భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp) భారత మార్కెట్లో ఓ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్కి బైక్ ను విడుదల చేసింది. స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ బైక్‌ ధర రూ. 1.65 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 120 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని మరియు గరిష్టంగా గంటకు 120 కిమీ టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

స్విచ్ సిఎస్ఆర్ 762 ఇ-బైక్ పై ఫేమ్-2 పథకం కింద, వినియోగదారులకు రూ.40,000 సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది. ఈ బైక్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు కంపెనీ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టింది. స్విచ్ సిఎస్ఆర్ 762 సాంప్రదాయ ఎలక్ట్రిక్ టూవీలర్ల మాదిరిగా కాకుండా, చాలా ప్రత్యేకమైన మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇదొక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ మరియు దీని టాప్ స్పీడ్ 120 kmph. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి, రైడర్ ఎంచుకునే మోడ్ ని బట్టి రేంజ్ మారుతుంది.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

స్విచ్ సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ బైక్ అనేక అధునాతన ఫీచర్లతో అమర్చబడి ఉంటుంది. ఇందులో యాంటీథెఫ్ట్ అలారం, సైడ్ స్టాండ్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, టిఎఫ్‌టి డిజిటల్ టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ బైక్‌ లోని లైటింగ్‌ అంతా ఎల్‌ఈడీలోనే ఉంటుంది. భద్రత కోసం, ఇది డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు డ్యూయల్ ఛానెల్ ఏబిఎస్ ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్ మరియు స్పోర్ట్ మోడ్ వంటి 6 ప్రత్యేకమైన రైడ్ మోడ్ లు ఉన్నాయి.

ఇక పవర్ ట్రైన్ విషయానికి వస్తే, స్విచ్ మోటోకార్ప్ ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లో శక్తివంతమైన 3kW ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 1300 ఆర్‌పిఎమ్ వద్ద 10kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది సెంట్రల్ డ్రైవ్ సపోర్ట్ సిస్టమ్‌తో వచ్చే PMSM మోటార్‌ తో అమర్చబడి ఉంటుంది. అంటే, ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సెంటర్ లో అమర్చబడి ఉండి బెల్ట్ డ్రైవ్ లేదా చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని పంపిస్తుంది. ఈ ఇ-బైక్ లోని మోటార్ 3.7kWh లిథియం అయాన్ ప్యాక్ తో పనిచేస్తుంది.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఇందులో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే, ఇది తొలగించదగిన (రిమూవబల్) బ్యాటరీని కలిగి ఉంటుంది, కాబట్టి, వీటిని విడిగా తీసి చార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్ కొత్త మరియు బలమైన ఛాసిస్‌పై రూపొందించబడింది, ఇది మెరుగైన నియంత్రణను ఇస్తుంది మరియు దీని డిజైన్ కూడా చాలా స్పోర్టిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ బైక్, వినియోగదారులను పెట్రోల్ బైక్‌లు వదిలి ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

స్విచ్ సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ బైక్ యొక్క కర్బ్ వెయిట్ 155 కిలోలుగా ఉంటుంది మరియు ఇది 200 కిలోల బరువును మోయగలదు. దీని వీల్ బేస్ 1,430 మిమీ మరియు సీట్ ఎత్తు 780 మిమీగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో టోర్క్ క్రాటోస్ మరియు ప్యూర్ ఇట్రస్ట్ 350 వంటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ లతో పోటీ పడగలదు. ఈ రెండు బైక్‌లు కూడా ఫుల్ ఛార్జ్‌ పై వరుసగా 120 కిమీ మరియు 140 కిమీల రేంజ్‌ను అందిస్తాయి. ఇది కాకుండా, వాటి బ్యాటరీ, మోటార్ పవర్ మరియు ఫీచర్లు కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

స్విచ్ మోటోకార్ప్ తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ ను లాంచ్ చేయడంతో పాటు, బ్యాటరీ మార్పిడి స్టేషన్‌ ను కూడా ప్రారంభించాలని కంపెనీ పరిశీలిస్తోంది. భారత ప్రభుత్వ బ్యాటరీ మార్పిడి విధానాల ప్రకారం, తమ స్వాపింగ్ స్టేషన్లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. స్విచ్ మోటోకార్ప్ భారతదేశంలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ ను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం, కంపెనీ దేశవ్యాప్తంగా 15 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌ లను నిర్వహిస్తోంది మరియు రాబోయే కాలంలో మరిన్ని కొత్త నగరాలకు తమ డీలర్‌షిప్‌లను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

స్విచ్ ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా ఉన్నాయ్..

స్విచ్ మోటోకార్ప్ ముందుగా ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీతో తమ ఈవీ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ మూడు రకాల ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ స్విచ్ ఎలక్ట్రిక్ సైకిళ్లలో 250 వాట్ డిసి మోటార్ ఉంటుంది. దీని సాయంతో రైడర్ గంటకు 25 కిమీ వేగంతో సైకిల్ ను నడపవచ్చు. ఒకవేళ రైడర్ బ్యాటరీ పవర్‌కు పెడలింగ్ పవర్‌ను కూడా జోడించినట్లయితే గరిష్టంగా గంటకు 45 కిమీ దూసుకెళ్లిపోవచ్చు.

భారత మార్కెట్లో స్విచ్ సిఎస్ఆర్ 762 (Svitch CSR 762) ఎలక్ట్రిక్ బైక్ విడుదల: ధర, ఫీచర్లు

స్విచ్ సైకిళ్లలో ఉపయోగించిన బ్యాటరీలు సుదీర్ఘమైన రేంజ్‌ను కలిగి ఉంటాయి, వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, స్విచ్ ఎలక్ట్రిక్ సైకిళ్లు ఫోల్డబిల్ డిజైన్ ను కలిగి ఉండి, కార్లలో తీసుకువెళ్లడానికి కూడా సులువుగా ఉంటాయి. వీటిలోవెడల్పాటి టైర్లు, డ్యూయెల్ సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు, డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ మరియు డిజిటల్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Switch motocorp launches csr 762 high speed electric bike in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X