హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Himalayan) లో కంపెనీ ఇప్పుడు మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. కొత్త కలర్ ఆప్షన్లలో డూన్ బ్రౌన్ మరియు గ్లాసియల్ బ్లూ ఉన్నాయి.

Recommended Video

Citroen C3 బుకింగ్స్ స్టార్ట్ | పూర్తి వివరాలు

ఈ కొత్త రంగులతో ఇప్పుడు ఈ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది మరియు కస్టమర్‌లకు తమ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవడానికి విస్తృతమైన కలర్ ఆప్షన్లు కూడా అందిస్తాయి.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ లో కొత్తగా ప్రవేశపెట్టిన 'డూన్ బ్రౌన్' (Dune Brown) కలర్, స్పెషల్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 మోటార్‌సైకిల్‌లో ఒకప్పుడు అందుబాటులో ఉన్న 'డెసర్ట్ స్టార్మ్' కలర్ ఆప్షన్ ను పోలి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కూడా ప్రస్తుతం ఇలాంటి కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది, దానిని 'డెసర్ట్ సాండ్' అనే పేరుతో పిలుస్తారు.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

అయితే, ఈ పైన పేర్కొన్న క్లాసిక్ 350 కలర్ ఆప్షన్‌ల మాదిరిగా కాకుండా, 'డూన్ బ్రౌన్' కలర్ ఆప్షన్ కంపెనీ ఇప్పటికే అందిస్తున్న పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్ మాదిరిగా క్యామోఫ్లేజ్ ప్యాటర్న్ ను కలిగి ఉంటుంది. ఇకపోతే, రెండవ కొత్త కలర్ ఆప్షన్ అయిన 'గ్లాసియల్ బ్లూ' కూడా పూర్తిగా కొత్తదేమీ కాదు. గతంలో 'లాగూన్ బ్లీ' అనే పేరుతో ఇదే రకమైన కలర్ ఆప్షన్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 మోటార్‌సైకిళ్లలో ఆఫర్ చేశారు.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

అయితే, 'డూన్ స్టార్మ్' కలర్ ఆప్షన్ మాదిరిగా 'గాలేసియల్ బ్లూ' ఎలాంటి క్యామోఫ్లేజ్ ప్యాటర్నలను కలిగి ఉండదు, ఇది చాలా స్మూత్ ఫినిషినింగ్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు కొత్త రంగులతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మొత్తం 9 విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చిన రెండు కలర్ ఆప్షన్లలో కేవలం కలర్ మార్పు మినహా మెకానికల్ గా మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ విషయానికి వస్తే, భారతదేశపు పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ మోటార్‌సైకిల్ భారతదేశంలో అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. హిమాలయన్ బైక్ రాకతో ఈ అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్లో అనేక కొత్త మోడళ్లు ప్రవేశించాయి. భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కూడా ఎక్స్‌పల్స్ 200 పేరుతో ఓ అడ్వెంచర్ టూరర్ బైక్ ను ప్రవేశపెట్టింది.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న హిమాలయన్ మోటార్‌సైకిల్ లో పవర్‌ఫుల్ 411 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి శక్తిని మరియు 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

హిమాలయన్ మోటార్‌సైకిల్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకించి కఠినమైన రోడ్లపై మంచి అసాధారణమైన పనితీరును అందించేలా డిజైన్ చేసింది. అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం ఈ బైక్ లో ముందు వైపు పెద్ద 21 ఇంచ్ స్పోక్ వీల్ ను ఉపయోగించారు. అలాగే, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ముందువైపు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఓ మంచి అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్ అయినప్పటికీ, ఈ ఇంజన్ విభాగంలో ఇది కెటిఎమ్ అడ్వెంచర్ 390, బజాజ్ డొమినార్ 400 వంటి కొన్ని ఇతర మోటార్‌సైకిళ్లతో పోలిస్తే హిమాయలన్ కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్‌ తో ఒక కొత్త హిమాలయన్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది కొత్త పవర్‌ఫుల్ ఇంజన్ తో పాటుగా మరిన్ని సుధీర్ఘమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

సమాచారం ప్రకారం, రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 సీసీ ఇంజన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదొక లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ గా ఉంటుంది మరియు ఇది గరిష్టంగా దాదాపు 45 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయగలదని అంచనా. అయితే, మెరుగైన లో-ఎండ్ మరియు మిడ్-రేంజ్ పనితీరు కోసం ఈ ఇంజన్ యొక్క గరిష్ట శక్తిని తగ్గించబడే అవకాశం ఉంది.

హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్లు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిన అడ్వెంచర్ బైక్!

రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ప్రస్తుత 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి బదులుగా కొత్త 6-స్పీడ్ గేర్‌బాక్స్ ‌ను కలిగి ఉంటుందని సమాచారం. తమ అమ్మకాలను మరింత పెంచడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలోనే ఈ కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ కొత్త మోడల్‌ హిమాలయన్ 450 రాకతో ప్రస్తుతం విక్రయిస్తున్న హిమాలయన్ 410 శ్రేణి మోటార్‌సైకిళ్లను కంపెనీ డిస్‌కంటిన్యూ చేస్తుందా లేక వాటితో పాటే ప్రీమియం వేరియంట్ గా ఈ కొత్త మోడల్ ను విక్రయిస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2022, 10:44 [IST]
English summary
Royal enfield adds two new colour options in himalayan lineup details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+