'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో 'సుజుకి మోటార్‌సైకిల్' (Suzuki Motorcycle) తన 'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' (Suzuki V-Storm SX 250) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 బైక్ జిక్సర్ 250 (Gixxer 250) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త 'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ అన్ని రకాల భూభాగాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా తయారుచేయబడింది. అంతే కాకుండా ఈ బైక్ సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా ప్రయాణికులను అనుమతిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ ఒక లైట్ వెయిట్ ఆఫ్ రోడర్ గా ఉపయోగపడుతుంది.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ బైక్ యొక్క ముందుభాగంలో ఉండే నోస్ (ముక్కు) మరియు ఆక్టాగోనల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి ఈ బైక్ ని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ బైక్ లో సౌకర్యవంతమైన రైడింగ్ కోసం అనుకూలమైన సీటు మరియు పొడవైన హ్యాండిల్‌బార్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. కావున సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణికులు సులభంగా వెళ్ళవచ్చు. మొత్తంమీద, సుజుకి V-స్టార్మ్ SX 250 డిజైన్ చాలా ప్రత్యేకమైనదని ఒక్క మాటలో చెప్పవచ్చు. అంతే కాకూండా ఇందులో గ్రాఫిక్స్ మరియు కలర్స్ అన్నీ కూడా ఈ మోటార్‌సైకిల్‌ని ప్రత్యేకంగా చూపించడానికి సహాయపడతాయి.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌ పొందుతుంది. ఈ హెడ్‌ల్యాంప్ కావలసినదానికంటే కూడా ఎక్కువ వెలుతురుని అందిస్తుంది. ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్‌లు, USB ఛార్జింగ్ మరియు ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

వీటితో పాటు ఈ కొత్త సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా పొందుతుంది. ఇది సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా అందించబడుతుంది. కావున ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్, వాట్సాప్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకూండా.. ఎస్ఎమ్ఎస్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ స్టేటస్ వంటివి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ బైక్‌లో 249 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ సుజుకి జిక్సర్250 మరియు జిక్సర్ 250 ఎస్ఎఫ్ లకు కూడా శక్తినిస్తుంది. ఇది 26.5 బిహెచ్‌పి పవర్ మరియు 22.2 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కొత్త సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250 అనేది అడ్వెంచర్ రైడింగ్ కి మాత్రమే కాకూండా రోజువారీ ప్రయాణాలకు కూడా ఉపయోగపడే మల్టీపర్పస్ బైక్.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సుజుకి వి-స్టార్మ్ 250 మూడు విభిన్న కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. కావున కొనుగోలుదారులు వారికి నచ్చిన కలర్ ఎందుకోవచ్చు. మొత్తం మీద ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో 'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' దాని ధర వద్ద 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' మరియు 'యెజ్డీ అడ్వెంచర్‌' వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సుజుకి కంపెనీ తన కొత్త బైక్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో త్వరలో తెలుస్తుంది.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా సుజుకి మోటార్‌సైకిల్స్ ఇటీవల 2022 మార్చి నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈగణాంకాల ప్రకారం, కంపెనీ మార్చి 2022 లో 50,734 యూనిట్ల విక్రయాలతో 15.7 శాతం తగ్గుదలను నమోదు చేసింది. గత సంవత్సరం అంటే 2021 మార్చి ఏళ్లలో కంపెనీ 60,222 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్ 250' బైక్ వచ్చేసింది: ధర & వివరాలు ఇక్కడ చూడండి

కంపెనీ యొక్క దేశీయ మరియు ఎగుమతుల విషయానికి వస్తే, మొత్తం 65,495 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. 2021 మార్చి నెలలో కంపెనీ మొత్తం 69,932 యూనిట్లయూ విక్రయించగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు 2022 మార్చి నెలలో తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Most Read Articles

English summary
Suzuki v storm sx 250 adventure launched price features details
Story first published: Thursday, April 7, 2022, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X