ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

సాధారణంగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఊహకందని నష్టాలు జరుగుతుంటాయి. కావున ఇలాంటి నష్టాలను నివారించడానికి అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇరుకైన ప్రాంతాల్లో మరియు వాహనాలు చేరుకోలేని ప్రాంతాల్లోకి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం నిజంగా పెద్ద సవాలు అనే చెప్పాలి. అగ్నిమాపక సిబ్బంది చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అయితే ఇలాంటి సమస్యలను రూపుమాపడానికి ద్విచక్ర వాహన ఆధారిత అగ్నిమాపక వాహనాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ సర్వీస్ ముంబై, హైదరాబాద్ మరియు కొట్టాయం వంటి నగరాల్లో అందుబాటులో ఉంది.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

అగ్నిమాపక సిబ్బంది వినియోగించడానికి అనుకూలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు మాడిఫైడ్ చేయబడ్డాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల యొక్క కఠినమైన స్వభావం కారణంగా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండం జరిగింది. సాధారణంగా ఇతర వినియోగాలలో కూడా ఎక్కువభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులనే వినియోగిస్తారు.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

ఇప్పుడు సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అగ్నిమాపక వాహనంగా మాడిఫైడ్ చేయబడింది. ఇది పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC)తో విస్తరించబడుతుంది. హిమాలయన్‌ ఫైర్ అంబులెన్స్‌ యొక్క వెనుకవైపు రెండు 20-లీటర్ వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయి. ఈ మోటారుసైకిల్ అదనపు బరువుతో ఎటువంటి సమస్యల ఎదుర్కోదు. ఎందుకంటే ఇది భారీ వస్తువులను తీసుకువెళ్లడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ముందు మరియు వెనుక రెండింటిలోనూ రాక్‌లతో వస్తుంది. వెనుక భాగంలో, రెట్రోఫిట్ చేయబడిన హిమాలయన్‌లో 100 అడుగుల పైపు మరియు స్ప్రే నాజిల్ కూడా ఉన్నాయి. ఇతర పరికరాలు అధిక పీడనం వద్ద నీటిని చల్లడం కోసం పంపును కలిగి ఉంటాయి. 20-లీటర్ ట్యాంకులు డిఫాల్ట్‌గా నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ సిబ్బందికి మంటలార్పే సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

సాధారణంగా అన్ని రకాల అగ్నిప్రమాలలో నీటి చేతనే అగ్నిని ఆర్పివేయలేము. ఒక వేళా పెట్రోల్ మంటలపైన నీటిని చల్లితే మంటలు మరింత ఎక్కువవుతాయి. కావున సిబ్బంది సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. దీనికి హిమాలయ ఫైర్‌ఫైటింగ్ బైక్‌ చాలా ఉపయోగపడతాయి. మంటలను ఆర్పడానికి మాత్రమే కాకుండా ఈ బైక్‌లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

కార్లు లాంటి నాలుగు చక్రాల వాహనాలు సులభంగా చేరుకోలేని ప్రాంతాలకు ఈ బైకులు సులభంగా చేరుకుంటాయి. ఇరుకైన ప్రదేశాల్లో కూడా ఇవి సులభంగా మరియు వేగంగా చేరుకుంటాయి. అంతే కాకుండా బైక్‌లు రూట్ క్లియరెన్స్ వెహికల్‌లుగా కూడా పనిచేస్తాయి, తద్వారా అగ్నిమాపక దళం బృందం ట్రాఫిక్‌లో ప్రయాణించి సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

మొదట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఫైర్‌కు చెందిన మూడు బైక్‌లను పిసిఎంసి రూ. 13.5 లక్షలతో కొనుగోలు చేసింది. ఇందులో బైక్ ధర మరియు అది తీసుకువెళ్లే అగ్నిమాపక పరికరాల ధరలు రెండూ ఉంటాయి. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 2.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

అగ్నిమాపక పరికరాలను తయారు చేయడంలో ప్రత్యేకత కలిగిన థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా రెట్రోఫిట్టింగ్ చేయబడుతుంది. అయితే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు మరియు ఇది ఇప్పటికే ఉన్న 411 సిసి, ఎయిర్-కూల్డ్, SOHC ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్‌ శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 32 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫైర్ మోటార్ సైకిల్ దూరం నుండి సులభంగా గుర్తించబడుతుంది. ఎందుకంటే ఈ ఫైర్ బైక్‌లకు రెడ్ అండ్ ఎల్లో కలర్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ ఇవ్వబడింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాలకు ఇది స్టాండర్డ్ కలర్ కోడ్. ఇవి చూడటానికి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

ఫైర్ అంబులెన్సులుగా మారిన Royal Enfield Himalayan బైక్స్.. ఇక్కడ చూడండి

సాధారణంగా ఇప్పటికే మనం చాలా రకాల మాడిఫైడ్ వాహనాలను గురించి మునుపటి చాలా కథనాల్లో తెలుసుకున్నాము. అయితే ఇలాంటి ఫైర్ వాహనాలను గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే ఇవి అగ్నిమాపక సిబ్బందికి చాలా అనుకూలంగా ఉంటాయి. రానున్న రోజుల్లో ఇలాంటి వాహనాలు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఇవి తప్పకుండా వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 26, 2022, 10:00 [IST]
English summary
Royal enfield himalayan modified into special firefighter motorcycles details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+