కొత్త సంవత్సరంలో Royal Enfield అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) 2022 జనవరి అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ 2022 జనవరి నెలలో మొత్తం 58,838 యూనిట్ల బైకులను విక్రయిచగలిగింది. ఇది మునుపటి అమ్మకాలకంటే దాదాపు 15 శాతం తగ్గుదలను నమోదు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 2021 జనవరి నెలలో మొత్తం కంపెనీ 68,887 యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు మరియు విదేశీ అమ్మకాలు ఉన్నాయి. 2022 జనవరిలో దేశీయ మార్కెట్లో 49,726 యూనిట్లను విక్రయించగలిగింది. గత ఏడాది ఇదే నెలలో మొత్తం 64,372 యూనిట్లు విక్రయించగలిగింది. దీని ప్రకారం అమ్మకాలు మునుపటికంటే కూడా దాదాపు 23 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ 2022 జనవరి నెలలో 9,112 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది, గత ఏడాది ఇదే కాలంలో అంటే 2021 జనవరిలో కంపెనీ 4,515 యూనిట్లను ఎగుమతి చేసింది. దీని ప్రకారం కంపెనీ యొక్క ఎగుమతులు మునుపటికంటే కూడా ఇప్పుడు ఏకంగా 102 పెరుగుదలను నమోదు చేసింది.

కంపెనీ తన క్లాసిక్ 350 తో సహా పలు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో అంతర్జాతీయ మార్కెట్ కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఫిలిప్పీన్స్, కొరియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి అనేక దేశాల్లో అందుబాటులో ఉంది.

ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవలే దాని తయారీ కేంద్రంలో కొత్త క్లాసిక్ 350 యొక్క 1,00,000 యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసింది. కొత్త క్లాసిక్ 350కి దేశీయ మార్కెట్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే కంపెనీ యొక్క ఈ బైక్ యొక్క అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆగ్నేయాసియా ప్రాంతంలో పెరుగుతున్న ద్విచక్ర వాహన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని థాయ్‌లాండ్‌లో తన స్థానిక అసెంబ్లీ యూనిట్ మరియు CKD (పూర్తిగా నాక్డ్ డౌన్) సౌకర్యాన్ని నిర్వహించడం ప్రారంభించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్థానిక అసెంబ్లీ యూనిట్ స్థానిక డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ఇండోనేషియా, వియత్నాం మరియు ఆగ్నేయాసియా ప్రాంతంలోని ఇతర దేశాలకు పంపిణీ కేంద్రంగా కూడా పనిచేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిసారిగా 2015 లో థాయ్‌లాండ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తాము గొప్ప విజయాన్ని సాధించామని కూడా కంపెనీ ఇదివరకే పేర్కొంది. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు కొరియా వంటి మార్కెట్‌లలో ప్రీమియం, మధ్యతరహా మోటార్‌సైకిల్ విభాగంలో ఇప్పుడు టాప్ 5 తయారీదారులలో ఇది ఒకటని ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆగ్నేయాసియా దేశాల్లో రిటైల్ నెట్‌వర్క్, సర్వీస్ మరియు డీలర్‌షిప్‌లను విస్తరించాలని యోచిస్తూ దీని వైపుగా అడుగులు వేస్తోంది. అంతే కాకుండా కంపెనీ రాబోయే రెండు సంవత్సరాల్లో మరో నాలుగు కొత్త బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇప్పటికే కొత్త క్లాసిక్ 350 మరియు మీటియార్ 350 లను విడుదల చేయగా, మిగిలిన రెండు బైక్‌లను రాబోయే రోజుల్లో విడుదల చేయనున్నారు. గత ఏడాది మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ఎగ్జిబిషన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ SG 650 ని వెల్లడించింది.

కంపెనీ కొత్త SG 650 బైక్ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది కాంటినెంటల్ GT 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌లలో ఉన్న 650 సిసి ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడుతుందని భావిస్తున్నారు. కంపెనీ ప్రస్తుతం కొత్త 650 సిసి క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేయబడుతోంది. ఇది SG 650 మోడల్‌గా ఉండే అవకాశం ఉంది. కంపెనీ కొత్త బైకులను విడుదల చేస్తేభారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








