రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

భారతదేశపు అత్యంత పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోడళ్లలో హంటర్ 350 (Hunter 350) కూడా ఒకటి. తాజాగా, ఈ కొత్త మోటార్‌సైకిల్ కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే ఈ కొత్త మోటార్‌సైకిల్ అత్యంత చురుకైన మరియు అత్యంత సరసమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌గా ప్రచారం చేయబడుతోంది. మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) చాలా కాలంగా భారత రోడ్లపై పరీక్షించబడుతోంది. కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఎట్టకేలకు ఈ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కంపెనీ గతంలో విడుదల చేసిన క్రూయిజర్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ని తయారు చేసిన అదే ప్లాట్‌ఫారమ్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ J-ప్లాట్‌ఫారమ్) పై ఆధారపడి తయారు కానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

ఈ కొత్త హంటర్ 350 కి సంబంధించి లీకైన స్పెసిఫికేషన్‌లను గమనిస్తే, ఈ మోటార్‌సైకిల్ నుండి ఏమి ఆశించవచ్చనే దానిపై ఓ స్పష్టతను వస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ యొక్క ఈ స్పెసిఫికేషన్‌లు టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ ద్వారా లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కేవలం 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు మరియు 1,055 మిమీ పొడవుతో అతి చిన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

దీనికి తోడు, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ వీల్‌బేస్ కూడా కేవలం 1,370 మిమీగా మాత్రమే ఉంటుంది. అయితే, ఈ వాహనం యొక్క స్థూల బరువు (గ్రాస్ వెయిట్) సుమారు 360 కేజీలుగా రేట్ చేయబడింది. జే-ప్లాట్‌ఫామ్ ను పంచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ తో పోలిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ 85 మిమీ తక్కువ పొడవును, 45 మిమీ తక్కువ వెడల్పును, 85 మిమీ తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది మరియు దీని వీల్‌బేస్ కూడా 35 మిమీ తక్కువగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

ఈ కాంపాక్ట్ కొలతల కారణంగా, హంటర్ 350 బరువు మీటియోర్ 350 బరువు కన్నా 11కిలోలు తక్కువగా ఉంటుంది. లీక్ అయిన టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ హంటర్ 350 బైక్ లో ఉపయోగించే ఇంజన్ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మాదిరిగానే అదే 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ను కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

హంటర్ 350 టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ ప్రకారం, ఈ ఇంజన్ 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 19.94 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ శక్తి కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మాదిరిగానే ఒకేలా ఉంటుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తోజతచేయబడి ఉండే అవకాశం ఉంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని ఇంజనీర్లు హంటర్ 350 మోటార్‌సైకిల్ లక్షణాలకు అనుగుణంగా గేర్ నిష్పత్తులను సర్దుబాటు చేస్తారా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి సమాచారం లేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మార్కెట్లో విడుదలైనప్పుడు ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రోడక్ట్ లైనప్ లోనే అతి తక్కువ ఖరీదైన మోటార్‌సైకిల్‌ గా మాత్రమే కాకుండా ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా అత్యంత తేలికైన మరియు అత్యంత చురుకైనదిగా కూడా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇదివరకు ఇంటర్నెట్ లో లీకైన హంటర్ 350 యొక్క స్పై చిత్రాలు ఈ మోటార్‌సైకిల్ యొక్క అనేక డిజైన్ ఫీచర్లను వెల్లడి చేశాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

ఈ స్పై చిత్రాలను విశ్లేషిసిస్తే, రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దాని మినిమలిస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌తో స్క్రాంబ్లర్-టైప్ బాడీ స్టైలింగ్‌ ను కలిగి ఉందని తెలుస్తోంది. ఇది కూడా ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఆకర్షణీయమైన రెట్రో థీమ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో వృత్తాకారపు హెడ్‌ల్యాంప్‌లు, వృత్తాకారపు టర్న్ ఇండికేటర్లు, వృత్తాకారపు రియర్ వ్యూ మిర్రర్లు, టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, పొడవైన సింగిల్-పీస్ సీటు మరియు కొద్దిగా పెరిగిన వెనుక భాగం వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (RE Hunter 350) స్పెసిఫికేషన్లు లీక్.. ఇది అత్యంత చవకైన ఆర్ఈ బైక్?

అంతే కాకుండా, ఈ చిత్రాలు తక్కువ సీటింగ్ పొజిషన్‌ను కూడా సూచిస్తాయి. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విస్తృతమైన హ్యాండిల్ బార్ మరియు కొద్దిగా మిడ్-సెట్ ఫుట్ పెగ్‌లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2022, 9:32 [IST]
English summary
Royal enfield hunter 350 specifications leaked ahead of the official launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+