సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సుజుకి యాక్సెస్ 125 (Access 125) స్కూటర్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. కొత్త సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ డ్యూయల్-టోన్ మోడల్ యాక్సెస్ 125 స్కూటర్ ధరలు రూ. 83,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

కొత్తగా విడుదలైన సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లోని కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ సాలిడ్ ఐస్ గ్రీన్ / పెరల్ మిరాజ్ కలర్ కాంబినేషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్), రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డ్రమ్) మరియు స్పెషల్ ఎడిషన్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిలో సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్) చాలా ఖరీదైనది, దీని ధర రూ. 87,200 (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

ఇకపోతే, సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డ్రమ్) వేరియంట్ ధర రూ. 85,200 ధర ట్యాగ్‌తో (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఈ కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త డ్యూయెల్ టోన్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ లో కొత్త కలర్ ఆప్షన్ మినహా వేరే ఇతర కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

యాక్సెస్ 125 స్కూటర్ 124 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తంమీద, కొత్త సుజుకి యాక్సెస్ 125 డ్యూయల్-టోన్ వేరియంట్ చాలా రిఫ్రెష్‌గా కనిపిస్తోంది మరియు ఈ పండుగ సీజన్‌లో ఈ వేరియంట్ మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని కంపెనీ ఆశిస్తోంది.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ యొక్క రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్‌లతో లభిస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ అలెర్ట్ డిస్‌ప్లే, మిస్డ్ కాల్‌లు మరియు అన్‌రీడ్ ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్ వంటి ఇతర ఉపయోగకరమైన ఫీచర్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే, రైడర్ కు సహకరించే ఇతర అలెర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్థాయి ప్రదర్శన, ఎస్టిమేటెడ్ అరైవల్ టైం మరియు యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్కూటర్‌లోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా యూజర్ మొబైల్‌ని స్కూటర్‌తో సింక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా, సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ లిడ్, ఎల్ఈడి పొజిషన్ లైట్లు వంటి ఇతర ఫీచర్లను కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌తో లభిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా వినియోగదారులు అనేక రకాల స్మార్ట్ ఫీచర్లను తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

ఈ సందర్భంగా, జుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా మాట్లాడుతూ, "తాము పండుగ నెలలోకి అడుగుపెడుతున్నందున, ఈ ఉత్సవాలకు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని జోడించడానికి సుజుకి యాక్సెస్ 125 కోసం అద్భుతమైన కొత్త కలర్ వేరియంట్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని, కస్టమర్‌లు ఎంచుకోవడానికి ఇది యూత్‌ఫుల్ కలర్ ఆప్షన్ అని, సుజుకి యాక్సెస్ 125 భారతదేశంలో తన సత్తాను నిరూపించుకుందని మరియు దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకోగలిగిందని" అన్నారు.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

భారత మార్కెట్లో సుజుకి కటానా (Suzuki Katana) స్పోర్ట్స్ బైక్..

ఇదిలా ఉంటే, సుజుకి కొన్ని నెలలో క్రితమే భారతదేశంలో తమ సరికొత్త రెట్రో-స్టైల్ లగ్జరీ మోటార్‌సైకిల్ సుజుకి కటానా (Suzuki Katana) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో సుజుకి కటానా బైక్ ధర రూ. 13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. కొత్త 2022 సుజుకి కటానా బైక్ లో 999 సీసీ ఫ్యూయల్-ఇంజెక్ట్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, DOHC, ఇన్‌లైన్ ఫోర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 11,000 rpm వద్ద 150.1 bhp పవర్ ను మరియు 9,250 rpm వద్ద 106 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 డ్యూయెల్ టోన్ విడుదల.. కలర్ మాత్రమే ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్..

సుజుకి కటానా దాని పేరుకి తగినట్లుగా కత్తి (స్వార్డ్) లాంటి పదునైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ నిలువుగా పేర్చబడిన దీర్ఘచతురస్రాకార ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్‌ను కలిగి ఉంటుంది మరియు ఇందులో ఫ్రంట్ పొజిషన్ లైట్లు బైక్ ముఖం యొక్క పదునైన రూపాన్ని మరింత పెంచుతాయి. పదునైన స్టైల్ ఎల్ఈడి లైట్లు వెనుక భాగంలో కూడా కనిపిస్తాయి, ఇది ప్రత్యేకమైన లైటింగ్ ప్యాటర్న్ ను కలిగి ఉంటుంది. దాని సీటు ఎత్తు భూమి నుండి 825 మిమీ ఎత్తులో ఉంటుంది. కటానా మొత్తం బరువు 217 కిలోలుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Suzuki access 125 dual tone variant launched price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X