ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

భారతదేశంలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. ఓలా, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మరియు ఒకినావా వంటి అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. అయితే, పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెట్రోల్ స్కూటర్ల విక్రయాలపై ప్రభావం చూపుతున్నాయో లేదో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోలిస్తే పెట్రోల్ స్కూటర్లు చాలా ఖరీదైనవి మరియు మెయింటినెన్స్ విషయంలో కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ప్రస్తుతం, దేశంలో ఇంధన ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకే ఎక్కువ ఇష్టపడతున్నారు. అయినప్పటికీ, దేశంలో పెట్రోల్ స్కూటర్ల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడచిన ఏప్రిల్ నెలలో భారత్‌లో మొత్తం 3,43,345 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2021లో విక్రయించిన 2,69,477 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 25.52 శాతం వృద్ధిని సాధించాయి.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

గత ఏప్రిల్ 2022లో భారతదేశంలో అత్యధికంగా విక్రయించబడిన టాప్ 10 స్కూటర్ల జాబితాను పరిశీలిస్తే, హోండా అందిస్తున్న పాపులర్ స్కూటర్ హోండా యాక్టివా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 1,63,357 యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2021లో విక్రయించిన 1,09,627 యూనిట్ల స్కూటర్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 48.94 శాతం వృద్ధి సాధించి. ప్రస్తుతం ఈ స్కూటర్ భారత టూవీలర్ మార్కెట్‌లో 47.17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ జాబితాలో దేశంలోని మరే ఇతర టూవీలర్ కంపెనీ కూడా ఒకే బ్రాండ్ కి చెందిన స్కూటర్ ను 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించలేదు.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది హోండా యాక్టివాకు పోటీగా టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న జూపిటర్ స్కూటర్. గత ఏప్రిల్ 2022 నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 60,957 స్కూటర్లను విక్రయించింది. గతేడాది ఏప్రిల్‌ 2021 నెలలో కేవలం 25,570 జూపిటర్ స్కూటర్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు ఏకంగా 138.9 శాతం పెరిగాయి. హోండా యాక్టివా తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇదే. ప్రస్తుతం, భారత స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ మార్కెట్ వాటా 17.6 శాతంగా ఉంది.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

ఇదిలా ఉంటే, టీవీఎస్ బ్రాండ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కోరుకునే వారి కోసం కంపెనీ ఐక్యూబ్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా విక్రయిస్తోంది. కంపెనీ ఇందులో ఇటీవలే ఓ కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దాని రేంజ్ పూర్తి చార్జ్ పై 100 నుండి 140 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మరియు ఈ స్కూటర్లు గరిష్టంగా గంటకు 70-85 కిమీ వేగంతో పరుగులు తీస్తాయి.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

ఇక ఈ జాబితాలో తదుపరిది (మూడవ) స్థానంలో ఉన్న సుజుకి యాక్సెస్ స్కూటర్. గత నెలలో మొత్తం 32,932 యూనిట్ల సుజుకి యాక్సెస్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. అయితే, ఏప్రిల్ 2021 నెలలో విక్రయించిన 53,285 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 38.20 శాతం తగ్గాయి. ఇక ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది టీవీఎస్ అందిస్తున్న స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్. గత ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 25,267 టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 19,959 యూనిట్లు ఉన్నాయి. ఈ సమయంలో టీవీఎస్ ఎన్‌టార్క్ అమ్మకాలు 26.59 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ మార్కెట్ వాటా 7.30 శాతంగా ఉంది.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

హోండా అందిస్తున్న స్పోర్టీ స్కూటర్ డియో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. మార్కెట్లోకి కొత్త మోడళ్లు రావడంతో హోండా డియో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో మొత్తం 16,033 హోండా డియో స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌ 2021 నెలలో విక్రయించిన 17,269 యూనిట్లతో పోలిస్తే, 7.16 శాతం తగ్గాయి. ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ స్కూటర్. ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 13,303 ప్లెజర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇవి 18,298 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమ్మకాలు 32.76 శాతం క్షీణించాయి.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

సుజుకి నుండి తాజాగా మార్కెట్లో వచ్చిన అవెనిస్ స్కూటర్ గత నెలలో 7వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 11,078 యూనిట్ల సుజుకి అవెనిస్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇది ఇటీవలే మార్కెట్లో విడుదలైంది. తదుపరి స్థానంలో ఉన్నది సుజుకి బెర్గ్‌మాన్ మాక్సీ స్కూటర్. గత నెలలో మొత్తం 9,088 యూనిట్ల స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2021 నెల విక్రయించిన8,154 యూనిట్లతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 11.45 శాతం పెరిగాయి.

ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..

కాగా, హీరో డెస్టినీ 125 స్కూటర్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. గత ఏప్రిల్‌ నెలలో మొత్తం 8,981 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 9,121 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సమయంలో అమ్మకాలు 1.53 శాతం తగ్గాయి. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది టీవీఎస్ పెప్ ప్లస్. గత నెలలో మొత్తం 6329 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో విక్రయించిన 8143 స్కూటర్లతో పోలిస్తే, ఏప్రిల్ 2022 నెలలో అమ్మకాలు 22.28 శాతం తగ్గాయి.

Most Read Articles

English summary
Top 10 best selling scooters in april 2022 honda activa takes the top spot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X