రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

ఈ రోజు మార్కెట్లో యువకుల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే బైక్ బ్రాండ్స్ లో ఒకటి 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (Royal Enfield). రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే మంచి ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే తన మీటియోర్ 350 బైకుని కూడా గతంలో దేశీయ విఫణిలో విడుదల చేసింది, కాగా.. ఇప్పుడు కంపెనీ 'మీటియోర్ 650' బైక్ ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2022 బైక్ షోలో ఇప్పటికే చాలామంది బైక్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త 'సూపర్ మీటియోర్ 650' ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ క్లాసిక్ మరియు గ్రాండ్ టూరర్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. అయితే కంపెనీ ఈ కొత్త బైకుని త్వరలోనే దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ మరియు 16 ఇంచెస్ రియర్ వీల్ పొందుతుంది. సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ తో డ్యూయల్-ఛానల్ ABS పొందుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 టియర్‌డ్రాప్ ఆకారంలో వున్న 15.7 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఇందులో సౌకర్యవంతమైన రైడర్ సీటు మరియు పిలియన్ కోసం స్పీట్ సీటు వంటివి ఉన్నాయి. కాగా ఇందులో ఇండికేటర్స్ అనేవి నెంబర్ ప్లేట్ దగ్గర అమర్చబడి ఉన్నాయి. అదే విధంగా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది సైడ్‌లో కనిపించే ట్రిప్పర్ నావిగేషన్ డిస్‌ప్లేతో ఉన్న రౌండ్ యూనిట్. అయితే ఇది బైకులో స్టాండర్డ్ గా అందించబడుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం 'ఇంజిన్'. ఇందులో ఇంటర్‌సెప్టర్ మరియు కాంటినెంటల్ GT 650 లో ఉన్నటువంటి ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 648 సిసి ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 47 హెచ్‌పి పవర్ మరియు 5650 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మీటియోర్ 650 మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త సూపర్ మీటియోర్ 650 చాలా తక్కువ సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. ఈ కొత్త బైకు యొక్క సీటు ఎత్తు 740 మిమీ వరకు ఉంటుంది. సీటు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పొట్టిగా ఉన్న రైడర్లు కూడా ఈ బైకును సులభంగా రైడింగ్ చేయవచ్చు. కావున రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ చేయాలనుకునే పొట్టి రైడర్లకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 యొక్క టాప్ వేరియంట్ పిలియన్ బ్యాక్‌రెస్ట్ మరియు పెద్ద విండ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 కొలతల విషయానికి వస్తే, ఇది 2,260 మిమీ పొడవు, 890 మిమీ వెడల్పు, 1,155 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క వీల్‌బేస్ 1,500 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క బరువు 241 కేజీల వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 చాలా క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌ను కలిగి ఉంది. అందులో చుట్టూ LED లైటింగ్స్ పొందుతుంది. కావున ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, తక్కువ హైట్ కలిగిన సీటు మొదలైనవి ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన కొత్త సూపర్ మీటియోర్ 650 బైకుని ఈ నెల చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ బైక్ యొక్క ధరల గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 650 సిసి బైకులకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇది రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త డుగుడుగు బండి.. సూపర్ మీటియోర్ 650: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో 650 సిసి బైకులకు కూడా మంది డిమాండ్ ఉంది. కావున దేశీయ మార్కెట్లో విడుదలకావడానికి సిద్దమవుతున్న సూపర్ మీటియోర్ 650 కూడా తప్పకుండా మంది ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. సూపర్ మీటియోర్ 650 కి మార్కెట్లో ప్రస్తుతానికి ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు, కానీ బెనెల్లీ 502 బైకు మాత్రం ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. సూపర్ మీటియోర్ 650 బైక్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 8, 2022, 16:54 [IST]
English summary
Royal enfield new super meteor 650 revealed specs features images and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+