ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

మార్కెట్లో విడుదలవుతున్న వాహనాలు రోజు రోజుకి కొత్త హంగులతో విడుదలవుతూ ఉన్నాయి. ఎందుకంటే వినియోగదారులు కూడా ఆధునిక మోడల్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం (2022) విడుదలైన రెట్రో బైకులను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

కవాసకి W175:

2022 లో భారతీయ మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులలో చెప్పుకోదగ్గ బైక్ కవాసకి యొక్క 'డబ్ల్యు175' (W175). ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,47,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సింగిల్ పీస్ సీటు మంచి రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి ఉన్నాయి.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

కవాసకి డబ్ల్యు175 బైక్ లో 177 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కావున ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

యెజ్డి స్క్రాంబ్లర్:

ఈ సంవత్సరం ప్రారంభంలో యెజ్డి కంపెనీ మూడు బైకులను విడుదల చేసింది. ఇందులో స్క్రాంబ్లర్ బైక్ ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర విడుదల సమయంలో రూ.2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంటాయి. ఈ బైక్ లో స్పీడో మీటర్ అనేది ఫ్రంట్ ఫోర్క్ పైన ఉంటుంది. ఇది బైక్ గురించిన చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

యెజ్డి స్క్రాంబ్లర్‌ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 28.7 బిహెచ్‌పి పవర్ మరియు 28.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. స్క్రాంబ్లర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందుబటులో ఉటుంది. కావున పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది, వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350:

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ సంవత్సరం తన హంటర్ 350 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో వేరియంట్ మరియు మెట్రో వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు మరియు రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై రూపొందించబడింది. కావున మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

కీవే SR125:

హంగేరియన్ బైక్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) దేశీయ మార్కెట్లో తన SR125 బైక్ లాంచ్ చేసి రెట్రో బాటలోకి చేరింది. ఈ బైక్ ధర రూ. 1,19,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పి మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన రెట్రో బైకులు: కవాసకి W175 నుంచి జావా 42 బాబర్ వరకు..

జావా 42 బాబర్:

జావా కంపెనీ యొక్క 42 బాబర్ కూడా ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లో విడుదలైన రెట్రో బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 334 సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి, 30.64 హెచ్‌పి పవర్ మరియు 32.64 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇది మూడు కలర్ ఆప్సన్స్ కలిగి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2022, 13:00 [IST]
English summary
Retro bikes launched in 2022 kawasaki w175 to jawa 42 bobber
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+