భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' (Suzuki Motorcycle India) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ దేశీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల తన క్రూయిజర్ బైక్ ను ఇండియన్ మార్కెట్లో నిలిపివేసింది. అసలు ఈ బైక్ నిలిపివేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి భారతీయ మార్కెట్లో ఉన్న ఒకే ఒక క్రూయిజర్ బైక్ 'సుజుకి ఇంట్రూడర్ 150' (Suzuki Intruder 150). అయితే ఉన్న ఆ ఒక్క క్రూయిజర్ బైక్ ని నిలిపివేయడానికి ప్రధాన కారణం దీని అమ్మకాలు సరిగ్గా లేకపోవడమే. ఈ కారణంగానే కంపెనీ తన వెబ్‌సైట్ నుండి ఈ బైక్‌ను తొలగించింది. అంతే కాకుండా బుకింగ్‌లను కూడా నిలిపివేసింది.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఇంట్రూడర్ 150 నిలిపివేత గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల చేయలేదు. కంపెనీ ఈ బైక్ యొక్క ఉత్పత్తిని 2017 సంవత్సరంలో భారతీయ విఫణిలో ప్రారంభించింది. ఆ తరువాత బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా 2020 లో అప్డేట్ చేసింది. అయితే కంపెనీ ఈ బైక్ లో ఎన్ని అప్డేట్స్ చేసినప్పటికీ మొదటినుంచి కూడా చాలా తక్కువ అమ్మకాలను మాత్రమే నమోదు చేస్తూనే ఉంది. ఈ కారణంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

సుజుకి ఇంట్రూడర్ 150 భారతదేశంలో రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విక్రయించింది. ఈ బైక్ మార్కెట్లో ప్రధానంగా బజాజ్ కంపెనీ యొక్క అవెంజర్ 160 కి ప్రత్యర్థిగా ఉండేది. అయితే బజాజ్ అవెంజర్ 160 మొదట నుంచి కూడా సుజుకి ఇంట్రూడర్ 150 కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. మొత్తం మీద ఎక్కువ అమ్మకాలు పొందని ఇంట్రూడర్ 150 ఇప్పుడు నిలిచిపోవడానికి సిద్ధమైపోయింది.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

ఇదిలా ఉండగా సుజుకి మోటార్‌సైకిల్ భారతదేశంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ గత సంవత్సరం మార్కెట్లో కొత్త హయబుసా లగ్జరీ బైక్ విడుదల చేసింది. అదే సమయంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో వి-స్ట్రామ్ ఎస్ఎక్స్ 250 ఏ బైక్ కూడా విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు వీటిపైనా ఎక్కువ దృష్టికి కేద్రీకరించింది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

ఇక 'సుజుకి మోటార్‌సైకిల్' కంపెనీ యొక్క గత నెల అమ్మకాల విషయానికి వస్తే, 2022 ఏప్రిల్ నెలకంటే కూడా 2022 మే నెలలో విక్రయాలు స్వల్పంగా తగ్గినట్లు తెలిసింది. 2022 మే నెలలో అమ్మకాలు ఏప్రిల్ నెలకంటే 0.6% తగ్గుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ నెలలో కంపెనీ అమ్మకాలు 71,987 యూనిట్లు (మే నెలలో మొతం అమ్మకాలు 71,526 యూనిట్లు).

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

2022 మే నెలలో విక్రయించిన 71,526 యూనిట్లలో కంపెనీ దేశీయ మార్కెట్లో 60,518 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ యొక్క దేశీయ అమ్మకాలలో మే నెల అమ్మకాలు మునుపటి నెలకంటే కూడా 11.4% పెరిగినట్లు తెలుస్తుంది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి ఇటీవల విడుదల చేసిన సుజుకి వి-స్ట్రోమ్ ఎస్‌ఎక్స్‌ చాలా వరకు సహాయపడిందని తెలుస్తుంది.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ 2022 మే నెలలో 11,008 యూనిట్లను ఎగుమతి చేసింది. 2022 ఏప్రిల్ నెలలో 17,660 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు ఏప్రిల్ నెలకంటే కూడా మే నెలలో 37.7% తగ్గాయి.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా విజృంభించిన కారణంగా దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ కారణంగా కంపెనీ 2021 మే నెలలో తన అమ్మకాల గణాంకాలను వెల్లడించలేదు. కావున గత సంవత్సరం మే నెలలో ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి అనేది స్పష్టంగా తెలియదు.

భారత్‌కు బై.. బై చెప్పనున్న 'సుజుకి ఇంట్రూడర్ 150'.. కారణం ఇదే..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో సుజుకి ఇంట్రూడర్ 150 ఇలిపివేతను గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అధికారిక సమాచారం ఆడించనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు బట్టి ఈ మోడల్ భారతీయ మార్కెట్ కి వీడ్కోలు పలికే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కావున ఇది సుజుకి ఇంట్రూడర్ ప్రియులకు చేదు వార్త అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Suzuki intruder 150 discontinued from indian market details
Story first published: Saturday, June 18, 2022, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X