నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

రెట్రో-మోడ్రన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) భారత ప్రీమియం టూవీలర్ మార్కెట్లో బలమైన పట్టును కలిగి ఉంది. గత కొంతకాలంగా దేశంలో ఈ బుల్లెట్ బ్రాండ్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మరియు క్లాసిక్ డిజైన్‌ల మేళవింపుతో, రాయల్ ఎన్‌ఫీల్డ్ విభిన్న విభాగలలో ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటికి అదనంగా, కంపెనీ ఇటీవలే స్క్రామ్ 411 అనే కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది మరియు త్వరలోనే హంటర్ 350 అనే మరో కొత్త మోటార్‌సైకిల్‌ను కూడా విడుదల చేయబోతోంది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లకు పెరిగిన డిమాండ్ కారణంగా, గత నెలలో అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 62,155 మోటార్ సైకిళ్లను విక్రయించింది. ఈ విక్రయాలు గతేడాది ఏప్రిల్‌ (2021)తో పోలిస్తే 17 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గడచిన ఏప్రిల్ 2021 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 53,298 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్ విక్రయాలు మరియు విదేశాలకు ఎగుమతి చేయబడిన యూనిట్లు రెండూ కలిపి ఉన్నాయి.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

కేవలం దేశీయ మార్కెట్లో విక్రయించిన టూవీలర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన ఏప్రిల్ 2022 నెలలో దేశీయంగా 53,852 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఏప్రిల్ 2021లో దేశీయ అమ్మకాలు 48,789 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఈ సమయంలో కంపెనీ చేసిన ఎగుమతుల విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 8,303 యూనిట్లను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఇవి 4,509 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ అమ్మకాలలో 10 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, విదేశీ ఎగుమతులలో 84 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కి సంబంధించిన ఇతర విశేషాలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే విడుదల చేసిన స్క్రామ్ 411 తర్వాత, కంపెనీ మరో కొత్త బైక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ కంపెనీ నుండి రాబోయే తదుపరి బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) కావచ్చని తెలుస్తోంది. ఇది మీటియోర్ 350 యొక్క J ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందని మరియు కంపెనీ దీనిని ఈ ఏడాది మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని నెలలుగా హంటర్ 350 బైక్ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. గతంలో లీకైన చిత్రాలను బట్టి చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, దాదాపు మీటియోర్ 350 డిజైన్ ను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మీటియోర్ మాదిరిగానే టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి చాలా భిన్నమైన బైక్‌గా ఉండబోతోంది, కంపెనీ దీనిని రోడ్‌స్టర్ బైక్‌గా పరిచయం చేసే అవకాశం ఉంది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ కట్..

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లలో (మీటియోర్ 350 మరియు హిమాలయన్‌) వంటి మోడళ్లలో 'ట్రిప్పర్ నావిగేషన్' ఫీచర్‌ను తీసివేసినట్లు సమాచారం. దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, ఈ ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ కూడా సెమీకండక్టర్ చిప్స్ కొరతతో పోరాడుతోంది. ఈ నావిగేషన్ సిస్టమ్ పరికరం తయారీలో ఈ చిప్స్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. అలాంటిది ఇప్పుడు వాటి లభ్యత తగ్గిపోవడంతో, కంపెనీ ఈ ఫీచర్‌ను ఇకపై ఆప్షనల్‌గా మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

ఇంతకుముందు మీటియోర్ 350 మరియు హిమాలయన్‌ మోటార్‌సైకిళ్లలో ఈ ట్రిప్పర్ నావిగేషన్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించేవారు. అయితే, ఇప్పుడు అవి చిప్స్ కొరత కారణంగా ఆప్షనల్ ఫీచర్‌గా మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు, ఎవరైనా తాము కొనుగోలు చేయబోయే బైక్‌లో ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ని పొందాలనుకుంటే, కస్టమర్‌లు దానిని ప్రత్యేక ఫీచర్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫీచర్‌ను తొలగించిన కారణంగా, కంపెనీ రెండు మోడళ్ల ధరలను కూడా సుమారు రూ.5,000 తగ్గించింది.

నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. ఏప్రిల్ 2022 లోనూ కొనసాగిన బుల్లెట్ బైక్స్ జోరు..

అలాగే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే తమ క్లాసిక్ 350 మరియు స్క్రామ్ 411 యొక్క కొత్త మోడల్‌లో కూడా ట్రిప్పర్ నావిగేషన్‌ను ఆప్షనల్ ఫీచర్‌గా అందిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ అన్ని మోడళ్ల బుకింగ్ ధరను కూడా పెంచింది. ఇప్పుడు వినియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కొత్త బైక్ కోసం సుమారు రూ. 20,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ బుకింగ్ మొత్తం రూ. 10,000 గా ఉండేది. అని మీకు తెలియజేద్దాం. ఈ మార్పు మే 1, 2022 నుండి అన్ని మోడల్‌లకు వర్తిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2022, 10:09 [IST]
English summary
Royal enfield sold 62155 motorcycles in april 2022 registered 17 percent growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+