బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విక్రయిస్తున్న ప్రీమియం క్లాసిక్ మోటార్‌సైకిళ్లకు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో నుండి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, ఈ బుల్లెట్ బండి విక్రయాలు బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి 2022 నెలలో మొత్తం 67,677 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో (మార్చి 2021లో) కంపెనీ విక్రయించిన 66,058 యూనిట్లతో పోలిస్తే ఇవి 2.39 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

అయితే, మార్చి 2022 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో స్వల్పంగా 3 శాతం క్షీణతను నమోదు చేశాయి. మార్చి 2021 లో దేశీయ విక్రయాలు 60,173 యూనిట్లుగా ఉంటే, మార్చి 2022 లో ఇవి 58,477 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 50 శాతానికి పైగా పెరిగాయి. మార్చి 2022లో కంపెనీ మొత్తం 9,200 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇవి గడచిన మార్చి 2021లో ఎగుమతి చేసిన 5,885 యూనిట్ల కంటే 56 శాతం అధికంగా ఉన్నాయి.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

భారతదేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన మార్కెట్ పరిస్థితుల నుండి వేగంగా కోలుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 2022 కంటే మార్చి 2022లో అమ్మకాల రేటు మెరుగ్గా ఉంది. మార్చి 31తో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 6,02,268 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే, ఇది 2020-21లో కంపెనీ విక్రయించిన మొత్తం 6,12,350 యూనిట్ల కంటే 2 శాతం తక్కువగా ఉంది.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

గడచిన సంవత్సరంలో ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, అదే సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం రెట్టింపు అయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపిన వివరాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ విక్రయాలను గమనిస్తే, ఇవి 5,21,236 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2020-21) లో ఇవి 5,73,728 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ డొమెస్టిక్ సేల్స్ 9 శాతం క్షీణించాయి.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

కాగా, ఇదే సమయంలో (2021-22 ఆర్థిక సంవత్సరంలో) రాయల్ ఎన్‌ఫీల్డ్ విదేశీ ఎగుమతులు 81,032 యూనిట్లుగా ఉన్నాయి, ఇవి 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించబడిన 38,622 యూనిట్లతో పోలిస్తే 110 శాతం ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్తగా ప్రవేశపెడుతున్న ద్విచక్ర వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఫలితంగా కంపెనీ అమ్మకాలు కూడా స్థిరంగా సాగుతున్నాయి. రానున్న నెలల్లో ఇవి మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

భారత మార్కెట్లో Royal Enfield Scram 411 స్క్రాంబ్లర్ విడుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో తమ సరికొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ "రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411" (Royal Enfield Scram 411) ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ధరలు రూ.2.03 లక్షల నుండి రూ.2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశం వెలుపల ఇతర మార్కెట్లలో కూడా ఈ స్క్రాంబ్లర్ బైక్‌ని విడుదల చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Himalayan) ను ఆధారంగా చేసుకొని కొత్త స్క్రామ్ 411 (Scram 411) ని తయారు చేశారు.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య తేడాలను చూపేందుకు కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411లో కొన్ని మార్పులు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోల్చితే స్క్రామ్ 411 మరింత రోడ్-ఫోకస్డ్ వెర్షన్ కావడంతో, కంపెనీ ఇందులో ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 21 ఇంచ్ ఫ్రంట్ వీల్‌కు బదులుగా రోడ్-బయాస్డ్ మరియు ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన 19 ఇంచ్ స్పోక్డ్ ఫ్రంట్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ స్పోక్డ్ వీల్‌ను జోడించింది. ఈ రెండు చక్రాలపై ఇటు ఆఫ్-రోడ్ మరియు అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఉపయోగపడేలా సియట్ గ్రిప్ డ్యూయల్ పర్పస్ టైర్‌లను అమర్చారు.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంటుంది. అయితే, ఇది హిమాలయన్‌లోని ఫిక్స్‌డ్ యూనిట్‌లా కాకుండా హ్యాండిల్‌బార్‌తో పాటుగా కదిలే ఫ్లెక్సిబల్ యూనిట్‌లా ఉంటుంది. అలాగే, ఇందులో ముందు వైపున చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్‌లు (ట్యాంక్‌కు దిగువన అమర్చిన ప్యానెల్స్) మరియు వెనుకవైపు సింపుల్-పీస్ గ్రాబ్ రైల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. స్క్రామ్ 411లో తగ్గిన బాడీ పార్ట్స్ కారణంగా, దాని బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీని మొత్తం బరువు కేవలం 185 కేజీలు మాత్రమే ఉంటుంది (హిమాలయన్ బరువు 190 కేజీలు).

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) వస్తోంది..

ఇదిలా ఉంటే, స్క్రామ్ 411 తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సమాచారం ప్రకారం, ఈ కంపెనీ తదుపరి బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కావచ్చని తెలుస్తోంది. ఇది మీటియోర్ 350 యొక్క J ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, హంటర్ 350 మోటార్‌సైకిల్ ను కంపెనీ ఈ ఏడాది మధ్య భాగనం నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం. అయితే, దీని లాంచ్‌కు సంబంధించిన కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.

బుల్లెట్ బండ్లకు పెరుగుతున్న డిమాండ్.. మరో కొత్త బైక్ 'హంటర్ 350' (Hunter 350) వస్తోంది !!

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని నెలలుగా హంటర్ 350ని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. గతంలో లీకైన చిత్రాలను చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, మీటియోర్ 350 డిజైన్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో మీటియోర్ మాదిరిగానే టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి చాలా భిన్నమైన బైక్‌గా ఉండబోతోంది, కంపెనీ దీనిని రోడ్‌స్టర్ బైక్‌గా పరిచయం చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 2, 2022, 14:53 [IST]
English summary
Royal enfield sold 67667 motorcycles in march 2022 hunter 350 launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+