క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

ప్రముఖ దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంటోంది. ప్రత్యేకించి ఈ బ్రాండ్ విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ క్లాసిక్ 300 మోటార్‌సైకిల్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు సాగిస్తోంది. కంపెనీ విడుదల చేసివ వివరాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన మే 2022 నెలలో మొత్తం 63,643 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

కాగా, ఏప్రిల్ 2021 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలె 27,294 మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కరోనా మహమ్మారి ప్రభావంతో కంపెనీ అమ్మకాలు తగ్గముఖం పట్టాయి. ఈ సమయంతో పోలిస్తే, గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలు 133 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో కంపెనీ విదేశీ మార్కెట్లలో అత్యధికంగా 10,118 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు 40 శాతానికి పైగా వృద్ధి చెందాయి.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో తన స్థిరమైన పనితీరును కొనసాగించింది మరియు ఏప్రిల్ 2022 నెల కంటే మెరుగైన అమ్మకాలను కనబరించింది. గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విపణిలో 53,525 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఏప్రిల్ 2022 అమ్మకాలతో పోల్చితే, మే 2022లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలు 2.39 శాతం పెరిగాయి. గత ఏప్రిల్‌లో కంపెనీ 62,155 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, ఎగుమతులు మాత్రమే పెరిగాయి.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

అంతర్జాతీయ మార్కెట్‌లలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మే 2022 నెలలో నెలవారీగా దాదాపు 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ 2022లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,303 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయగా, మే 2022 నెలలో 10,118 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది. బుల్లెట్ 350, క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 వంటి వాటితో సబ్ 350 సీసీ మోటార్‌సైకిళ్లు కంపెనీ అమ్మకాలకు పెద్ద అండగా నిలిచాయి. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మరియు హిమాలయన్ అడ్వెంచర్ బైక్ కూడా ఆకట్టుకునే అమ్మకాలను నమోదు చేశాయి.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృ సంస్థ అయిన ఐషర్ మోటార్స్ లిమిటెడ్, మే 13, 2022న రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బి గోవింద్ రాజన్‌ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నియామకంతో, గోవింద్ రాజన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థకు సీఈఓ గా మరియు బోర్డ్ ఆఫ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క మాతృ సంస్థ అయిన ఐషర్ మోటార్స్ లిమిటెడ్ కు హోల్‌టైమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

రూ.2.03 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411)

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) గడచిన మార్చ్ నెలలో తమ సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ "రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411" (Royal Enfield Scram 411) ను మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ధరలు రూ.2.03 లక్షల నుండి రూ.2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. కంపెనీ స్క్రాంబ్లర్ మోడల్ ను తమ పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ ఆధారంగా చేసుకొని తయారు చేసింది.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

స్క్రామ్ 411 చూడటానికి ఓ చిన్న సైజు హిమాలయన్ బైక్ మాదిరిగా ఉంటుంది. ఉంటుంది. హిమాలయన్ బైక్ ను పూర్తిగా అడ్వెంచర్ రైడ్స్ కోసం డిజైన్ చేయగా, స్క్రామ్ 411 ను ఇటు చిన్నపాటి అడ్వెంచర్ రైడ్స్ కి మరియు అటు సాధారణ సిటీ ఉపయోగానికి పనికి వచ్చేలా డిజైన్ చేశారు. ఈ రెండు మోడళ్లను వేరు చేసేందుకు వీటి డిజైన్ మరియు ఫీచర్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్, ఫోర్క్ గైటర్‌లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు ఫ్యూయల్ ట్యాంక్‌ వంటి డిజైన్ లు కూడా హిమాలయన్ మోడల్ ను తలపిస్తాయి. అయితే, ఇందులోని హెడ్‌ల్యాంప్ యూనిట్ హిమాలయన్‌లోని ఫిక్స్‌డ్ యూనిట్‌లా కాకుండా హ్యాండిల్‌బార్‌తో పాటుగా కదిలే ఫ్లెక్సిబల్ యూనిట్‌గా ఉంటుంది. ఇక ఇందులోని ఇతర మార్పులను గమనిస్తే, ముందు వైపున చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్‌లు మరియు వెనుకవైపు సింపుల్-పీస్ గ్రాబ్ రైల్ ఉన్నాయి.

క్లాసిక్ 350, స్క్రామ్ 411 బైక్‌లకు భారీ డిమాండ్.. మే 2022 నెలలో 133 శాతం పెరిగిన సేల్స్..

అంతేకాకుండా, ఇందులో ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 21 ఇంచ్ ఫ్రంట్ వీల్‌కు బదులుగా రోడ్-బయాస్డ్ మరియు ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన 19 ఇంచ్ స్పోక్డ్ ఫ్రంట్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్డ్ వీల్‌ ఉంటుంది. ఈ రెండు చక్రాలపై ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఉపయోగపడేలా సియట్ గ్రిప్ డ్యూయల్ పర్పస్ టైర్‌లు ఉంటాయి. స్క్రామ్ 411 బైక్‌లో ట్విన్-పాడ్ అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇందులో ఒకటి ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం డిజైన్ చేసిన ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కావాలనుకుంటే కస్టమర్లు దీనిని అడిషనల్ యాక్ససరీగా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే, ఈ రెండు మోడళ్లలో ఇంజన్ ఒకేలా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 2, 2022, 15:00 [IST]
English summary
Royal enfield may 2022 sales increased 133 percent details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+