ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో బలమైన పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 2022లో అమ్మకాల గణాంకాలను విశ్లేషిస్తే, కంపెనీ నెలవారీ అమ్మకాల పనితీరును మెరుగుపరుచుకున్నట్లు మరియు మంచి ట్రాక్షన్‌ను పొందినట్లు స్పష్టమవుతుంది. అయితే, ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ వార్షిక అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో సుజుకి ఏయో మోడల్ ను ఎన్ని యూనిట్ల మేర విక్రయించిందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి యాక్సెస్ (32,932 యూనిట్లు)

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి గత నెలలో అత్యధికంగా విక్రయించిన మోడళ్లలో సుజుకి యాక్సెస్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌లలో ఒకటిగా ఉన్న సుజుకి యాక్సెస్ ఏప్రిల్ 2022లో 32,932 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, మరోసారి అత్యధికంగా అమ్ముడైన 125సిసి స్కూటర్‌గా అవతరించింది. ఈ సమయంలో సుజుకి యాక్సెస్ వార్షిక అమ్మకాలు 38 శాతం క్షీణించగా, నెలవారీ అమ్మకాలు మాత్రం దాదాపు 6 శాతం పెరిగాయి.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి అవెనిస్ (11,078 యూనిట్లు)

సుజుకి ఇటీవలే అవెనిస్ (Avenis) స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్కూటర్ భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొంది, అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. గడచిన ఏప్రిల్ 2022 నెలలో ఈ స్పోర్టీ స్కూటర్ అమ్మకాలు 11,078 యూనిట్లుగా నమోదయ్యాయి. సుజుకి అవెనిస్ స్కూటర్ నెలవారీ అమ్మకాలు దాదాపు 1 శాతం పెరిగాయి, ఎందుకంటే కంపెనీ గడచిన మార్చి 2022లో కేవలం 9,815 యూనిట్ల అవెనిస్ స్కూటర్‌లను మాత్రమే విక్రయించగలిగింది.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి బర్గ్‌మాన్ (9,088 యూనిట్లు)

సుజుకి నుండి లభిస్తున్న పెద్ద సైజు స్కూటర్ బర్గ్‌మ్యాన్. మ్యాక్సీ స్టైల్ స్కూటర్ గా కనిపించే సుజుకి బర్గ్‌మ్యాన్, సుజుకి యాక్సెస్‌కు శక్తినిచ్చే అదే ఇంజన్‌తో పనిచేసే విశాలమైన స్కూటర్. గడచిన ఏప్రిల్ 2022లో, సుజుకి భారతదేశంలో 9,088 యూనిట్ల సుజుకి బర్గ్‌మాన్ స్కూటర్లను విక్రయించింది. వార్షికంగా చూస్తే, ఈ మోడల్ అమ్మకాలు 11 శాతం కంటే ఎక్కువ మెరుగుపడ్డాయి మరియు నెలవారీ అమ్మకాలు కూడా 1 శాతం కంటే ఎక్కువ మెరుగుపడ్డాయి.

Rank Suzuki Apr-22 Apr-21 Growth (%) YoY
1 Access 32,932 53,285 -38.20
2 Avenis 11,078 0 -
3 Burgman 9,088 8,154 11.45
4 Gixxer 1,008 2,110 -52.23
5 Gixxer 250 208 133 56.39
6 V-Strom 650 10 21 -52.38
7 Hayabusa 3 0 -
8 Intruder 0 176 -100.00
ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి జిక్సర్ (1,008 యూనిట్లు)

సుజుకి జిక్సర్ భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో లభిస్తున్న అత్యుత్తమ 150cc మోటార్‌సైకిల్‌లలో ఒకటిగా ఉంది. గడచిన ఏప్రిల్ 2022లో, సుజుకి భారతదేశంలో జిక్సర్ సిరీస్ మోటార్‌సైకిళ్లలో కేవలం 1,008 యూనిట్లను విక్రయించింది. మార్కెట్ పరిమాణం ఉన్నప్పటికీ, జిక్సర్ మోటార్‌సైకిళ్లు పెద్దగా అమ్మడుపోలేదు. వార్షికంగా చూస్తే, ఈ మోడల్ విక్రయాలు 52 శాతానికి పైగా తగ్గాయి. అయితే, అంతకు ముందు నెల కంటే సుమారు 375 యూనిట్లను ఎక్కువగా విక్రయించడంతో ఈ బ్రాండ్ నెలవారీ అమ్మకాలు మెరుగుపడ్డాయి.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి జిక్సర్ 250 (208 యూనిట్లు)

సుజుకి జిక్సర్ సిరీస్ లో లభిస్తున్న పెద్ద మోటార్‌సైకిల్ జిక్సర్ 250. ఈ జిక్సర్ 250 శ్రేణి మోటార్‌సైకిళ్లు మంచి పనితీరు మరియు ఫీచర్లను కలిగి ఉంటాయి. ఏప్రిల్ 2022లో, సుజుకి భారతదేశంలో 208 యూనిట్ల Gixxer 250 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గతంలో సంఖ్యలను విశ్లేషిస్తే, సుజుకి జిక్సర్ 250 యొక్క వార్షిక అమ్మకాలు 56 శాతం కంటే ఎక్కువ మెరుగుపడ్డాయి. అంతేకాకుండా, నెలవారీ అమ్మకాలు కూడా దాదాపు 33 శాతం మెరుగుపడ్డాయి.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి వి-స్టోర్మ్ 650 (10 యూనిట్లు)

సుజుకి వి-స్టోర్మ్ 650 అనేది అత్యంత-రేటింగ్ మరియు అధిక సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిల్. గడచిన ఏప్రిల్ నెలలో ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ భారతదేశంలో 10 యూనిట్ల వి-స్టోర్మ్ 650 (V-Storm 650) మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది. ఈ మోడల్ వార్షిక అమ్మకాలు 52 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. అయితే, నెలవారీ అమ్మకాలు మాత్రం 150 శాతం పెరిగాయి.

Rank Suzuki Apr-22 Mar-22 Growth (%) MoM
1 Access 32,932 31,097 5.90
2 Avenis 11,078 9,815 12.87
3 Burgman 9,088 8,975 1.26
4 Gixxer 1,008 633 59.24
5 Gixxer 250 208 203 2.46
6 V-Strom 650 10 4 150.00
7 Hayabusa 3 7 -57.14
8 Intruder 0 0 -
ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

సుజుకి హయబుసా (3 యూనిట్లు)

సుజుకి హయబుసా (Suzuki Hayabusa) ఒక పవర్‌ఫుల్ లెజెండరీ మోటార్‌సైకిల్ మరియు ఇందులో తాజాగా వచ్చిన వెర్షన్ మునుపటి కన్నా ఉత్తమమైనదిగా ఉంటుంది. గడచిన ఏప్రిల్ 2022లో, సుజుకి భారతదేశంలో 3 హయబుసా బైక్ లను మాత్రమే విక్రయించింది. సుజుకి బ్రాండ్ కి ఇది చాలా కావాల్సిన మోటార్‌సైకిల్ అయినప్పటికీ, దీని నెలవారీ విక్రయాల మాత్రం 57 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి.

ఏప్రిల్ 2022 నెలలో ఏ సుజుకి టూవీలర్ బెస్ట్ అంటే..?

భారత మార్కెట్లో సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 విడుదల

ఇదిలా ఉంటే, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గడచిన ఏప్రిల్ నెలలో తమ 'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' (Suzuki V-Storm SX 250) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 బైక్ జిక్సర్ 250 (Gixxer 250) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. - ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Suzuki motorcycle model wise detailed sales break up in april 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X