ఫిలిప్పీన్స్‌లో విడుదలైన Royal Enfield Classic 350: పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) యొక్క క్లాసిక్ 350 (Classic 350) అత్యంత ప్రజాదరణపొందిన మోడల్. దేశీయ విఫణిలో అడుగుపేట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ బైక్ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు దేశాలు దాటి ఫిలిప్పీన్స్ మార్కెట్లో విడుదలైంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఉనికి ప్రపంచదేశాల్లో విస్తరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా, యూరప్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్లలలో విస్తరిస్తోంది. కేవలం క్లాసిక్ 350 మాత్రమే కాకుండా, ఈ దేశాల్లో మీటియార్ 350, కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 వంటి వాటిని విక్రయిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ విషయానికి వస్తే, ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ J సిరీస్ ఇంజిన్‌ను ఉపయోగించే రెట్రో స్టైల్ బైక్. ఫిలిప్పీన్స్‌లో, క్లాసిక్ 350 నాలుగు వేరియంట్‌లు మరియు 7 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. ఫిలిప్పీన్స్ మార్కెట్లో దీని ధర PHP 228,000. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 3.34 లక్షలు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పటికే భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త Classic 350 బైక్ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త బైక్ లో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ దాని పాత సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ఉపయోగించబడింది. కావున దీని బరువు 195 కిలోల వరకు ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు ఎక్కువ వైబ్రేషన్ అనిపించదు, తద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తానికి ఈ బైక్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ఖండాంతరాలు దాటేస్తున్నాయి.అయితే విదేశాల్లో ఈ లేటెస్ట్ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెళుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








