ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ తదుపరి మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350) ని దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్ ను ఆగస్ట్ 7, 2022వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అదే రోజున కంపెనీ దీని ధరతో పాటు ఇతర సమాచారాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ని అధికారికంగా విడుదల చేయడానికి ముందే డీలర్‌షిప్ లకు పంపిణీ చేస్తోంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

ఇటీవల ఓ డీలర్ స్టాక్ యార్డులో డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిళ్లు కనిపించాయి. అలాగే, ఇదివరకు ఈ మోటార్‌సైకిల్ కు సంబంధించి లీకైన అఫీషియల్ డాక్యుమెంట్ కూడా హంటర్ 350 గురించి అనేక వివరాలను వెల్లడి చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ పాపులర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ మీటియోర్ 350 ని తయారు చేసిన అదే J ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హంటర్ 350 మోటార్‌సైకిల్ ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో రెండూ మోడళ్లలో అనేక సారూప్యతలు ఉండే అవకాశం ఉంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

అయితే, మీటియోర్ 350 క్రూయిజర్ బాడీ టైప్ డిజైన్ ను కలిగి ఉంటే, హంటర్ 350 స్క్రాంబ్లర్ టైప్ బాడీ డిజైన్ ను కలిగి ఉంటుంది. సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ హంటర్ 350 మోటార్‌సైకిల్ ను రెండు వేరియంట్‌లలో విడుదల చేయవచ్చు. ఇటీవల ఆన్‌లైన్ లో ఈ కొత్త మోటార్‌సైకిల్ కు సంబంధించి లీకైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం, హంటర్ 350 బైక్ కేవలం 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు మరియు 1,055 మిమీ ఎత్తును మాత్రమే కలిగి ఉండి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా పరిమాణంలో అతి చిన్నదిగా ఉంటుంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వీల్‌బేస్ కూడా కేవలం 1,370 మిమీగా మాత్రమే ఉంటుంది. అయితే, ఈ వాహనం యొక్క స్థూల బరువు (గ్రాస్ వెయిట్) సుమారు 360 కేజీలుగా రేట్ చేయబడింది. ఈ బరువు వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్ లో కెల్లా అత్యంత తేలికైన మోటార్‌సైకిల్ గా ఉంటుంది. సమాచారం ప్రకారం, దీని ధర కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ ధర వద్ద ఇది అత్యంత సరసమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గా నిలుస్తుంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

హంటర్ 350 తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు మరియు సరసమైన ధరకే ఈ బైక్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ తమ ప్రస్తుత మీటియోర్ 350 మరియు క్లాసిక్ 350 మోడళ్లలో ఉపయోగించిన అనేక విడిభాగాలు మరియు పరికరాలను ఈ కొత్త హంటర్ 350 లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇంజన్ కూడా ఈ రెండు మోడళ్ల మాదిరిగానే అదే 350సీసీ యూనిట్ గా ఉంటుంది. మరియు దాని పవర్ టార్క్, గణాంకాలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

ఆన్‌లైన్ లో లీకైన పత్రాల ప్రకారం, మీటియోర్ 350 మరియు క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ను హంటర్ 350 లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 19.94 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత తేలికైన మరియు అతి చురుకైన మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఇతర ప్రీమియం మోటార్‌సైకిళ్ల మాదిరిగా కాకుండా హంటర్ 350 ని అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లతో అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ బైక్ లో తగ్గిన ఫీచర్ల కారణంగా, దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా వేయబడింది. బహుశా ఇది (హంటర్ 350) రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్ లోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్‌ గా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ యొక్క తాజా ఫొటోలను చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిటారుగా ఉండ్ స్పోర్టి రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగస్ట్ 7వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) బైక్ విడుదల.. ఫుల్ డీటేల్స్!

హంటర్ 350 మోటార్‌సైకిల్ లో టియర్ డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మిడ్-సెట్ ఫుట్ పెగ్‌లు, వెడల్పాటి హ్యాండిల్‌ బార్‌, చిన్న సైజులో ఉండే సైలెన్సర్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్, గుండ్రటి టెయిల్ ల్యాంప్‌లు, టర్న్ ఇండికేటర్‌లు మరియు రియర్-వ్యూ మిర్రర్లు, స్క్లాంబ్లర్ లుక్ ని తెచ్చిపెట్టే సింగిల్ పీస్ సీట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. భారతదేశంలో హిమాయలన్ ఆఫ్-రోడ్ బైక్ ఆధారంగా కంపెనీ విడుదల చేసిన స్క్రామ్ 411 తర్వాత వస్తున్న హంటర్ 350 ఈ కంపెనీ నుండి ఈ ఏడాది విడుదలవుతున్న రెండవ కొత్త మోడల్ గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 భారతదేశంలోని 350సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో హోండా సిబి350 ఆర్ఎస్, హోండా హైనెస్ సిబి350, యెజ్డి రోడ్‌స్టర్ 350 మరియు జావా క్లాసిక్ 350 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2022, 17:26 [IST]
English summary
Royal enfield hunter 350 india launch scheduled on 7th august 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+