EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

ఒడిశాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'షెమ' (SHEMA) '2022 ఈవి ఇండియా ఎక్స్‌పో' (2022 EV India Expo) లో ఏకంగా మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా ఆవిష్కరించింది. ఇవన్నీ కూడా హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇవి ఆధునిక డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటాయి.

Recommended Video

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

'షెమ' (SHEMA) ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, అవి ఈగిల్ ప్లస్ (Eagle Plus), గ్రిఫోన్ (Gryphon) మరియు టఫ్ ప్లస్ (Tuff Plus) ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు '2022 ఈవి ఇండియా ఎక్స్‌పో' లో ఆవిష్కరించడం వల్ల ఎక్కువమంది ఔత్సాహికులును ఆకర్శించే అవకాశం ఉంటుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

ఈగల్ ప్లస్ (Eagle Plus):

'షెమ' (SHEMA) ఎలక్ట్రిక్ ఆవిష్కరించిన మూడు ఎలక్టర్కు స్కూటర్లలో ఒకటి ఈ 'ఈగల్ ప్లస్' (Eagle Plus) ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది కంపెనీ యొక్క హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. కావున ఇది సులభంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కావున ఇది రోజువారీ ప్రయాణానికి మరియు నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

ఈగల్ ప్లస్ (Eagle Plus) ఎలక్ట్రిక్ స్కూటర్ 1200 వాట్ BLDC మోటార్ మరియు 3.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ (ఫిక్స్డ్ బ్యాటరీ) కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. కాగా ఇది కేవలం 3 నుంచి 4 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడింగ్ కెపాసిటీ 180 కేజీల వరకు ఉంటుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

గ్రిఫోన్ (Gryphon):

'షెమ' (SHEMA) ఎలక్ట్రిక్ యొక్క మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ గ్రిఫోన్ (Gryphon). ఇది 1500 వాట్ మోటార్ మరియు 4.1 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ (ఫిక్స్డ్ బ్యాటరీ) పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 3.5 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

గ్రిఫోన్ (Gryphon) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 130 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్లు. ఇది కూడా సిటీ రైడింగ్ మరియు రోజువారీ రైడింగ్ కి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది ఆధునిక కాలంలో ఉపయోగించడానికి తగిన విధంగా తయారుచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడింగ్ కెపాసిటీ 180 కేజీల వరకు ఉంటుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

టఫ్ ప్లస్ (Tuff Plus):

మన లిస్ట్ లో మూడవ మరియు హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ 'టఫ్ ప్లస్' (Tuff Plus). ఇది కూడా 1500 వాట్ మోటార్ మరియు 4.1 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, ఇది రిమూవబుల్ బ్యాటరీ కాదు. కావున ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం కేవలం 3.5 నుంచి 4 గంటలు. అదే సమయంలో ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లోడింగ్ కెపాసిటీ 200 కేజీల వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు రైడర్లను మంచి రైడింగ్ అనుభూతిని అందించగలవాని ఆశిస్తున్నాము.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

SHEMA ఎలక్ట్రిక్ కంపెనీ బ్రాండ్ కింద ఇప్పుడు మొత్తం 5 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అవి SES ఈగల్, SES టఫ్, SES జూమ్, SES హాబీ మరియు SES బోల్డ్‌. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లాంచ్ చేయడానికి తగిన ప్రయత్నాలు చేయనుంది.

EV India Expo 2022: ఒకే వేదికపై మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆవిష్కరించిన SHEMA.. వివరాలు

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్లో 2022 అక్టోబర్ చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. SHEMA ఎలక్ట్రిక్ భారతదేశంలో ఇప్పటికే దాదాపు 40 కి పైగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ మరియు 4 రాష్ట్రాల్లో తన ఉనికిని కలిగి ఉంది. అయితే రానున్న రోజుల్లో మరింతమంది కష్టమర్లకు చేరువగా చేరుకోవడానికి తగిన ప్రయత్నాలు చేయడంతోపాటు కొత్త ఉత్పత్తులను విడుదల చేయాడానికి కూడా సిద్దమవుతోంది.

Most Read Articles

English summary
Shema electric unveiled three high speed electric scooters details
Story first published: Wednesday, September 7, 2022, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X