120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యం Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌: రివ్యూ

'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) అనేది ఈ రోజు ద్విచక్ర వాహన విభాగంలో ఒక తిరుగులేని బ్రాండ్. కుర్రకారుని ఉర్రూతలూగిస్తూ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ తా ఉనికిని చాటుకుంటున్న ఈ బ్రాండ్ 120 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. 2021 వ సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 120 సంవత్సరాల ప్రయాణాన్ని పురస్కరించుకుని స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు మరియు ఇతర ఉత్పత్తులను మాత్రమే కాకుండా కొత్త లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లను కూడా విడుదల చేసింది.

అయితే ఇటీవల మేము రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌లలో ఒకదానిని పొందాము. కావున ఈ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లు ఎలా ఉన్నాయి, దీని ప్యాకేజీ మరియు ఇతర వివరాలను గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

ప్యాకేజ్:

రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ను ఒక అద్భుతమైన ప్యాకేజీతో పొందాము. ఈ బాక్స్ సాధారణమైన వాటికంటే భిన్నంగా లేదు. కానీ ఈ బాక్స్ పైన మంచి గ్రాఫిక్స్ డిజైన్ వంటి వాటిని చూడవచ్చు. ఈ బాక్స్ యొక్క ముందు భాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో, ‘120 ఇయర్స్ ఆఫ్ ప్యూర్ మోటార్‌సైక్లింగ్' అనే పదాలు ఉన్నాయి.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

అదే సమయంలో ఈ బాక్స్ కి మరో వైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ 120 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం గురించి చిన్న బ్లర్బ్ కూడా ఉంది. బ్లాక్ కలర్ బాక్స్‌పై ఉపయోగించిన కలర్స్ కూడా చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ బాక్స్ చాలా అందంగా మరియు చూపరులను ఆకట్టుకుఇ విధంగా ఉంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

అన్‌బాక్సింగ్ మరియు పోస్ట్‌కార్డ్:

కంపెనీ అందించిన ఈ బాక్స్ యొక్క అన్‌బాక్సింగ్ ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంది. ఈ బాక్స్ యొక్క పైభాగం ఓపెన్ అయిన వెంటనే లోపల ఏమి ఉందొ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. బాక్స్ ఓపెన్ కాగానే మీరు ఒక తెల్లటి శాటిన్ స్లింగ్ బ్యాగ్‌లో చుట్టబడిన హెల్మెట్‌ని చూడవచ్చు.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

అదే విధంగా ఈ బాక్స్ లో ఎన్వలప్ లోపల పోస్ట్‌కార్డ్ ఉంది, ఇది ఈ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ డిజైన్ స్కీమ్‌ను వెల్లడిస్తుంది. ఇందులో 'గో ఇంటర్‌సెప్టర్' అని ఉంటుంది, తద్వారా ఇది 1962 లో తొలిసారిగా ప్రారంభమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750 కి నివాళి అని మనకు తెలియజేస్తుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

ఈ పోస్ట్‌కార్డ్ లెజెండరీ ఇంటర్‌సెప్టర్ 750 యొక్క రెట్రో ఇమేజ్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకూండా దాని వెనుక చిన్న వివరణాత్మక బ్లర్బ్ కూడా ఉంది. ఈ పోస్ట్ కార్డ్ వంటి వాటిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750:

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో ఒకటి. దీనిని కంపెనీ మొదటి సారి ప్రారభినప్పటికీ ఈ రోజుకి కూడా మంచి ఆధారణపొందుతూనే ఉంది. ఇది 1962 లో ఉత్పత్తి చేయబడింది, ఆ తరువాత వెంటనే ఇది ఇంగ్లాండ్‌లో అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిల్‌గా మారింది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

1962 లోనే 'రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750' దాదాపు 200 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 736 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో శక్తిని పొందింది, అంతే కాకుండా, ఇది ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత స్మూత్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ రోజుకి కూడా ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా తనకంటూ ఒక చరిత్రను మూటకట్టుకుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

గో ఇంటర్‌సెప్టర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్:

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ఆటోమోటివ్ రంగంలో తన 120 సంవత్సరాల ప్రయాణాన్ని పురస్కరించుకుని మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లను విడుదల చేసింది. ఈ హెల్మెట్ శ్రేణిలో మొత్తం 12 రకాల హెల్మెట్‌లు ఉన్నాయి. ఇందులో గో ఇంటర్‌సెప్టర్ హెల్మెట్ ఒకటి. ప్రతి హెల్మెట్ కూడా ప్రత్యేకంగా చేతితో పెయింట్ చేయబడి ఉంటుంది, కావున ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

ఈ కొత్త హెల్మెట్ లో ఒక వైపు, ప్రకాశవంతమైన-రెడ్ పెయింట్ మాత్రమే కనిపిస్తుంది, కాబట్టి ఇది కొంచెం సాదాసీదాగా కనిపిస్తుంది. హెల్మెట్ యొక్క ఎడమ వైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 750 యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీరు చూడవచ్చు. ఈ మోటార్‌సైకిల్ అధిక వేగంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

చేతితో చిత్రించిన పిన్‌స్ట్రైప్ హెల్మెట్ యొక్క రెండు విభిన్న భుజాలను వేరు చేస్తుంది. ముందు భాగంలో, విజర్ పైన రెట్రో-స్టైల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో ఉంది. హెల్మెట్ టాన్ లెదర్‌కు భిన్నంగా వైట్ స్టిచ్చింగ్ తో కూడిన లెదర్ బీడింగ్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో హెల్మెట్ వెనుక భాగంలో ఒక చిన్న పట్టీ ఉంది, అది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

హెల్మెట్ లోపల కనిపించే ప్యాడింగ్ యొక్క అవుట్‌లైన్‌లో ప్రీమియం లెదర్ కూడా ఉంది. ఈ హెల్మెట్ లోపల చాలా మృదువుగా ఉండటమే కాకుండా చెమట మొదలైన వాటిని నిరోధించడానికి పాలీజీన్‌తో కప్పబడి ఉంటుంది. ప్యాడింగ్ పైభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో ఎంబోస్ చేయబడింది, అంతే కాకుండా గాలి ప్రవాహానికి సహాయపడటానికి కొన్ని మెష్ బిట్‌లతో కూడా చుట్టబడి ఉంటుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

హెల్మెట్ ఆక్సర్ రెట్రో జెట్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది, నిజానికి లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ల తయారీని వేగా ఆటో నిర్వహిస్తోంది. రాట్‌చెట్ పట్టీ వెనుక వైపున ఉన్న బ్యాడ్జ్, ‘తయారీ చేసింది వేగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్ చేస్తోంది' అని రాసి ఉంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

హెల్మెట్ లోపలి భాగంలో మరో ముఖ్యమైన సమాచారం ఉంది. ఈ ప్రత్యేక లేబుల్‌లో ‘022/120' అని రాసి ఉంది. ఇది 120-యూనిట్ లిమిటెడ్ ఉత్పత్తిలో 22వ యూనిట్ అని సూచిస్తుంది. హెల్మెట్ యొక్క షెల్ లైట్ వెయిట్ ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేయబడింది మరియు ఇది పాలికార్బోనేట్ బబుల్ విజర్‌ను కూడా కలిగి ఉంటుంది. కావున ఈ కొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ గో ఇంటర్‌సెప్టర్' బరువు కేవలం 1,280 గ్రాములు వరకు మాత్రమే ఉంటుంది. కంపెనీ యొక్క ఈ హెల్మెట్ ECE, DOT మరియు ISI వంటి సర్టిఫికెట్స్ కూడా కలిగి ఉంటుంది.

120 సంవత్సరాల చరిత్ర: Royal Enfield లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రివ్యూ

రాయల్ ఎన్‌ఫీల్డ్ 120-ఇయర్ సెలబ్రేషన్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి మేము అందుకున్న 'గో ఇంటర్‌సెప్టర్ ఎడిషన్ హెల్మెట్' డిజైన్ పరంగా నిజంగా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అసలైన ఇంటర్‌సెప్టర్ 750 లో రైడ్ చేయాలనే కోరికను మాకు మిగిల్చింది. హాఫ్ పేస్ హెల్మెట్ ఫుల్ పేస్ యూనిట్ మాదిరిగా సురక్షితం కాకపోవచ్చు, కానీ ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది.ఇది మంచి ఆకర్షణీయమైన పెయింటింగ్ మరియు అద్భుతమైన గ్రాఫిక్స్ డిజైన్ పొందటం వల్ల ఇది మరింత అద్భుతంగా ఉంది.

Most Read Articles

English summary
Royal enfield 120 years celebration helmet go interceptor review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X