రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) గతేడాది మధ్య భాగంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త క్రూయిజర్ బైక్ మీటియోర్ 350 (Meteor 350) లో కంపెనీ ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 2022 మోడల్ లైనప్‌లో భాగంగా, ఈ మార్పులు చేసింది. ప్రస్తుతం, మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350) ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్‌నోవా అనే మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ ధరలు ఇలా ఉన్నాయి:

* రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఫైర్‌బాల్ - రూ. 2.05 లక్షలు

* రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 స్టెల్లార్ - రూ. 2.11 లక్షలు

* రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 సూపర్‌నోవా - రూ. 2.22 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 కోసం కొత్తగా ప్రారంభించబడిన కలర్ ఆప్షన్లలో ఫైర్‌బాల్ బ్లూ, ఫైర్‌బాల్ మ్యాట్ గ్రీన్ మరియు సూపర్‌నోవా రెడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇదివరకటి ఫైర్‌బాల్ ఎల్లో మరియు ఫైర్‌బాల్ రెడ్ కలర్ ఆప్షన్ల మాదిరిగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 లోని కొత్త మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్, కూడా బ్లాక్డ్-అవుట్ థీమ్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇందులో చక్రాలపై ఆకుపచ్చ స్ట్రిప్ కూడా ఉంటుంది, ఇది మోటార్‌సైకిల్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

ఇక ఈ మోడల్ కోసం కొత్తగా ప్రారంభించబడిన బ్లూ కలర్ ఆప్షన్ కూడా బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో బ్యాడ్జింగ్ మరియు చక్రాలపై ఉన్న స్ట్రిప్ పసుపు రంగులో ఉంటుంది. ఈ రెండు కలర్ ఆప్షన్లతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్‌నోవా రెడ్‌ కలర్ ఆప్షన్ ను కూడా విడుదల చేసింది. కొత్త 2022 మోడల్ మీటియోర్ 350లో ఈ చిన్నపాటి మార్పు మినహా కంపెనీ ఇందులో వేరే ఇతర మార్పులు చేయలేదు. మెకానికల్ మరియు ఫీచర్ల పరంగా ఇది మునుపటిలానే ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో విక్రయించిన థండర్‌బర్డ్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ సరికొత్త మీటియోర్ 350 మోడల్‌ను ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్‌సైకిల్‌లో తొలిసారిగా సరికొత్త 349సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

మీటియోర్ 350 ను తొలిసారిగా చూసినప్పుడు, ఇది ఒక సాధారణ క్రూయిజర్‌ మోటార్‌సైకిల్‌ను గుర్తుకు తెస్తుంది. కంపెనీ దీనికి క్రూయిజర్ లుక్ ఇవ్వడానికి అవసరమైన అన్ని డిజైన్ అంశాలను పరిగణలోకి తీసుకుంది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే పెద్ద 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, కాంటౌర్డ్ బాడీ ప్యానెల్లు, గుండ్రటి హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్ మరియు టర్న్ ఇండికేటర్స్, కొన్ని వేరియంట్లలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, 13.6 ఇంచ్ అడ్జస్టబల్ విండ్‌స్క్రీన్ మరియు మోటారుసైకిల్ చుట్టూ ఎక్కువ క్రోమ్ ఎలిమెంట్స్‌తో ఇది చాలా ప్రీమియంగా కనిపించే క్రూయిజర్ బైక్‌లా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

అంతేకాకుండా, ఇందులో కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హాజార్డ్ లైట్స్ స్విచ్, స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి వీలుగా యుఎస్‌బి స్లాట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే, ఇందులో ప్రధానమైన ఫీచర్ దాని ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క సెకండరీ-పాడ్‌గా టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే యూనిట్ రూపంలో ఉంటుంది. రైడర్లు తమ స్మార్ట్ ఫోన్‌ను బైక్‌కి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడం ద్వారా టిప్పర్ నావిగేషన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో బైక్‌పై టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా చూడవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మీటియోర్ 350 మోటారుసైకిల్‌ను కొత్త డబుల్-క్రాడిల్ ఛాస్సిస్‌పై నిర్మించింది. ఈ బైక్‌లో గుండ్రటి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌, పొడవాటి సైలెన్సర్, ఇగ్నిషన్ మరియు హెడ్‌ల్యాంప్ ఆపరేషన్ల కోసం డయల్స్‌తో కూడిన సరికొత్త స్విచ్ గేర్ యూనిట్, విశాలమైన హ్యాండిల్‌బార్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్స్, బాగా కుషన్ చేయబడిన సీట్లు మరియు పిలియన్ రైడర్ కోసం బ్యాక్‌రెస్ట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఈ విభాగంలో హోండా హైనెస్ సిబి350 వంటి మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350.. ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం, ధరలు

మీటియోర్ 350లో కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోవిందరాజన్ మాట్లాడుతూ, మీటియోర్ 350 విడుదల తమ ప్రయాణంలో చాలా ముఖ్యమైన మైలురాయిగా గుర్తించబడినదని, ఇందులో ఉపయోగించిన సరికొత్త, గ్రౌండ్-అప్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్ తమ బ్రాండ్‌కు ఒక ముఖ్యమైన పరివర్తన అని, గత రెండు సంవత్సరాలుగా, మీటియోర్ 350 భారతదేశంలోని ఎంట్రీ-లెవల్ క్రూయిజర్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసిందని అన్నారు. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లలో కూడా అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకుంటుందోని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, మీటియోర్ 350లో మరిన్ని కొత్త ఉత్తేజకరమైన రంగుల జోడించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్‌లకు మరిన్ని అదనపు కొనుగోలు ఆప్షన్లను అందిస్తున్నామని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, April 21, 2022, 9:26 [IST]
English summary
Royal enfield introduces 3 new colour options for meteor 350 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+