మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) గతేడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త స్పోర్టీ స్కూటర్ 'సుజుకి అవెనిస్' (Suzuki Avenis) లో కంపెనీ కొత్తగా మరో వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో సుజుకి అవెనిస్ ఇప్పటి వరకూ అవెనిస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ (Avenis Ride Connect Edition) మరియు అవెనిస్ రేస్ ఎడిషన్ (Avenis Race Edition) అనే రెండు వేరియంట్లోల అందుబాటులో ఉండేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో కొత్తగా అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్ (Avenis Standard Edition) ను విడుదల చేసింది.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

మార్కెట్లోకి కొత్తగా వచ్చిన సుజుకి అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్ ధర, ఇతర రెండు వేరియంట్ల ధర కన్నా స్వల్పంగా తక్కువగా ఉంటుంది. ఈ మూడు వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:

అవెనిస్ స్టాండర్డ్ ఎడిషన్ - రూ.88,798

అవెనిస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ - రూ.90,293

అవెనిస్ రేస్ ఎడిషన్ - రూ.90,593

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

సుజుకి అవెనిస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ మరియు రేస్ ఎడిషన్ లతో పోల్చుకుంటే, ఈ స్టాండర్డ్ ఎడిషన్ కొన్ని ఫీచర్లను కోల్పోతుంది, ఫలితంగా దాని ధర కూడా తక్కువగా ఉంటుంది. స్టాండర్డ్ ఎడిషన్ సుజుకి అవెనిస్ స్కూటర్ లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, SMS అలర్ట్, మిస్డ్ కాల్ మరియు అన్‌రీడ్ SMS అలర్ట్, WhatsApp మెసేజ్ అలర్ట్ వంటి మరికొన్ని ఫీచర్లను మిస్ అవుతాయి.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

అయితే, కంపెనీ ఈ స్కూటర్‌లో బయటి వైపు నుండి ఇంధనాన్ని నింపుకునేందుకు వీలు ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, వెనుక వైపున మోటార్‌సైకిల్ స్టైల్ ఇండికేటర్లు మరియు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ స్కూటర్ లోని ఇతర డిజైన్ ఎలిమెంట్స్, ఇంజన్ మరియు మెకానికల్ భాగాలు మరియు ఇంజన్ మిగిలిన రెండు స్కూటర్ల మాదిరిగానే ఉంటాయి.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

సుజుకి అవెనిస్ విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో సుజుకి అవెనిస్ 125 స్టాండర్డ్ ఎడిషన్ మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రో అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సుజుకి అవెనిస్ (Suzuki Avenis) స్కూటర్‌ను కంపెనీ ప్రత్యేకించి స్పోర్టీనెస్ ను కోరుకునే నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసింది.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

అవెనిస్ స్కూటర్ తక్కువ బ్యాడీ ప్యానెల్స్, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్, స్పోర్టీ గ్రాఫిక్స్ మరియు మంచి రేసింగ్ స్టైల్ ఏరోడైనమిక్స్ తో ఇది మొదటి చూపులోనే కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, ఈ చిన్న స్కూటర్ చాలా తేలికగా ఉంటుంది. ఈ స్కూటర్ బరువురు కేవలం 106 కిలోలు మాత్రమే ఉంటుంది.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

ఈ స్కూటర్ లో కంపెనీ కొత్త FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ ను ఉపయోగించింది. ఇందులోని 125 సిసి ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇది ఈ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్ , యమహా రే జెడ్ఆర్ మరియు హోండా డియో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

అవెనిస్ 125 స్కూటర్‌లో ఉన్న ఫీచర్లు కొన్ని మోటార్‌సైకిళ్లలో ఉండే ఫీచర్లను పోలి ఉంటాయి. ఇందులో స్ప్లిట్ గ్రిప్ రైల్, స్పోర్టీ లుకింగ్ మఫ్లర్, స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ మరియు సన్నింగ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ స్కూటర్‌లో లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కోరుకునే వారు కనెక్ట్ ఎడిషన్‌ను ఎంచుకోవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీతో లభిస్తుంది. సుజుకి ఇందుకోసం ఓ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ యాప్ ను కూడా అందిస్తోంది. దీని సాయంతో కాలర్ ID, SMS అలర్ట్, WhatsApp అలర్ట్, హైస్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లను స్కూటర్ ఎల్‌సిడి డిస్‌ప్లే పై చూడవచ్చు.

మార్కెట్లో Suzuki Avenis 125 Standard Edition స్కూటర్ విడుదల: ఇతర వేరియంట్ల కన్నా తక్కువ ధరే!!

ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ను అండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం సుజుకి సంస్థ ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌లో బాడీ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్స్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇందులో మరింత స్పోర్టీగా కనిపించే స్కూటర్ కావాలనుకునే వారు రేస్ ఎడిషన్ ను ఎంచుకోవచ్చు. ఇది రేస్ ప్రేరేపిత మెటాలిక్ టైటన్ బ్లూ కలర్‌లో లభిస్తుంది.

Most Read Articles

English summary
Suzuki avenis 125 standard edition launched price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X