వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) దేశీయ మార్కెట్లో తన కొత్త డుగడుగు బండి 'హంటర్ 350' (Hunter 350) ని అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో వేరియంట్ మరియు మెట్రో వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 1.50 లక్షలు మరియు రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్).

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హంటర్ 350' బైక్ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కొత్త హంటర్ 350 మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే అదే J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేశారు.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 యొక్క ముందు భాగంలో స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో పాటు రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. అయితే ఇందులోని ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు. టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా క్రీజ్‌లు ఉన్నాయి కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

సైడ్ ప్యానల్ లో హంటర్ 350 లోగో కూడా చూడవచ్చు. ఈ బైక్ యొక్క దూకుడును మరింత పెంచడానికి ఫుట్‌పెగ్‌లు మరియు సింగిల్ స్టెప్డ్ సీటు వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో రౌండ్ LED టైల్‌లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్‌లతో పాటు స్ప్లిట్ గ్రాబ్ రైల్ సెటప్ కూడా ఉంటుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

హంటర్ 350 యొక్క కొలతల విషయానికి వస్తే.. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీని బరువు 181 కేజీలు. ఇది దాని మీటియోర్ 350 కంటే 10 కేజీలు తక్కువ మరియు క్లాసిక్ 350 కంటే ఏకంగా 14 కేజీలు తక్కువగా ఉంటుంది. కావున ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 యొక్క ముందువైపు 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ సెటప్ మరియు 6 వే అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో వెనుకవైపు ట్విన్ షాక్‌లను కలిగి ఉంది.

అదే సమయంలో ఈ బైక్ ముందు భాగంలో 110/70-17 54P మరియు వెనుకవైపు 140/70 - 17 - 66P ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉంటాయి. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

హంటర్ 350 యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 300 మిమీ ఫిక్స్‌డ్ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 270 మిమీ బ్రేక్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కూడా హంటర్ 350 మెట్రో వేరియంట్లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అందుబాటులో ఉంటుంది. కానీ హంటర్ 350 రెట్రో వేరియంట్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.

వేట మొదలైంది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' వచ్చేసింది: ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి దేశీయ మార్కెట్లో మరో కొత్త బైక్ (హంటర్ 350) విడుదలయ్యింది. ఇది నిజంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రేమికులకు ఒక పండుగలాంటి వార్త అనే చెప్పాలి. ఈ బైక్ భారతీయ మార్కెట్లో హోండా సిబి350ఆర్ఎస్, జావా ఫార్టీ టూ మరియు యెజ్డీ రోడ్‌స్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Royal enfield hunter 350 launched at rs 1 50 lakh specs features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X