హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ లైనప్‌లో కెల్లా అత్యంత తేలికైన మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350) రూ.1.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. యువతను లక్ష్యంగా చేసుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన ఈ స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఇప్పుడు అఫీషియల్ యాక్ససరీ ప్యాకేజ్‌లు మరియు వ్యక్తిగత ఉపకరణాలను కూడా విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను కస్టమైజ్ చేసుకోవడానికి చాలా మంది ఔత్సాహికులు థర్డ్ పార్టీ కస్టమైజేషన్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. ఇలా చేసే ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ వలన సదరు వాహనం యొక్క వారంటీ కూడా రద్దు అవుతుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ వినియోగదారుల కోసం స్వయంగా తయారు చేసిన ప్రత్యేకమైన యాక్ససరీలను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది.

హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

హంటర్ 350ని మరింత మెరుగ్గా మార్చుకోవడానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త యాక్ససరీలను వెల్లడించింది. ఇందులో రెండు యాక్సెసరీస్ కిట్‌లు మరియు ప్రత్యేక ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో రైడర్లు తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఎక్స్‌టీరియర్ మరియు ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 యొక్క యాక్సెసరీస్ కిట్ లలో అర్బన్ ఇన్‌స్పిరేషన్ థీమ్ మరియు సబర్బన్ ఇన్‌స్పిరేషన్ థీమ్ అనే రెండు ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్ ధర రూ. 18,160 గా ఉంది. ఈ కిట్‌లలో హంటర్ 350 రూపాన్ని మెరుగుపరిచే అనేక ఉపకరణాలు జోడించబడ్డాయి. అర్బన్ కిట్ లో బార్ ఎండ్ మిర్రర్, బాష్ ప్లేట్, చిన్న ఫ్లైస్క్రీన్, బాగా కుష్ చేయబడిన కంఫర్టబల్ సీట్, ఎల్ఈడి ఇండికేటర్, టెయిల్ గేట్, ఇంజన్ క్రాష్ గార్డ్, టెయిల్ టైడీ వంటి లభిస్తాయి.

హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

సబ్ అర్బన్ కిట్‌లో భాగంగా టూరింగ్ మిర్రర్స్, సిల్వర్ సంప్ గార్డ్, పెద్ద ఇంజన్ గార్డ్, కస్టమ్ బ్లాక్ సీట్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ మరియు బ్లాక్ కమ్యూటర్ పన్నీర్ లు లభిస్తాయి. హంటర్ 350 పై లాంగ్ రైడ్ ‌లను చేసే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కిట్‌ను రూపొందించింది. ఇవే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కోసం రైడర్లు తమకు నచ్చిన యాక్ససరీలను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ, మీరు పూర్తి కిట్‌ను కొనుగోలు చేయకూడదనుకుంటే, కంపెనీ అనేక భాగాలను ప్రత్యేక ఉపకరణాలుగా అందిస్తుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు
  • సిల్వర్ సంప్ గార్డ్ - రూ. 3250
  • బ్లాక్ కమ్యూటర్ పన్నీర్ రైల్ - రూ. 2200
  • బ్లాక్/సిల్వర్ ఆయిల్ ఫిల్లర్ క్యాప్ - రూ. 1050
  • బ్లాక్ టూరింగ్ మిర్రర్ - రూ. 6850
  • బ్లాక్ కమ్యూటర్ పన్నీర్ - రూ. 2350
  • బ్లాక్ బార్ ఎండ్ మిర్రర్ - రూ. 6450
  • బ్లాక్ ఎండ్ మిర్రర్ మౌంట్ - రూ. 650
  • బ్లాక్ లార్జ్ ఇంజన్ గార్డ్స్ - రూ. 3300
  • బ్లాక్ ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్ ప్యాడ్ - రూ. 1050
  • బ్లాక్ కాంపాక్ట్ ఇంజన్ గార్డ్స్ - రూ. 3000
  • బ్లాక్ ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్ మౌంట్‌లు - రూ. 1750
  • హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు
    • బ్లాక్ ఎల్ఈడి ఇండికేటర్ - రూ. 4750
    • సిల్వర్ ఎల్ఈడి ఇండికేటర్ - రూ. 4750
    • టింటెడ్ ఫ్లైస్క్రీన్ - రూ 2350
    • బ్లాక్ వాటర్ రెసిస్టెంట్ బైక్ కవర్ - రూ. 1100
    • నేవీ వాటర్ రెసిస్టెంట్ బైక్ కవర్ - రూ. 1100
    • బ్లాక్ కమ్యూటర్ వాటర్‌ప్రూఫ్ ఇన్నర్ బ్యాగ్ - రూ. 1150
    • బ్లాక్ కస్టమ్ సీట్ - రూ. 4500
    • బ్లాక్ సిగ్నేచర్ బెంచ్ సీట్ - రూ. 4500
    • హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

      ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిలో పవర్‌ఫుల్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. గంటకు 114 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీసే ఈ పవర్‌ఫుల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, లీటరుకు 36.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది.

      హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

      హంటర్ 350 ని ప్రత్యేకించి అర్బన్ కమ్యూటింగ్ కోసం అనువుగా ఉండేలా కంపాక్ట్ సైజులో డిజైన్ చేయబడింది. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు మరియు 1,055 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. దీని సీటు ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. ఈ కొలతలతో ఇది ఎలాంటి రైడర్ కైనా మంచి రైడింగ్ పొజిషన్ ను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా, హంటర్ 350 కేవలం 181 కిలోల బరువుతో మీటియోర్ 350 కంటే 10 కిలోలు మరియు క్లాసిక్ 350 కంటే 14 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. కాబట్టి, దీని హ్యాండ్లింగ్ కూడా చాలా సులువుగా ఉంటుంది.

      హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

      రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో మరియు మెట్రో అనే రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటి ధరలు వరుసగా రూ. 1.49 లక్షలు మరియు రూ. 1.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర పాపులర్ 350సీసీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే కొత్త హంటర్ 350 ని కూడా అదే J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేశారు. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్, సెమీ-డిజిటల్ స్పీడోమీటర్, ఆప్షనల్ ట్రిప్పర్ డిస్‌ప్లే యూనిట్, టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌ వంటి డిజైన్ హైలైట్స్ ఉన్నాయి.

      హంటర్ 350 బైక్ కోసం యాక్ససరీస్‌ను వెల్లడించిన రాయల్ ఎన్‌ఫీల్డ్; ధరలు

      ఇక మెకానికల్ ఫీచర్ల విషయానికి వస్తే, హంటర్ 350 ముందు వైపున 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు 6 వే అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ ట్విన్ షాక్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 300 మిమీ ఫిక్స్‌డ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. హంటర్ 350 మెట్రో వేరియంట్ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను కలిగి ఉండగా, రెట్రో వేరియంట్ సింగిల్-ఛానల్ ఏబిఎస్‌తో వస్తుంది. ఇందులో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వాటిపై 110/70-17 54P (ఫ్రంట్ టైర్) మరియు 140/70 - 17 - 66P (రియర్ టైర్) ట్యూబ్‌లెస్ టైర్‌లు అమర్చబడి ఉంటాయి.

Most Read Articles

English summary
Royal enfield reveales hunter 350 accessories price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X