రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇటీవల తమ కొత్త మోటార్‌సైకిల్ స్క్రామ్ 411 (Scram 411) అనే స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్‌సైకిల్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411) అనేది, కంపెనీ విక్రయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan) ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన డ్యూయెల్ పర్పస్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

ఒక్కమాటలో చెప్పాలంటే, స్క్రామ్ 411 ను చవకైన హిమాలయన్ మోటార్‌సైకిల్ గా చెప్పొచ్చు. ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారైనందు వలన వీటిలో అనేక పరికరాలు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కాకపోతే, వీటి డిజైన్ లో మాత్రం చాలా తేడాలు ఉంటాయి. మరి ఈ రెండు మోడళ్లలో ఉండే వ్యత్యాసాలు మరియు సారూప్యతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

స్క్రామ్ 411 vs హిమాలయన్ - డిజైన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలన్ మోటార్‌సైకిల్ ఎక్కువ డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉండి చూడటానికి పెద్ద ఆఫ్-రోడర్ మోటార్‌సైకిల్ లా అనిపిస్తుంది. కాగా స్క్రామ్ 411 చాలా తక్కువ డిజైన్ ఎలిమెంట్స్ తో హిమాలయన్ యొక్క టోన్-డౌన్ వెర్షన్ గా కనిపిస్తుంది. హిమాలయన్ లో ముందు వైపు ఫిక్స్డ్ హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది కాగా, స్క్రామ్ 411 లో ఇది ఫ్రంట్ ఫోర్కుకు అమర్చిబడి ఫ్లెక్సిబల్ యూనిట్ గా ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో ఫ్యూయెల్ ట్యాంక్స్ డిజైన్ కాస్తంత భిన్నంగా కనిపిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

హిమాలయన్ ముందు భాగంలో గాలి నిరోధం కోసం విండ్‌షీల్డ్ ఉంటుంది, స్క్రామ్ 411లో అది కనిపించదు. అలాగే, హిమాలయన్ బైక్ లో ఎత్తులో ఉండే ఫ్రంట్ మడ్‌గార్డ్, ఫ్యూయెల్ ట్యాంక్ చుట్టూ ఐరన్ ఫ్రేమ్ మరియు స్ప్లిట్ సీట్ వంటి డిజైన్ ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ స్క్రామ్ 411లో మిస్ అవుతాయి. ఓవరాల్‌గా కొత్త స్క్రామ్ 411 డిజైన్ హిమాలయన్ డిజైన్ కంటే చాలా సరళమైనదిగా మరియు అంతే ప్రీమియంగా ఉంటుంది. స్క్రామ్ 411లో పెట్రోల్ ట్యాంక్ కోసం రెండు చిన్న ప్యానెల్స్, ఒక బాష్ ప్లేట్, సింగిల్-పీస్ సీట్ మరియు పిలియన్ రైడర్ గ్రిప్ కోసం గ్రాబ్ రెయిల్ మొదలైనవి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

స్క్రామ్ 411 మరియు హిమాలయన్ మోటార్‌సైకిళ్లలో మరొక ప్రధానమైన మార్పు వాటి వీల్స్ మరియు టైర్స్ లో ఉంటుంది. హిమాలయన్ ముందు భాగంలో 21 ఇంచ్ మరియు వెనుక భాగంలో 19 స్పోక్డ్ వీల్స్ మరియు వాటి ఆఫ్-రోడ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నాబీ టైర్స్ ఉంటాయి. కాగా, స్క్రామ్ 411 బైక్ లో ముందు వైపు 19 ఇంచ్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్డ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఉద్దేశించబడిన సియట్ ఆల్-గ్రిప్ టైర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

ఈ రెండు మోడళ్లలో వీల్స్ అండ్ టైర్స్ లో చేసిన మార్పుల కారణంగా హిమాలయన్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీ గానూ మరియు స్క్రామ్ 411 యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ గానూ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

స్క్రామ్ 411 vs హిమాలయన్ - ఇంజన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్కాంబ్లర్ మోటార్‌సైకిల్ లో కూడా హిమాలయన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లో ఉపయోగిస్తున్న అదే 411 సిసి, ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి, ఇంజన్ పరంగా ఈ రెండు మోడళ్లలో ఎలాంటి మార్పు ఉండదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

స్క్రామ్ 411 vs హిమాలయన్ - ఫీచర్లు

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌లో కంపెనీ తమ పాపులర్ మీటియోర్ 350 క్రూయిజ్ మోటార్‌సైకిల్ లో తొలిసారిగా ఆఫర్ చేసిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఆప్షనల్ ఫీచర్ గా మాత్రమే అందిస్తుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మాత్రం ఇది స్టాండర్డ్ ఫీచర్ గా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మోడల్ లో టాకోమీటర్ ఫీచర్ కూడా ఉండదు. ఈ విభాగంలోని ఇతర మోడళ్లు ఎల్ఈడి హెడ్‌లైట్లతో లభిస్తుంటే, స్క్రామ్ 411 ను మాత్రం కంపెనీ హాలోజెన్ లైట్లతో అందిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

ఇతర మెకానికల్ ఫీచర్లను గనిస్తే, స్క్రామ్ 411 హాఫ్-డ్యూప్లెక్స్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది మరియు ముందు వైపు 190 మిమీ వీల్ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపు 180 మిమీ వీల్ ట్రావెల్ తో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. కాగా, హిమాలయన్ బైక్‌లో ముందు వైపు 200 మిమీ ట్రావెల్ తో కూడిన సస్పెన్షన్ ఉంటుంది. హిమాలయన్ వెనుక సస్పెన్షన్ మరియు స్క్రామ్ 411 వెనుక సస్పెన్షన్ రెండూ కూడా ఒకేలా (180 మిమీ) ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 vs హిమాలయన్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు?

స్క్రామ్ 411 vs హిమాలయన్ - ధరలు

ఇక చివరిగా ధరలను చూస్తే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ధరలు రూ. 2.03 లక్షల నుండి 2.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. ఇది ఏడు ఆకర్షణీమయైన రంగులలో లభిస్తుంది మరియు కలర్ ఆప్షన్ ను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ ధరలను గమనిస్తే, మార్కెట్లో ఇది రూ. 2.14 లక్షల నుండి రూ. 2.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది. కాబట్టి, తక్కువ ధరకు హిమాలయన్ లాంటి ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ బైక్ కోరుకునే వారికి స్క్రామ్ 411 స్క్రాంబ్లర్ చక్కటి ఆప్షన్ గా ఉంటుంది. అలాకాకుండా, పూర్తిగా అడ్వెంచర్ ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ బైక్ కోరుకునే వారికి హిమాలయన్ బెస్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ రెండింటిలో మీ ఫేవరేట్ బైక్ ఏది..?

Most Read Articles

English summary
Royal enfield himalayan vs scram 411 design specs features and price comparison
Story first published: Monday, March 21, 2022, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X