ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ప్యూర్ ఈవీ (Pure EV), భారత మార్కెట్లో తమ సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, కంపెనీ తాజాగా తమ కొత్త ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. అయితే, ప్రస్తుతానికి టీజర్ మినహా దాని విడుదల తేదీ, ధర వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు. అయితే, త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ప్యూర్ ఈవీ దేశీయ మార్కెట్‌ లో చౌకైన ఎలక్ట్రిక్ బైక్‌ లు మరియు స్కూటర్‌ లను తయారు చేసేందుకు గాను ఐఐటీ హైదరాబాద్‌ తో చేతులు కలిపింది. ప్రస్తుతం, ఈ కంపెనీ దేశీయ విపణిలో ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా, ఈట్రిస్ట్ 350 మాత్రం ఈ బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అవుతుంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ప్రస్తుతం, ప్యూర్ ఈవీ భారతదేశంలో మొత్తం ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వాటిలో, Ipluto 6G, Ipluto మరియు Etrance Plus అనే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లుగా ఉన్నాయి. ప్యూర్ ఈవీ తమ ఈవీ అభిమానుల కోసం ఇట్రాన్స్ ఎలక్ట్రిక్ స్టెప్-త్రూ మరియు ఇగ్నైట్ అనే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా అందిస్తుంది. ఈసారి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈట్రిస్ట్ 350 ను ప్రజలకు పరిచయం చేయబోతోంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ఆగస్టు 15, 2022 వ తేదీన భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ బైక్ పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది, అభివృద్ధి చేయబడింది మరియు తయారు చేయబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది నూటికి నూరు శాతం మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. కొత్త Pure eTryst 350 EV ఎలక్ట్రిక్ బైక్ లో శక్తివంతమైన 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందిన సమాచారం. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అంచనా.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించనున్నారు. ఈ బ్యాటరీపై కంపెనీ 5 సంవత్సరాల వారంటీని కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సాంప్రదాయ పెట్రోల్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే విశిష్టమైన మోడ్రన్ డిజైన్ లాంగ్వేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది పెర్ఫార్మెన్స్ విషయం లోనూ ట్రెడిషనల్ మోటార్‌సైకిళ్లకు ఏమాత్రం తీసిపోకుండా గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని ప్యూర్ ఈవీ ధృవీకరించింది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ ఐసి ఇంజన్ బైక్ లకు సమానమైన గొప్ప అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ప్యూర్ eTryst 350 ఎలక్ట్రిక్ బైక్ ఆల్-ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా ఉండనుంది. అయితే, ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ బైక్ ధర ఎంత ఉంటుంది అని? ప్యూర్ ఈవీ తమ బైక్ యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి సమాచారాన్ని అందించింది, కానీ దాని ధర ప్రస్తుతానికి ఇంకా తెలియదు.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

మార్కెట్లో ప్యూర్ ఈవీ ఇట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్‌ ను కంపెనీ రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల మద్యలో విడుదల చేయవచ్చని అంచనా. ఈ బైక్ మార్కెట్లో విడుదలయ్యాక ఇది ప్రస్తుతం ఈ విభాగంలో అమ్ముడవుతున్న రివాల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) వంటి ఎలక్ట్రిక్ బైక్ ‌లకు పోటీగా నిలుస్తుంది.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ప్యూర్ ఈవీ అనేది భారతదేశంలో ఈవీ స్టార్టప్ కంపెనీ, దీనికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. ఈ సంస్థలో అంతర్గత బ్యాటరీ తయారీ సౌకర్యం మరియు ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఆధారంగా ఒక రీసెర్చ్ సెటప్ కూడా ఉంది. కంపెనీకి బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యొక్క ప్రధాన ప్రాంతాలపై పనిచేసే ప్రత్యేక ఆర్ అండ్ డి బృందం కూడా ఉంది. భవిష్యత్తులో అనేక కొత్త మోడళ్లకు దారితీసే దీర్ఘ-శ్రేణి మరియు అధిక-పనితీరు గల లిథియం బ్యాటరీలను అభివృద్ధి చేయడం ఈ ఆర్ అండ్ డి లక్ష్యం.

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్.. త్వరలోనే విడుదల!

ప్యూర్ ఈవీ తాజాగా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా బ్యాటరీ సమస్యలను గుర్తించి, వాటికవే ఆటోమేటిక్ సరిచేసుకునేలా ఓ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ వాహనాల లిథియం అయాన్‌ బ్యాటరీల్లోని లోపాలను గుర్తించి ఆటోమేటిక్‌గా మరమ్మతు చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈవీ వినియోగదారులు బ్యాటరీ సమస్యలపై సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం ఉండదని కంపెనీ తెలిపింది.

ప్యూర్ ఈవీ సంస్థ రూపొందించిన ఈ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజజజెన్స్) ఆధారిత సిస్టమ్ ను బ్యాట్రిక్‌ ఫెరడేగా పిలుస్తారు. ఈ సిస్టమ్‌ కోసం ఇంజనీర్లు ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌‌వర్క్‌ (ఏఎన్‌ఎన్‌) ఆధారిత అలాగోరిథం ను ఉపయోగించారు. ఈ టెక్నాలజీ సాయంతో ద్వారా బ్యాటరీలోని వివిధ శ్రేణుల్లోని లోపాలను గుర్తించి, బ్యాటరీ కణాల ఎలక్ట్రో-కెమిస్ట్రీ సామర్ధ్యానికి తగిన విధంగా మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా మరమ్మతు చేస్తుందని ప్యూర్‌ ఈవీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2022, 16:29 [IST]
English summary
Pure ev teases new etryst 350 electric motorcycle india launch expected soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+