రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్ వచ్చేస్తోంది.. దాని పేరే హంటర్ 350: లాంచ్ ఎప్పుడో తెలుసా
'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield) ఈ పేరు వింటేనే కుర్రకారు ఉర్రూతలూగుతారు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కంపెనీ ఇప్పుడు త్వరలో మరో కొత్త బైక్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇంతకీ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ ఏది, ఇది దాని విభాగంలో దేనికి ప్రత్యర్థిగా ఉంటుంది అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వెలువడిన సమాచారం ప్రకారం, హంటర్ 350 (Hunter 350) ను భారతీయ మార్కెట్ కోసం సిద్ధం చేస్తోంది. ఈ కొత్త బైక్ 2022 ఆగష్టు 07 న మార్కెట్లోకి అధికారికంగా విడుద కానుంది. ఈ బైక్ ఇంకా విడుదల కాకముందే దీని గురించి కొంత సమాచారం వెల్లడయ్యింది. దీనికి సంబంధించిన ఒక కొత్త టీజర్ కూడా ఇప్పుడు వెలువడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కి సంబంధించి వెలువడిన ఈ కొత్త టీజర్ ప్రకారం, కంపెనీ ఈ కొత్త బైకును వచ్చే నెల 07 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ మార్కెట్లో అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ కానుంది. అంతే కాకుండా ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కింద ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత దాని విభాగంలో హోండా సీబీ350 ఆర్ఎస్ మరియు యేజ్ది స్క్రాంబ్లర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఎక్కువమంది యువ కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్శించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధరకే విక్రయించబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

హంటర్ 350 అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క J-ప్లాట్‌ఫాం ఇంజన్‌ను కలిగి ఉన్న మూడవ బైక్. కావున ఇది 349 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 19.9 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఈ రకమైన ఇంజిన్ కంపెనీ యొక్క క్లాసిక్ మరియు మీటియోర్ వంటి బైకులతో అందుబాటులో ఉంది.

కంపెనీ విడుదల చేయనున్న హంటర్ 350 బైక్ యొక్క డిజైన్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కావున ఈ బైక్ దాని మునుపటి ఏ బైక్ యొక్క డిజైన్ పొందుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇది టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వ్యూ మిర్రర్, సింగిల్ పీస్ సీట్ మరియు చిన్న ఎగ్జాస్ట్ వంటి వాటిని పొందుతుంది.

కొత్త హంటర్ 350 బైక్ విడుదలైన తరువాత రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌ను ఇప్పటికే చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇక ఈ కొత్త బైక్ భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల కావడానికి మరెన్నో రోజులు లేవు.

హంటర్ 350 అనేది ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేస్తున్న రెండవ బైక్. ఇప్పటికే కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో మార్చి నెలలో తన హిమాలయన్ స్క్రామ్ 411 విడుదల చేసింది. ఇప్పుడు మరో బైక్ విడుదలకు సంసిద్దమయిపోయింది.

నిజానికి భారతీయ మార్కెట్లో 350 సిసి విభాగంలో రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద కంపెనీ. ఈ విభాగంలో జావా, యెజ్డీ వంటివి కూడా ఉన్నాయి, కావున ఎక్కువ సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తన ప్రత్యర్థులకు ధీటుగా నిలబడి కాస్తరమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో కంపెనీ తప్పకుండా ఈ కొత్త బైకు విడుదలతో మరింత వైభవం పొందనుంది.


Click it and Unblock the Notifications








