take a look at these important tips before you proceed
Story first published: Sunday, October 2, 2022, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X