ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

మార్కెట్లో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) కంపెనీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతున్న సమయంలో కంపెనీ కూడా తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాలయన్ స్క్రామ్411 విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో బైకుని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమైపోయింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 'రాయల్ ఎన్‌ఫీల్డ్' భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) కానుంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన టీజర్లకు కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన మరో టీజర్ కూడా విడుదల చేసింది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన టీజర్ లో ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి చూడవచ్చు. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్ అందినచనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త బైక్ భారతీయ మార్కెట్లో వచ్చే నెల (2022 ఆగష్టు) 07 న విడుదల కానున్నట్లు మునుపటి టీజర్ లో వెల్లడించింది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. అయితే ఇక త్వరలోనే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదవుతుంది. ఈ బైక్‌లో ఎల్‌ఈడీ బ్లింకర్, ఫ్లాషర్ వంటి స్టాండర్డ్ లైట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అంతే కాకుండా ఈ బైక్ బహుశా రెండు లేదా మూడు వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

త్వరలో విడుదల కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా అందుబాటులో లేదు. అయితే మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. కానీ ఇది తప్పకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో రైడర్లకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ ఇవ్వనుంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

హంటర్ 350 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క J-ప్లాట్‌ఫాం ఇంజన్‌ను కలిగి ఉన్న మూడవ బైక్. కావున ఇది 349 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 19.9 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఈ రకమైన ఇంజిన్ కంపెనీ యొక్క క్లాసిక్ మరియు మీటియోర్ వంటి బైకులతో అందుబాటులో ఉంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క హంటర్ 350 బైక్ లో 349.34 సిసి ఇంజిన్ ఉండనుంది. ఇది 19.9 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే క్లాసిక్ మరియు మీటియార్ వంటి వాటిలో కూడా ఉపయోగించింది. కావున ఇది తప్పకుండా మంచి పనితీరుని అందిస్తుంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధరను కూడా కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధరకే విక్రయించబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇది తన ప్రత్యర్థులైన హోండా సిబి350 ఆర్ఎస్, హోండా హైనెస్ సిబి350 మరియు యెజ్డీ రోడ్‌స్టర్ 350 వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

ఇదిలా ఉండగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆగష్టు 05 న తన కొత్త బుల్లెట్ 350 ని విడుదల చేయనుంది. కంపెనీ ఇటీవలే దీనికి సంబంధించిన ఒక కొత్త టీజర్‌ విడుదల చేసింది. ఇందులో బుల్లెట్ మేరీ జాన్ అని వ్రాయబడింది. ఈ కొత్త బుల్లెట్ 350 కూడా J ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడి ఉంటుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది, కావున తప్పకుండా ధరలో పెరుగుదల ఉంటుంది.

ప్రత్యర్థులకు దడ పుట్టించడానికి వస్తున్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350'

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాయల్ ఎన్‌ఫీల్డ్ తప్పకుండా దేశీయ మార్కెట్లో తన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకోనుంది. కంపెనీ దీనిని సాకారం చేసుకోవడానికి అటువైపు అడుగులు వేస్తోంది. కావున త్వరలో విడుదల కానున్న హంటర్ 350 మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Royal enfield hunter 350 new teaser features details
Story first published: Thursday, August 4, 2022, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X