Just In
- 11 min ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 41 min ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 2 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
- 4 hrs ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
Don't Miss
- News
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ హత్య, సోదరుడికి తీవ్రగాయాలు
- Movies
Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
- Technology
Zoom App వాడుతున్నారా... ప్రమాదంలో ఉన్నట్లే ! వెంటనే Update చేయండి.
- Sports
జింబాబ్వేలో నీటి కొరత.. బాత్రూమ్ల్లో ఎక్కువ సేపు ఉండద్దంటూ టీమిండియాకు బీసీసీఐ ఆదేశాలు!
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Lifestyle
Exercise and Sleep: నిద్రపై వ్యాయామ ప్రభావం.. పడుకునే ముందు చేయవచ్చా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
భారత మార్కెట్లో సుజుకి కటానా (Suzuki Katana) స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారతదేశంలో తమ సరికొత్త రెట్రో-స్టైల్ బైక్ కటానా (Suzuki Katana) ను విడుదల చేసింది. భారత మార్కెట్లో సుజుకి కటానా బైక్ ధర రూ. 13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.
నేటి నుండి సుజుకి మోటార్‌సైకిల్ యొక్క డీలర్‌షిప్‌లలో ఈ బైక్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

సరికొత్త సుజుకి కటానా బైక్ కు ఆ పేరును 1982 GS1000S కటానా మరియు ఐకానిక్ సమురాయ్ స్వార్డ్ నుండి ప్రేరణ పొంది పెట్టడం జరిగింది. దీని డిజైన్ 1980 కాలం నాటి ఐకానిక్ జపనీస్ స్ట్రీట్ బైక్ నుండి ప్రేరణ పొందినది. ఈ కొత్త సుజుకి ప్రీమియం బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సుజుకి కటానా - స్పెక్స్ మరియు డైమెన్షన్స్
ఈ కొత్త బైక్ దాని 1980ల పూర్వీకుల మాదిరిగానే, కొత్త 2022 కటానా ఇప్పటికే ఉన్న GSX సిరీస్ బైక్ GSX-S1000పై ఆధారపడి ఉంటుంది. సుజుకి కటానా దాని మెకానికల్ బిట్‌లను లీటర్-క్లాస్ (1000సీసీ) జిక్సర్‌తో పంచుకుంటుంది. కొత్త 2022 సుజుకి కటానా బైక్ లో 999 సీసీ ఫ్యూయల్-ఇంజెక్ట్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, DOHC, ఇన్‌లైన్ ఫోర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 11,000 rpm వద్ద 150.1 bhp పవర్ ను మరియు 9,250 rpm వద్ద 106 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి సుజుకి యొక్క క్లచ్ అసిస్ట్ సిస్టమ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేస్తుంది. కొత్త సుజుకి కటానా ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ సెటప్‌తో పూర్తిగా సర్దుబాటు చేయగల 43ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ కయాబా ఫ్రంట్ ఫోర్క్స్‌తో పాటుగా, వెనుక వైపు కూడా కయాబా నుండి గ్రహించిన సర్దుబాటు చేయగల ప్రీలోడ్ మరియు రీబౌండ్ డంపింగ్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది.

ఫ్రంట్ సస్పెన్షన్ 120 మిమీ ట్రావెల్ కు అనుమతిస్తుంది, అయితే వెనుక షాక్ అబ్జార్వర్ స్పోర్టీ మరియు కాస్ట్లీ రైడ్ కోసం 130 మిమీ ట్రావెల్ కు అనుమతిస్తుంది. కొత్త సుజుకి కటానాలో బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 4-పిస్టన్ రేడియల్ మోనోబ్లాక్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన డ్యూయల్ 310ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు ఉంటాయి. అలాగే, వెనుక చక్రం పై సింగిల్ పిస్టన్ కాలిపర్‌లతో 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇవి రెండూ కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

కొత్త సుజుకి కటానా బైక్ కి ఇరువైపులా 17 ఇంచ్ 6 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ పై 120/70-ZR17(ముందు) మరియు 190/50-ZR17 (వెనుక) ప్రొఫైల్ టైర్లు అమర్చబడి ఉంటాయి. సుజుకి కటానా 2,130 మిమీ పొడవు, 820 మిమీ వెడల్పు మరియు 1,100 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. కటానా వీల్‌బేస్ 1,460 మిమీ గా ఉంటుంది. ఈ రెట్రో-థీమ్ బైక్ 140 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది మరియు దాని రైడర్ సీటు ఎత్తు భూమి నుండి 825 మిమీ ఎత్తులో ఉంటుంది. కటానా బరువు 217 కిలోలుగా ఉంటుంది.

సుజుకి కటానా - డిజైన్ మరియు ఫీచర్లు
సుజుకి కటానా పేరుకి తగినట్లుగా కత్తి (స్వార్డ్) లాంటి పదునైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ నిలువుగా పేర్చబడిన దీర్ఘచతురస్రాకార ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్‌ను కలిగి ఉంటుంది మరియు ఇందులో ఫ్రంట్ పొజిషన్ లైట్లు బైక్ ముఖం యొక్క పదునైన రూపాన్ని మరింత పెంచుతాయి. పదునైన స్టైల్ ఎల్ఈడి లైట్లు వెనుక భాగంలో కూడా కనిపిస్తాయి, ఇది ప్రత్యేకమైన లైటింగ్ ప్యాటర్న్ ను కలిగి ఉంటుంది.

ఈ బైక్ లోని సీటు నలుపు మరియు గ్రే కలర్లలో ఉండే డ్యూయెల్ టోన్ యూనిట్ మరియు వెనుక టైర్‌ను హత్తుకుని ఉండే స్వింగ్‌ఆర్మ్‌తో కూడిన రియర్ ఫెండర్ కారణంగా దీని టెయిల్ విభాగం చాలా క్లీన్ గా కనిపిస్తుంది. ఈ వెనుక ఫెండర్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్ మరియు రియర్ టర్న్ సిగ్నల్‌లకు హోస్ట్‌గా పనిచేస్తుంది. పొట్టిగా మరియు మొరటుగా ఉండే దీని అప్‌స్వెప్ట్ మఫ్లర్ 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండ్ నుండి వచ్చే శబ్దాన్ని చాలా వినసొంపుగా చేస్తుంది.

సుజుకి కటానా యొక్క హ్యాండిల్‌బార్‌లు రబ్బర్ మౌంట్‌లను కలిగి ఉంటాయి, ఇవి రైడర్ హ్యాండ్‌లకు వైబ్రేషన్ ట్రాన్స్‌మిటర్ మొత్తాన్ని తగ్గిస్తాయి. కటానా అంబర్ బ్యాక్‌లైటింగ్‌తో కూడిన పూర్తి ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది మరియు సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్, సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో సహా పలు అధునాతన సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.