తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) 2022 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. విడుదలైన గణాంకాల ప్రకారం గత నెలలో కంపెనీ మొత్తమ్ 59,160 మోటార్‌సైకిళ్లను విక్రయించగలిగింది. అయితే గత ఏడాది ఇదే నెలలో (2021 ఫిబ్రవరి) కంపెనీ మొత్తం 69,659 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మునుపటి సంవత్సరం కంటే కూడా 15% తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మార్కెట్లో ఎదుర్కొన్న సెమీకండక్టర్ చిప్‌ కొరత కారణంగా ఉత్పత్తి మరియు డెలివరీ అనేది కొంత ఆలస్యం జరిగింది. ఇది అమ్మకాలు తగ్గడానికి ఇది ప్రధాన కారణం అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సమస్య కొంత కుదుటపడింది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

2022 ఫిబ్రవరి నెలలో మొత్తం 7,025 యూనిట్లను ఎగుమతి చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విక్రయాలు 55% వృద్ధిని నమోదు చేసుకోగా, దేశీయ మార్కెట్ విక్రయాలు ఫిబ్రవరి 2022లో 20 శాతం క్షీణించి 53,135 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే అదే సమయంలో 2021 ఫిబ్రవరిలో కంపెనీ 65,114 మోటార్‌సైకిళ్లను విక్రయించగలిగింది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

2022 జనవరి నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 49,726 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, అదే నెలలో 9,112 యూనిట్లను ఎగుమతి చేసింది. 2021 ఏప్రిల్ నెల నుండి 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ 102 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇది ఒక సంవత్సరం క్రితం 32,737 యూనిట్ల నుండి 71,832 యూనిట్ల విదేశీ అమ్మకాలను నమోదు చేసింది. ఇది కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

కంపెనీ అదే సమయంలో దేశీయ మార్కెట్ విక్రయాలు ఏప్రిల్ 2020 నుండి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో 5,13,555 యూనిట్ల నుండి 10 శాతం పడిపోయి ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 మధ్య కాలంలో 4,62,759 మోటార్‌సైకిళ్లకు పడిపోయాయి. మొత్తంమీద, ఈ కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అమ్మకాలు కొంత నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ 2021 ఏప్రిల్ మరియు 2022 ఫిబ్రవరి కాలంలో కొంత తక్కువ అమ్మకాలను నమోదు చేయగలిగింది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

రాయల్ ఎన్ఫీల్డ్ కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా కంపెనీ 2021లో భారతదేశంలో కొత్త క్లాసిక్ 350ని విడుదల చేసిన తర్వాత, ఇది థాయిలాండ్, ఫిలిప్పీన్స్, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు UK వంటి దేశాల్లో కూడా ప్రారంభించబడింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఉత్పత్తులకు మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ మనకు స్పష్టంగా తెలుస్తోంది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

ఇదిలా ఉండగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త మోటార్‌సైకిల్ స్క్రమ్ 411ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ యొక్క అర్బన్-ఎడిషన్, ఇది మార్చి 2022లో భారతదేశంలో లాంచ్ చేయబడి, రాబోయే నెలల్లో విదేశీ మార్కెట్‌లలో ప్రారంభించబడుతుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత అన్ని మోడల్స్ మాదిరిగానే మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత ఏడాది మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ఎగ్జిబిషన్‌లో తన కొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ SG 650 ని వెల్లడించింది. కంపెనీ ఈ కొత్త బైక్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఈ మోడల్ కాంటినెంటల్ GT 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లలో ఉన్న 650 సిసి ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడుతుందని భావిస్తున్నారు. కావున ఇది కూడా చాలా దూకుడుగా ఉండే అవకాశం ఉంటుంది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ద్విచక్ర వాహన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, రాయల్ ఎన్‌ఫీల్డ్ థాయ్‌లాండ్‌లో తన స్థానిక అసెంబ్లీ యూనిట్ మరియు CKD సౌకర్యాన్ని నిర్వహించడం ప్రారంభించింది. అర్జెంటీనా మరియు కొలంబియా తర్వాత ఇది రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క మూడవ స్థానిక CKD సదుపాయం. మొత్తానికి దేశ విదేశాల్లో సైతం కంపెనీ తన అమ్మకాలను విస్తరించడానికి అనునిత్యం పరితపిస్తూనే ఉంది.

తగ్గిన Royal Enfield 2022 ఫిబ్రవరి సేల్స్.. కారణం అదే అంటున్న కంపెనీ

కంపెనీ ఇప్పటికే వెల్లడించిన మోడల్స్ ఒక్క సారి మార్కెట్లో అడుగుపెడితే, తప్పకుండా తమ అమ్మకాలు పెరుగుదల దిశవైపు సాగుతాయి. కావున ఈ మోడల్స్ త్వరలోనే మార్కెట్లో విడుదలవుతాయి. ఇవన్నీ మార్కెట్లో కస్టమర్లను మరింత ఆకర్షించడంలో సహాయపడతాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 2, 2022, 16:23 [IST]
English summary
Royal enfield february 2022 sales 59160 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+