ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) అనేది జపాన్‌లోని సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు చెందిన భారతీయ ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ. ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి కూడా. ఇటీవల ఈ కంపెనీ గురుగ్రామ్‌లోని ఖేర్కీ ధౌలాలోని తన తయారీ కేంద్రం నుండి 6 మిలియన్ల (60వ లక్ష) వాహనాన్ని విడుదల చేసింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

కంపెనీ 60 లక్షల వాహనంగా కొత్త సుజుకి అవెనిస్ 125 సిసి (Suzuki Avenis 125 cc) స్కూటర్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. కంపెనీ యొక్క సుజుకి అవెనిస్ 125 సిసి స్కూటర్ ఈ మధ్య కాలంలోనే విడుదల చేయబడింది. కొత్త సుజుకి అవెనిస్ 125 కంపెనీ 125 సిసి స్కూటర్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125లతో పాటు భారత మార్కెట్లో విక్రయించబడుతోంది.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

'సుజుకి అవెనిస్ 125' (Suzuki Avenis 125) ను దేశీయ మార్కెట్లో రూ. 86,700 ప్రారంభ ధర వద్ద విడుదలయ్యింది. అయితే దీని యొక్క టాప్ వేరియంట్ ధర రూ. రూ. 87,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ ప్రధానంగా యువ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రారంభించబడింది. ఈ కారణంగా ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇంత గొప్ప విజయాన్ని సాధించిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'సతోషి ఉచిడా' మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దేశంలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మా గురుగ్రామ్ ప్లాంట్ నుండి భారతదేశంలో మా 6 మిలియన్ల సుజుకి ద్విచక్ర వాహన ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కూడా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంతటి విజయాన్ని సాధించడానికి కస్టమర్లు కంపెనీపైన పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం అన్నారు. అంతే కాకుండా ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో 6 మిలియన్ల మైలురాయి సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మా కస్టమర్‌లకు అత్యుత్తమ విలువను మరియు మా నిరంతర నిబద్ధతను సూచిస్తుంది. దేశంలో కరోనా మహమ్మారి ఒకావైపు, సెమికండక్టర్ చిప్ కొరత మరో వైపు ఉన్నప్పటికీ కంపెనీ ఈ కొత్త మైలురాయిని చేరుకుంది. ఇందులో మా కార్మికులు యొక్క సమిష్టి కృషి కూడా ఉందన్నారు.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

ఇక సుజుకి అవెనిస్ 125 స్కూటర్ విషయానికి వస్తే, ఇది మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్) కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని స్కూటర్లలో ఫ్యూయెల్ క్యాప్ లోపల ఉంటుంది, కానీ ఈ కొత్త స్కూటర్ లో మాత్రం ఇప్పుడు ఫ్యూయెల్ క్యాప్ బయటవైపు ఉంటుంది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ నింపడానికి మళ్ళీ మళ్ళీ సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

ఈ స్టైలిష్ స్కూటర్‌లోని రియర్ ఇండికేటర్ కూడా దీనిని మరింత దూకుడుగా చూపిస్తుంది. ఇది దాని స్పోర్టీ డిజైన్‌తో బాగా కలిసిపోతుంది. LED టెయిల్ లైట్ కూడా ఇందులో అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED హెడ్‌లైట్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

సుజుకి అవెనిస్ 125 స్కూటర్ సుజుకి రైడ్ కనెక్ట్‌తో టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కలిగి ఉంది, ఇది రైడర్‌కు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. దీని ఫినిషింగ్ లో, అనేక కలర్ ఆప్సన్ కనిపిస్తాయి. ఇది మొత్తానికి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

సుజుకి అవెనిస్ అండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ను ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌లో బాడీ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్స్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఉత్పత్తిలో కొత్త మైలురాయిని చేరుకున్న Suzuki Motorcycle: పూర్తి వివరాలు

కొత్త Suzuki Avenis FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

ఈ స్కూటర్ 5.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. అదే విధంగా ఇది 21.8 లీటర్ల అండర్-సీట్ బూట్ స్పేస్ కూడా పొందుతుంది. సుజుకి అవెనిస్ దేశీయ మార్కెట్లో Honda Dio, TVS Ntorq మరియు Yamaha RayZR వంటి స్పోర్టీ స్కూటర్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 12, 2022, 9:25 [IST]
English summary
Suzuki motorcycle india complete 60 lakh vehicles production in gurugram plant details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+