Suzuki Avenis 125 స్కూటర్ కావాలా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) ఇటీవల కాలంలో కొత్త 'సుజుకి అవెనిస్ 125' (Suzuki Avenis 125) ను దేశీయ మార్కెట్లో రూ. 86,700 ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అయితే దీని యొక్క టాప్ వేరియంట్ ధర రూ. రూ. 87,000 (ఎక్స్-షోరూమ్).

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇప్పుడు తన 125సిసి స్కూటర్ 'సుజుకి అవెనిస్' డెలివరీని ఈ జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కావున త్వరలో ఈ స్కూటర్ కస్టమర్లను చేరుకుంటుంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

కొత్త సుజుకి అవెనిస్ 125 స్కూటర్ బరువు 106 కేజీల వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ప్రధానంగా యువ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రారంభించబడింది. ఈ కారణంగా ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. సుజుకి అవెనిస్ ఈ విభాగంలో Honda Dio, TVS Ntorq మరియు Yamaha RayZR వంటి స్పోర్టీ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) కలర్స్.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని స్కూటర్లలో ఫ్యూయెల్ క్యాప్ లోపల ఉంటుంది, కానీ ఈ కొత్త స్కూటర్ లో మాత్రం ఇప్పుడు ఫ్యూయెల్ క్యాప్ బయటవైపు ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ నింపడానికి మళ్ళీ మళ్ళీ సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

ఈ స్టైలిష్ స్కూటర్‌లోని రియర్ ఇండికేటర్ కూడా దీనిని మరింత దూకుడుగా చూపిస్తుంది. ఇది దాని స్పోర్టీ డిజైన్‌తో బాగా కలిసిపోతుంది. LED టెయిల్ లైట్ కూడా ఇందులో అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED హెడ్‌లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ సుజుకి రైడ్ కనెక్ట్‌తో టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కలిగి ఉంది, ఇది రైడర్‌కు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. దీని ఫినిషింగ్ లో, అనేక కలర్ ఆప్సన్ కనిపిస్తాయి. ఇది మొత్తానికి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

సుజుకి అవెనిస్ అండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ను ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌లో బాడీ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్స్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

కొత్త Suzuki Avenis FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ 5.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. అదే విధంగా ఇది 21.8 లీటర్ల అండర్-సీట్ బూట్ స్పేస్ కూడా పొందుతుంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ దాని కలర్ ఆప్సన్స్ ని బట్టి ధరలు వివిధ రకాలుగా ఉంటుంది. కావున ఇందులో మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే/మెటాలిక్ లష్ గ్రీన్ కలర్ ధర రూ.86,700, పెరల్ బ్లేజ్ ఆరెంజ్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700 మరియు మెటాలిక్ మ్యాట్ బ్లాక్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ ధర రూ.86,700, పెరల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రిన్ గ్రే కలర్ ధర రూ. 86,700 మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) ధర రూ. 87,000 (ఎక్స్-షోరూమ్).

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

ఇదిలా ఉండగా ఇటీవల సుజుకి మోటార్‌సైకిల్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. సుజుకి గత కొన్ని నెలలుగా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ మోడల్‌ను పరీక్షిస్తోంది.

Suzuki Avenis 125 స్కూటర్ బుక్ చేసారా.. అయితే డెలివరీలు ఎప్పుడో తెలుసా?

కంపెనీ పేటెంట్‌లో దాఖలు చేసిన ఫోటోగ్రాఫ్‌లు ఇది బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ యొక్క పేటెంట్ ఇమేజ్ అని వెల్లడించింది. స్కూటర్ డిజైన్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి సంప్రదాయ ఇంధనంతో నడిచే స్కూటర్‌కి భిన్నంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లు సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్ లేదా హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును స్వింగ్‌ఆర్మ్‌పై అమర్చబడి ఉంటాయి. ఇది స్కూటర్‌కు మంచి అండర్ సీట్ స్థలాన్ని కూడా ఇస్తుంది, ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగించబడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 5, 2022, 13:06 [IST]
English summary
Suzuki avenis 125 to be delivered from january 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+